News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Guppedantha Manasu October 22nd Update: రిషిని ఒంటరివాడిని చేసేందుకు దేవయాని మరో కుట్ర, ఇంట్లోకి అడుగుపెట్టి షాక్ ఇచ్చిన వసుధార

Guppedantha Manasu October 22nd Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 
Share:

గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్  ( Guppedantha Manasu  October 22nd Today Episode 588)

దేవయాని మాటలకు..మహేంద్ర-జగతి ఇద్దరూ ఇంట్లోంచి వెళ్లిపోతారు. రిషి ఆనందం కోసం మనిద్దరం కలసి అందిస్తున్న కానుక ఇది అనుకుందాం అంటుంది జగతి. అదే సమయంలో దేవుడు నాకిచ్చిన కానుక నువ్వు అని రిషి అంటే.. మీరే దేవుడిచ్చిన కానుక అంటుంది వసు. చీకటి అందంగా ఉందని రిషి..ఈ రాత్రి ఎప్పటికీ చీకటి  రాత్రిగా మిగిలిపోతుందని మహేంద్ర అంటాడు. వసుని తన రూమ్ దగ్గర దించేసి రిషి ఇంటికి వెళతాడు... తెల్లారగానే వసు ఫోన్ కి వరుస మెసేజెస్ వస్తాయి. టైమ్ ఎంత అయిందో అనుకుని ఫోన్ ఓపెన్ చేస్తుంది. జగతి నుంచి మెసేజెస్ వస్తాయి. మిషన్ ఎడ్యుకేషన్ ఫైల్స్ అన్నీ పంపించిన జగతి..వసు ఇకపై ఇవన్నీ నువ్వే చూసుకో అని మెసేజ్ చేస్తుంది. కాల్ చేస్తే స్విచ్చాఫ్ వస్తుంది. ఇవన్నీ నాకెందుకు పంపించినట్టు  అర్థం కావడం లేదు అనుకుంటుంది.

Also Read: అనుమానంతో ఊగిపోయిన మోనితకు చెంపదెబ్బ, చూస్తూ నిల్చున్న కార్తీక్ - షాక్ లో దీప

అటు అదే సమయంలో రిషి..మహేంద్ర రూమ్ కి వెళ్లి డాడ్ అని పిలుస్తాడు. డాడ్ అప్పుడే లేచారా ఎక్కడికి వెళ్లిఉంటారని రూమ్ మొత్తం చూస్తుంటాడు. ఫొటో ఫ్రేమ్ లో ఉన్న ఫొటో తీసేసి..వెళ్తున్నాం అని రాసి ఉండడం చూస్తాడు. అసలు వెళ్లడం ఏంటంటూ దేవయాని దగ్గరకు వెళ్లి ..ఏంటిది అని అడుగుతాడు. ఎక్కడికి వెళ్లారో మీకు తెలియదా..మీరు చూడలేదా అంటాడు ( దేవయాని తాను అన్న మాటలు తలుచుకుంటుంది)..
దేవయాని: వెళుతుంటే నేను ఆపాను రిషి ఆగలేదు..
రిషి: డాడ్ వెళుతుంటే నాకు చెప్పాలి కదా..డాడ్ వెళ్లడం ఏంటి..
రిషి కంగారుగా కాల్ చేస్తే..స్విచ్చాఫ్ వస్తుంది..
దేవయాని ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తుంది..కానీ ..వాళ్లేమన్నారని కాదు మీరెలా వెళ్లనిచ్చారు..గొడవ ఏమైనా జరిగిందా మీరేమైనా అన్నారా అని అడుగుతాడు
దేవయాని: నన్ను అంటున్నావేంటి..నేను ఏమంటాను. బయటకు వెళుతున్నారు కదా ఏదో జాలీ ట్రిప్ అనుకున్నాను
రిషి: మీరు నాకు అప్పుడే చెప్పాలి కదా..
దేవయాని: బయటకు వెళుతున్నారు అనుకున్నాను కానీ ఇంట్లోంచి వెళ్లిపోయారని అనుకోలేదు..
తండ్రిని తలుచుకుని రిషి టెన్షన్ పడతాడు.. నాపై ప్రేమతో మీరు ఆయన్ని ఏమైనా అన్నారా అని అడిగితే.. మీకు డాడ్ కి మధ్య ఎప్పుడూ ఏవో గొడవలు జరుగుతూ ఉంటాయికదా నిజం చెప్పండి పెద్దమ్మా అని నిలదీస్తాడు..
దేవయాని: అసలు ఇలా జరిగిందని నాకు తెలియదు..మహేంద్రని నేనేం అంటాను చెప్పు...
రిషి: పోనీ మేడంని ఏమన్నా అన్నారా..చెప్పండి పెద్దమ్మా..మీకు దండం పెడతాను ఏమన్నారో చెప్పండి...
నేనెందుకు అంటాను రిషి అని దేవయాని దొంగ ఏడుపు ఏడుస్తుంది...
పెద్దమ్మా..ఏదో జరిగింది  లేదంటే డాడ్ ఎక్కడికీ వెళ్లరు కదా...పెద్దమ్మా మీరు నాకు నిజం చెబుతున్నారా..నిజం చెప్పడం లేదు కదా అని నిలదీస్తాడు..
ఇంతలో గౌతమ్ అక్కడకు వచ్చి ఏమైందని అడుగుతాడు..
దేవయాని: జగతి మహేంద్రలు ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయారు. వెళ్లేవాళ్లు అడ్రస్ చెప్పి వెళతారా ఏంటి.. రిషిని బాధపెట్టాలని, నాపై నిందలు మోపాలని వెళ్లారు
గౌతమ్: రేయ్ అంకుల్ నిన్ను వదిలేసి ఎలా వెళతారు
దేవయాని: అయినా ఇవేం బుద్ధులు..అలా వెళ్లడం ఏంటి.. వద్దు వద్దు అంటే ఆ జగతిని ఇంట్లోకి తీసుకొచ్చారు..ఇప్పుడు తండ్రి కొడుకులను దూరం చేసింది
గౌతమ్: పెద్దమ్మా మీరు ఆగండి ప్లీజ్.. రిషి నా మాట వినరా..అంకుల్ వాళ్లు ఎక్కడికి వెళతారు..ఏదో అలిగారేమో.. వచ్చేస్తారు..అంకుల్ సంగతి నీకు తెలుసుకదా అని కాల్ చేస్తాడు..స్విచ్చాఫ్ వస్తుంది...
డాడ్ ఇలా చేయరు కదా అని రిషి కన్నీళ్లు పెట్టుకుంటే.. ప్రేమ ఉండి ఉంటే వెళ్లేవారా అని దేవయాని ఆజ్యం పోస్తుంది.. ఇదంతా ఆవిడగారి ప్లానే అయి ఉండొచ్చని మరింత మంటపెట్టే ప్రయత్నం చేస్తుంది...
రిషిని కూల్ చేసేందుకు గౌతమ్ ప్రయత్నిస్తాడు...నేను వెళ్లి చూస్తాను అంకుల్ ఎక్కడికీ వెళ్లరు కదా అంటాడు.. 
దేవయాని: కావాలని తప్పించుకుని వెళ్లినవాళ్లని ఎక్కడని వెతుకుతారు అనేసి.. అయినా వాళ్లు నేనన్న మాటలకు గుమ్మం కూడా తొక్కరు అనుకుంటుంది..
ఇంతలో రిషి..నేను ఏమైనా తప్పు చేశానా అనగానే..దేవయాని డ్రామా స్టార్ట్ చేస్తుంది...తల్లిదండ్రులపై మరింత కోపం పెంచుతుంది. ఇక రిషి నా చేతుల్లోనే ఉంటాడు కదా అని అనుకుంటుంది దేవయాని..

Also Read: రిషి ఒడిలో వసు, ఇంట్లోంచి వెళ్లిపోయిన జగతి-మహేంద్ర, 'గుప్పెడంతమనసులో' కీలక మలుపు

అటు వసుధారని కలసిన గౌతమ్..జరిగినదంతా చెబుతాడు. రిషి ఎంత సెన్సిటివ్ తెలుసుకదా..నువ్వు రిషి సంగతి చూసుకో, నేను అంకుల్ వాళ్లు ఎక్కడున్నారో వెతుకుతానంటాడు గౌతమ్. వసుధార వెంటనే రిషి దగ్గరకు బయలుదేరుతుంది.  మరోవైపు రిషి..దేవయాని దగ్గర మహేంద్ర గురించి చెప్పి బాధపడతాడు. 
రిషి: డాడ్ కి  నా మీద కోపం వస్తే నన్ను తిట్టే హక్కు డాడ్ కి ఉంది కదా ఎప్పుడూ నా మీద కోపం వచ్చినా సరే నన్ను తిట్టరు ఎందుకంటే నేను బాధపడతాను అని నామీద మాట కూడా ఎప్పుడు విసరలేదు.అలాంటి డాడ్ నన్ను ఇలా వదిలేస్తున్నారంటే ఏదో తప్పు జరిగింది పెద్దమ్మ నేను డాడ్ ని అంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలుసు కదా అని రిషి అంటాడు.
దేవయాని: పోనీలే పెద్దమ్మ వాళ్ళిద్దరూ వెళ్లిపోయారు కదా నాకు మీరున్నారు అదే చాలు వాళ్ళతో నాకెందుకు అని అంటాడు అని అనుకుంటే ఇలా జరిగిందేంటనుకుంటుంది మనసులో. ( జగతి వల్ల అని ఏదో చెబుతుంటే లేదు పెద్దమ్మా డాడ్ ఎప్పటికీ నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటాడు)
ఇంతలో వసుధారకిందనుంచి సార్ అని అరుస్తుంది.. రిషి దేవయాని అక్కడకు వెళతారు
సర్ మీరు బానే ఉన్నారా అని అడిగితే..డాడ్ కనిపించడం లేదు వసు నీకు ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. నా ఫోన్ కూడా ఎత్తడం లేదు మీరు ముందు ధైర్యంగా ఉండండి... గౌతమ్ సర్ వెతకడానికి వెళ్లారు కదా అని రిషిని పైకి తీసుకెళ్తుంది వసుధార. ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని దేవయాని అడిగితే..ధైర్యం చెప్పడానికి తీసుకెళ్తున్నాను మేడం అలాగే కొంచెం స్ట్రాంగ్ కాఫీ తీసుకురండి అంటుంది. దానికి దేవయాని ఆశ్చర్యపోయి నేను కాఫీ తేడం ఏంటి అంటే..కాఫీ కాదు స్ట్రాంగ్ కాఫీ తెచ్చేయండి మేడం అని రిషి ని తీసుకుని పైకి వెళ్ళిపోతుంది వసు. అప్పుడు దేవయాని కోపంతో రగిలిపోయి ఉంటుంది.
ఎపిసోడ్ ముగిసింది..

Published at : 22 Oct 2022 10:21 AM (IST) Tags: Guppedantha Manasu Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Rasagnya Reddy jyothi roy Guppedantha Manasu October 22nd Guppedantha Manasu Today Episode 588

ఇవి కూడా చూడండి

‘సలార్’పై కొత్త డౌట్స్, ‘యానిమల్’ వసూళ్ల వర్షం  - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘సలార్’పై కొత్త డౌట్స్, ‘యానిమల్’ వసూళ్ల వర్షం - నేటి టాప్ సినీ విశేషాలివే!

Shouryuv: ‘హాయ్ నాన్న’కు నాగార్జున సినిమాకు సంబంధం లేదు - దర్శకుడు శౌర్యువ్ ఇంటర్వ్యూ

Shouryuv: ‘హాయ్ నాన్న’కు నాగార్జున సినిమాకు సంబంధం లేదు - దర్శకుడు శౌర్యువ్ ఇంటర్వ్యూ

Tripti Dimri: 'యానిమల్' బోల్డ్ సీన్‌తో పాపులారిటీ - ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?

Tripti Dimri: 'యానిమల్' బోల్డ్ సీన్‌తో పాపులారిటీ - ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?

Avika gor: ఇప్పటి 20 సార్లు పెళ్లి చేసుకున్నా అస్సలు బోర్ కొట్టలేదు - అవికా గోర్

Avika gor: ఇప్పటి 20 సార్లు పెళ్లి చేసుకున్నా అస్సలు బోర్ కొట్టలేదు - అవికా గోర్

Alia Bhatt Rashmika: క్రష్మిక క్లబ్‌లో ఆలియా భట్ - భర్తను వదిలేసింది ఏంటి?

Alia Bhatt Rashmika: క్రష్మిక క్లబ్‌లో ఆలియా భట్ - భర్తను వదిలేసింది ఏంటి?

టాప్ స్టోరీస్

తెలంగాణలో రేపే కౌంటింగ్‌-ఉదయం 10గంటల్లోగా తొలి ఫలితం

తెలంగాణలో రేపే కౌంటింగ్‌-ఉదయం 10గంటల్లోగా తొలి ఫలితం

Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు

Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు

Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్‌ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు

Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్‌ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు

Bajaj Upcoming Bikes: చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త మోడల్, దేశంలోనే మొదటి సీఎన్‌జీ బైక్ - బజాజ్ సూపర్ ప్లాన్!

Bajaj Upcoming Bikes: చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త మోడల్, దేశంలోనే మొదటి సీఎన్‌జీ బైక్ - బజాజ్ సూపర్ ప్లాన్!