Karthika Deeppam September 20th: కథని మలుపుతిప్పనున్న మోనిత కొడుకు ఆనంద్, దీప చెప్పింది వినగానే కళ్లు తిరిగిపడిపోయిన కార్తీక్
బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ నుంచి మోనితను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది వంటలక్క...
Karthika Deepam September 17th Episode 1462 (కార్తీకదీపం సెప్టెంబరు 20 ఎపిసోడ్)
కార్తీక్ కి దీప కాఫీ ఇస్తుంది..ఇంతలో ఆవేశంగా ఎంట్రీ ఇస్తుంది మోనిత. వచ్చీరాగానే ఎందుకింత ఆవేశం.. ఈ బాబు ఎవరు అని అడుగుతాడు కార్తీక్.
మోనిత: వీడు మన బాబు కార్తీక్, వీడ్ని తేవడానికి వెళ్తానని చెప్పాను కదా
దీప: ఎక్కడికి వెళ్ళావో అనుకున్నాను ఆనంద్ ని తేవడానికి వెళ్లేవా అని అనుకుంటుంది.ఇంతలో ఆనంద్ ఏడుస్తూ ఉంటాడు. మోనిత ఎత్తుకున్నా, శివ ఎత్తుకున్నా ఏడుపు ఆపడు. అప్పుడు దీప...డాక్టర్ బాబు మీరు ఎత్తుకుని చూడండి బాబు ఏడుపు ఆపుతాడు అంటుంది.
కార్తీక్ ఎత్తుకోగానే బాబు ఏడుపు ఆపేస్తాడు....అప్పుడు మోనిత నేను తొందరపడ్డానా ఏంటి అనుకుంటుంది.
కార్తీక్: బాబు నా దగ్గరకు రాగానే ఏడుపు ఆపేశాడు..
దీప: బాబు అంతుకుముందే మీకు బాగా అలవాటేమో..బాగా ఆలోచించండి బాబుని చూడగానే ఏమైనా గుర్తొస్తున్నాయా.. ఆలోచించండి డాక్టర్ బాబు...
మోనిత: అవసరం లేదు కార్తీక్..ఆ బాబుకి అమ్మని, భార్యని.. నీకు అన్నీ గుర్తుచేయడానికి నేనున్నాను కదా... బిడ్డకి తండ్రి స్పర్శ తెలిసిపోతుందట అందుకే నువ్వు ఎత్తుకోగానే ఏడుపు ఆపేశాడు..
కార్తీక్: నా కొడుకును ఎత్తుకునేందుకు జ్ఞాపకాలతో పనేంటి... వంటలక్కా నా కొడుకుని చూశావా...
దీప: ఈయనకు గతం గుర్తొస్తుందని బాబుని ఇప్పిస్తే ఇలా జరిగిందేంటి అనుకుంటుంది..
మోనిత..కార్తీక్, ఆనంద్ ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది....
ఏమైందమ్మా అర్జెంటుగా పిలిచావని డాక్టర్ అన్నయ్య వస్తాడు. మోనిత వాళ్లింట్లో దీప తీసుకొచ్చి రిపోర్ట్ చూపిస్తుంది.
డాక్టర్ అన్నయ్య: నువ్వు ఈ విషయం మీద కాదమ్మా ఇంకా ఏదో విషయం మీద బాధపడుతున్నట్టు ఉన్నావు ఏమైంది
దీప: మోనిత తన బిడ్డ నీ తీసుకొని వచ్చింది. దీనివల్ల డాక్టర్ బాబు గుర్తొచ్చే అవకాశం ఉంటుందని ఆశపడ్డాను కానీ మోనిత దాన్ని తారుమారు చేసింది
డాక్టర్ అన్నయ్య: అది డాక్టర్ బాబుకి... మోనిత కి పుట్టిన బిడ్డా?
దీప: అవును అన్నయ్య చెప్పాను కదా, డాక్టర్ బాబుని వలలో వేసుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేసింది.ఆఖరికి తన డాక్టర్ తెలివితేటలు వాడి డాక్టర్ బాబుకి ఇష్టం లేకపోయినా బిడ్డను కన్నది అని చెప్తుంది.
అన్నయ్య: సర్లే అమ్మ గతం గుర్తొస్తే చాలు, నేను నాకు తెలిసిన డాక్టర్లకి రిపోర్ట్ చూపి సమస్య ఏంటో కనుక్కుంటాను అని వెళ్ళిపోతాడు
ఆ తర్వాత దీప...కూరగాయలు కట్ చేస్తూ గతం గురించి ఆలోచిస్తూ ఉండగా తన చెయ్య కట్ చేసుకుంటుంది. అప్పుడే అక్కడకు వచ్చిన కార్తీక్ అయ్యో వంటలక్క నొప్పిగా ఉందా అని అంటాడు.అప్పుడు దీప,నాకు అలవాటు లెండి డాక్టర్ బాబు,ఏదో పని మీద వచ్చినట్టున్నారు ఏంటి అని అడుగుతుంది దీప.అప్పుడు కార్తీక్,ఉదయం కాఫీ ఇచ్చావు కదా మోనిత కింద పడేసింది అందుకే సారీ చెబుదామని వచ్చాను అని అంటాడు. ఆగండి డాక్టర్ బాబు ఇప్పుడే మళ్ళీ కాఫీ చేస్తాను అని దీప వెళ్లి కాఫీ తెస్తుంది.అప్పుడు కాఫీ తాగుతున్న కార్తీక్ నీ దీప, మీ సొంత ఊరు ఏంటి డాక్టర్ బాబు? అని అడుగుతుంది. గుర్తులేదు అని కార్తీక్ అనగా మీ సొంతూరు హైదరాబాద్ అంటుంది.
కార్తీక్: మోనిత ఇంకా ఏదో అన్నట్టు గుర్తు నాకు,అవునూ అమ్మ నాన్నలు ఉన్నారా
దీప:మీకు అమ్మానాన్న,భార్య, పిల్లలు, అందరూ ఉన్నారు గుర్తు తెచ్చుకోండి
కార్తీక్ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించిగా చాలా అస్పష్టమైన బొమ్మలు కనిపిస్తాయి. కార్తీక్ ఎక్కడ అని మోనిత ఇల్లంతా వెతుకుతూ ఉండగా శివ,ఎక్కడికి వెళ్ళి ఉంటారు మేడం మహా అయితే వంటలక్క ఇంటికి వెళ్ళుంటారు అని అంటాడు. అప్పుడు మోనిత అక్కడికి వెళ్తుంది...ఇంతలో కార్తీక్ కళ్లు తిరిగి పడిపోతాడు. మోనిత వచ్చి నీళ్లు చల్లి లేపుతుంది.
కార్తీక్: నేనెక్కడున్నాను? ఇక్కడ ఎందుకు ఉన్నాను?
మోనిత: నువ్వు నేను వంటలకు మాట్లాడడానికి వచ్చాం కార్తీక్
శివ: ఎంత తేలిగ్గా ప్లేటు మార్చేసారు మేడం అనుకుంటాడు.
మనం ఏం మాట్లాడుకుంటున్నాం అని కార్తీక్ అనగా, ఇప్పుడు వద్దులే కార్తీక్ ముందు ఇంటికి వెళ్దాం తర్వాత మాట్లాడదాం అని కార్తీక్ నుంచి తీసుకెళ్లి పోతుంది మోనిత.
Also Read: వసుధారకు చాలా చాలా ద గ్గ ర గా రిషి, ఈగోమాస్టర్లో మరో యాంగిల్!
దీప:డాక్టర్ బాబుకి ఏదో గతం గుర్తొచ్చినట్టుంది అందుకే కళ్ళు తిరిగి పడిపోయారు. అంటే గతం గుర్తొచ్చే అవకాశం బాగానే ఉంది అనుకుంటుంది
మోనిత: కార్తీక్ కళ్ళు తిరిగి పడిపోయాడంటే దీప ఏమైనా గతం గుర్తు తెచ్చే ప్రయత్నాలు చేసిందా? అయినా అదున్నది ప్రయత్నాలు చేయడానికి కదా,ఇలా ఉంటే కష్టం ....బాబుని, కార్తీక్ ని తీసుకుని ఎక్కడికైనా వెళ్లిపోవాలి అనుకుంటుంది.
ఇంతలో కార్తీక్ అక్కడకు వచ్చి... మోనిత బాబు పేరు ఏంటని అడుగుతాడు..ఎందుకులే కార్తిక్ పేరు చెప్పినా సరే మళ్లీ మర్చిపోతావు అంటుంది. మర్చిపోతే మళ్ళీ నిన్ను అడుగుతాను చెప్పు మోనిత అని అనగా ఆనంద్ అని అంటుంది మోనిత ఈ పేరు ఎక్కడో విన్నట్టున్నదే అని కార్తీక్ అంటాడు.
ఎపిసోడ్ ముగిసింది.
రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
నా కొడుకుని ఎత్తుకుని మురిసిపోయినప్పుడు టెన్షన్ పడ్డాను...ఆ బాబుని ఎత్తుకున్నప్పుడల్లా అలా గతం గుర్తుచేసుకున్నా చాలు ఆ గతంలో నేనుంటానని కాన్ఫిడెంట్ గా చెబుతుంది దీప.. ఆ ఛాన్సేలేదంటుంది మోనిత...