Guppedantha Manasu October 24th Update: అజ్ఞాతవాసం చేస్తోన్న జగతి-మహేంద్ర, దేవయానికి షాకిచ్చి రిషిని ఆలోచనలో పడేసిన వసు
Guppedantha Manasu October 24th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్ ( Guppedantha Manasu October 24th Today Episode 589)
రిషి..తండ్రిని తలుచుకుని బాధపడుతుంటాడు. వసుధార ఓదార్చుతుంది. డాడ్ వాళ్లు వస్తారంటావా వసుధారా అని అడుగుతాడు. వాళ్ళు నన్ను వదిలేయడమేంటి నేను ఈ మధ్య కొన్ని విషయాల్లో డాడ్ విషయాల్లో డాడ్ తో కఠినంగా మాట్లాడాను అది కూడా దేవయాని పెద్దమ్మ విషయంలోనే, పెద్దమ్మ కి గౌరవం తగ్గేటట్టు మాట్లాడినందుకు డాడ్ తో కఠినంగా మాట్లాడాను అది తప్పా వసుధార. నేను ఏమైనా తప్పు చేశానా
వసు: నాకు తెలిసి దీనికంతటికీ మూలం దేవయాని మేడమే అనే నమ్మకం నాకుంది.. ఏదో రోజు ఆవిడ అసలు రంగు తెలుస్తుంది అని వసు అనుకుంటూ మీరు బాధపడొద్దు సార్ మేడం, సార్ ఎప్పటికైనా దొరుకుతారు అని ధైర్యం చెబుతుంది.
రిషి: నువ్వు మీ మేడం మంచి ఫ్రెండ్సే కదా వసుధార ఒకవేళ నీకు గాని వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలుసా
వసు: నన్ను అనుమానిస్తున్నారా సార్
రిషి: మీరిద్దరూ అన్ని బంధాలను దాటిన గొప్ప బంధం కదా. ఇది చెప్పలేదా
వసు: నాకు తెలియదు సార్ జీవితాంతం మీతో నడాల్సిందాన్ని నన్ను అనుమానిస్తున్నారా నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి
రిషి: కనీసం నీకైనా చెప్పుంటే బాగుండు కదా నేను మేడమ్ కి వర్క్ గురించి మెయిల్ పెట్టాను నువ్వు కూడా పెట్టు. ఈ రకంగా నైనా వాళ్ళు వస్తారు కదా వస్తారంటావా
వీరిద్దరి మాటలు చాటునుంచి విన్న దేవయాని.. ఇంత తెలివైన అమ్మాయిని రిషి జీవితంలో ఉండనీయకూడదనుకుంటూ వెళ్లిపోతుంది..
Also Read: రిషిని ఒంటరివాడిని చేసేందుకు దేవయాని మరో కుట్ర, ఇంట్లోకి అడుగుపెట్టి షాక్ ఇచ్చిన వసుధార
ఆ తర్వాత కిచెన్లోకి వెళ్లేసరికి పాలు పొంగుతుంటే వసుధార ఆపుతుంది.
ధరణి: చిన్న అత్తయ్య చిన్న మావయ్య లేనప్పుడు ఇల్లు ఏదోలా ఉంది వసు వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు అంటే నాకు ఇంకా నమ్మశక్యంగా లేదు. నువ్వు ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావో
వసు: బలహీనంగా ఉన్న సమయంలోనే ధైర్యంగా ఉండాలి మేడం అప్పుడే మనకు ఎదిరించే శక్తి వస్తుంది తట్టుకోగలం
కాఫీ ధరణికి ఇచ్చేసి రిషికి ఇచ్చేందుకు తీసుకెళుతుంది..ఇంతలో దేవయాని ఎదురుపడుతుంది... కాఫీ కావాలా అని వసు అడుగుతుంది
దేవయాని: ఇదేమీ నీ రెస్టారెంట్ కాదు నా ఇల్లు నా రాజ్యం నాకు ఏది నచ్చితే చేస్తాను
వసు: థాంక్యూ మేడం మీకు కాఫీ పెట్టే లోపల సార్ కాఫీ చల్లారిపోయేది సమయం మిగిల్చారు
దేవయాని: ధరణీ అని పిలిచి..పిలవని పేరంటానికి వచ్చినవాళ్లు ఎన్నాళ్లుంటారో..
వసుధార: ధరణి మేడంని అడగడం ఏంటి నన్ను అడగండి అంటూ..రిషి సార్ ఎప్పుడు నన్ను వెళ్ళమంటే అప్పుడే వెళ్తాను అప్పటి వరకు ఇంట్లోనే ఉంటాను. జగతి మేడం, మహేంద్ర సార్ వచ్చేవరకు ఇక్కడే ఉండాల్సి వస్తుందేమో మీరు కూడా వాళ్ళని వెతకండి నిజంగా నన్ను పంపాలనుకుంటే రిషి సార్ కి చెప్పండి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఇది రోజురోజుకీ బాగా ముదిరిపోతోంది..నాకే ఎదురు సమాధానాలు చెబుతోందంటే ఆలోచించాల్సిందే అనుకుంటుంది దేవయాని.
అటు రూమ్ లో రిషి..తండ్రి రాసిన వెళ్తున్నాం అన్ వర్డ్స్ చూస్తూ బాధపడుతుంటాడు. ఇంతలో వసుధార కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది.
రిషి: పద వసుధార మనం కాలేజ్ కి వెళ్దాం డాడ్ వాళ్లకి అఫీషియల్ గా మెయిల్ పెట్టాను కదా పని విషయం మీద అయినా వస్తారు
రిషి సార్ మీ మీద నమ్మకంతో ఉన్నారు మేడం కచ్చితంగా రండి వస్తే బాగుండు అని మనసులో అనుకుంటుంది వసుధార..
Also Read: సీరియల్ లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దీప - దుర్గకి స్పాట్ పెట్టిన మోనిత, ఇరుక్కుపోయిన కార్తీక్
జగతి మహేంద్రలు ఒక ఇంట్లో కూర్చుని ఆలోచనలో ఉంటారు. అప్పుడు పక్కనే ఉన్న గౌతమ్ తో రిషి ఎలా ఉన్నాడు అని అడుగుతారు. దానికి గౌతమ్, తెలిసిందే కదా మీ గురించే కంగారుపడుతూ వెతికేస్తున్నాడు మీకు మెయిల్ కూడా పెట్టాడు వర్క్ కి కాలేజీకి వస్తారేమో అనడంతో... రిషి గురించి మాకు తెలుసు.తన తపన మాకు అర్థమవుతుంది కానీ ఇది అవసరం గౌతమ్ వర్షాకాలం అప్పుడే ఎండ విలువ తెలుస్తుంది, ఎండాకాలం అప్పుడే వర్షం విలువ తెలుస్తుంది. ఇలా ఉంటేనే రిషి మమ్మల్ని అర్థం చేసుకుంటాడు అని అంటారు. అప్పుడు జగతి మహేంద్రతో...మనం గౌతమ్ వాళ్ళ ఇంట్లో ఉండడం గౌతమ్ కి బానే ఉంటుందా? ఇబ్బందేమో అనడంతో అదేం లేదు మేడం అంటాడు గౌతమ్.
మహేంద్ర:ఓ సమస్య వచ్చింది గౌతమ్ దాని పరిష్కరించడానికి మేము వచ్చాం అందుకే అజ్ఞాతవాసం మాకు తప్పదు మేమిక్కడ ఉన్నట్టు ఎవరికీ చెప్పొద్దు
గౌతమ్: అదే నా బాధ అంకుల్ రిషి అడిగితే నేను అబద్ధం చెప్పలేను అలాగని నిజం దాయలేను
మహేంద్ర: ఓ మంచి కోసం ఒక అబద్ధం మంచిదే గౌతమ్
వసు కాలేజ్ బయట కూర్చుని ఆలోచిస్తూ ఒక రకంగా వాళ్ళు వెళ్లిపోవడానికి నేను కారణమేనా! జగతి మేడం చెప్పినట్టు చీర కట్టుకోలేదని, ఇంకా గురుదక్షిణ ఒప్పందం గురించి నేను పట్టు పడుతున్నానని కూడా వాళ్ళు వెళ్లిపోయి ఉండొచ్చు కదా.ఇదంతా నా వల్లే జరిగిందా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి అక్కడికి వచ్చి, ఎందుకు వెళ్లిపోయారు వస్తారా నన్ను నిలదీసి అడగాలి కదా నేను ఏమైనా తప్పు చేసినట్లయితే. అసలు నేనేం తప్పు చేశాను అంటాడు.
వసు: దేవయాని గురించి ఆలోచిస్తూ మీ ముందే సమాధానం ఉంది సార్ మీరు తెలుసుకోలేకపోతున్నారు
రిషి: అయితే నాకేం తెలీదు అంటావా వసుధార..నేను ఏమైనా తప్పు చేస్తే నన్ను అడగాలి గాని ఇలా వెళ్లిపోవడం ఏంటి
వసు: మహేంద్ర సార్ ఎక్కడికి వెళ్లారని మీరు అనుకుంటున్నారు సర్ ఎందుకు వెళ్ళుంటారు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ జగతి మేడం విషయంలో మీ నిర్ణయం మార్చుకుంటే ....
రిషి: ఆపేయ్ వసుధార అటువైపు వెళ్ళొద్దు అంటాడు.
ఎపిసోడ్ ముగిసింది