అన్వేషించండి

Karthika Deepam October 22nd Update: అనుమానంతో ఊగిపోయిన మోనితకు చెంపదెబ్బ, చూస్తూ నిల్చున్న కార్తీక్ - షాక్ లో దీప

కార్తీకదీపం అక్టోబరు 22 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Karthika Deepam October 22st Episode 1490 (కార్తీకదీపం అక్టోబరు 22 ఎపిసోడ్)

మోనిత నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే..డాక్టర్ బాబు విన్నారు కదా అని లోపల కార్తీక్ ఉన్నట్టు చెబుతుంది దీప. వెంటనే మోనిత కంగారుపడుతూ లేదు కార్తీక్ ఈ వంటలక్క ఏదేదో మాట్లాడుతోందని అలా అన్నాను..నేనే నీ భార్యని అని మోనిత అంటుంది. దానికి దీప నవ్వుతూ ఎలా భయపడిపోతున్నావో చూడు. నీ తెగింపు ఎంతవరకో తెలుసా..ఆయనకు గతం గుర్తొచ్చేవరకే అని దీప అంటే.. ఎప్పటికీ గుర్తురానివ్వను అంటుంది. 

మరోవైపు కార్తీక్ ... శౌర్య గొంతు వినబడినది గుర్తుచేసుకుని ఎక్కడెళ్లిపోయావు శౌర్యా నీకోసం ఎదురుచూస్తున్నాను అనుకుంటూ ఇంటికొస్తాడు. అప్పటికే మోనిత హాల్లో కూర్చుంటూ కార్తీక్ ని ఇక్కడ నుంచి ఎలాగైనా తీసుకెళ్లి పోవాలి. ఒకవేళ ఏమైనా గట్టిగా మాట్లాడితే దుర్గ తో లింకు పెడుతున్నాడు అసలు ఏం చేయాలి అనుకుంటుంది. అదే సమయంలో ఆనంద్ ఏడుస్తూ ఉంటాడు కానీ మోనితకి ఆ ఏడుపు వినబడదు. ఇంటి బయట ఉన్న కార్తిక్ కి ఏడుపు వినబడుతుంది.  వెంటనే ఆనంద్ దగ్గరికి వచ్చి ఆనంద్ ని బుజ్జగిస్తూ ఎత్తుకుంటాడు
కార్తీక్: అసలు నీకు బుద్ధి ఉందా మోనిత ఇంట్లో బాబు ఏడుస్తూ ఉంటే ఇక్కడ ఏం చేస్తున్నావు ఏం ఆలోచనలలో ఉన్నావు 
మోనిత:నిజంగానే వినిపించలేదు కార్తీక్ ఏదో ఆలోచనలో ఉన్నాను 
కార్తీక్: దుర్గ గారు ఇంట్లో ఉన్నారా దుర్గ గారు! దుర్గ గారు!
మోనిత: దుర్గ ఇక్కడ ఎందుకు ఉంటాడు కార్తీక్ 
కార్తీక్: అందుకే నువ్వు పరధ్యానంలో ఉన్నావ్. దుర్గ లేనప్పుడు కూడా ఆయన గురించి ఆలోచించుకుంటూ ఉన్నావు .ఏం ఓ గంట లేకపోతే ఉండలేవా
మోనిత: అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ కార్తీక్.. నువ్వే కారణం..ఇన్నాళ్లూ నువ్వు ఎక్కడికి వెళ్లిపోతావో అని భయం వేసేది, ఇప్పుడు నువ్వు వస్తున్నావంటే భయం వేస్తోంది. నరకం కనిపిస్తోంది. అందుకే ఏం చేయాలో తెలియక నరకం కనిపిస్తోంది
కార్తీక్: అరిస్తే నిజాలు అబద్ధాలు అయిపోవు..దొంగ ఏడుపులు మానేసి పిల్లాడిని జాగ్రత్తగా చూసుకో
మోనిత:నేను ఏం చెప్పినా నమ్మడం లేదు..నీలో ఇంత మార్పు ఎందుకొచ్చంది
కార్తీక్: నాలో ఏ మార్పుకి అయినా నువ్వే కారణం మోనిత...

Also Read: శౌర్య ని ఫాలో అవుతున్న కార్తీక్ -దీప, ట్యాబ్లెట్స్ బయటపడడంతో మోనితలో టెన్షన్

పగలంతా మేడం దగ్గర కాపలా, రాత్రంతా వంటలక్క ఇంటి ముందు కాపలా..ఉద్యోగాలు రెండుగాని జీతం మాత్రం ఒకటే అని మోనిత దగ్గరికి వస్తాడు శివ. ఎక్కడికి వెళ్లావని అడిగితే మార్నింగ్ వాక్ కి వెళ్లానని అబద్ధం చెబుతాడు. నువ్వు వంటలక్క ఇంటినుంచి రావడం చూశాను కానీ నువ్వెక్కడికి వెళ్లావో చెప్పు అంటుంది. కార్తిక్ సారే నన్ను దీపక్క ఇంటి దగ్గర కాపలాగా ఉండమన్నారు అని అంటాడు శివ. దానికి మోనిత ఆశ్చర్య పోతుంది...ఈ మధ్య కార్తీక్ ప్రవర్తనలో మార్పు వస్తోంది..ఎక్కువ సేపు  దీప దగ్గరే ఉంటున్నాడు నన్ను పట్టించుకోవడం లేదు పైగా వంటలక్క కి రక్షణ కూడా ఇస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో దుర్గ ఎంట్రీ ఇస్తాడు
దుర్గ: గుడ్ మార్నింగ్ బంగారం..స్ట్రాంగ్ గా కాఫీకావాలి...
మోనిత: పాలకు బదులు ఫినాయిల్ కలిపి ఇస్తాను
దుర్గ: నీ చేత్తో ఏం ఇచ్చినా అమృతమే
మోనిత: నీకు నిజంగానే విషయం కలిపి ఇవ్వాలి అప్పటికి కానీ దరిద్రం వదలదు

మరోవైపు కార్తీక్..ఆనంద్ ని చూస్తూ గతంలో దీప ఎంత ప్రేమగా చూసుకుందో అనుకుంటాడు. అదేసమయంలో శౌర్య గురించి ఆలోచిస్తాడు. నీ గొంతు వినిపించినా సరే నిన్ను పట్టుకోలేకపోయాను ఎలాగైనా నేను కనిపెట్టాలి అని అనుకుంటాడు. ఇంతలో మోనిత అక్కడికి వచ్చి కాఫీ కావాలా కార్తీక్ అని అడుగుతుంది. 
కార్తీక్:దుర్గకి ఇచ్చావా
మోనిత: మళ్లీ ఎందుకు మొదలు పెడుతున్నావ్ కార్తీక్ వాడు నాకు ఏమవుతాడని నేను వాడికి కాఫీలు ఇవ్వడానికి
కార్తీక్: మీ బంధువే కదా ఏదో పరాయి వాడితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావ్ ఏంటి అంటాడు కార్తీక్. 
 మోనిత: వాడు నాకు బంధువు కాదు కార్తీక్ వాడు ఒక రౌడీ గాడు వాడికి నేను కాఫీలు ఇవ్వాల్సిన పనిలేదు. మళ్లీ అలా అన్నావంటే బావోదు
దుర్గ:ఇంతలో కాఫీ అదిరిపోయింది బంగారం అంటూ ఎంట్రీ ఇస్తాడు దుర్గ.. రోజురోజుకీ రుచి పెరుగుతోంది అద్భుతం అనుకో.. కాఫీ ఏంటి నీ చేత్తో విషం ఇచ్చినా అది అమృతమే
నవ్వుకున్న కార్తీక్..నిన్ను చూస్తే కోపం రావడం లేదు మోనిత..జాలేస్తోంది..ఇప్పుడు దుర్గకి కాఫీ ఇచ్చింది నువ్వు కాదని చెప్పలేవుకదా
దుర్గ: ఎందుకు చెబుతుంది..ఇచ్చింది తనే కదా..
కార్తీక్: ఇందాక చెప్పాను కదా నీపై జాలేస్తోందని...కాదు...నాపై నాకు జాలేస్తోంది..నేను మర్చిపోయింది గతమే కానీ ఎమోషన్స్ కాదని వెళ్లిపోతాడు
మోనిత: నన్ను వదిలెయ్ రా దుర్గా...కార్తీక్ నన్ను తిట్టినా భరిస్తాను కానీ అనుమానిస్తే భరించలేనంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది
దుర్గ: నువ్వు ఏడిస్తే వచ్చేది కన్నీళ్లుకాదు..విషపు చుక్కలు..ఎందుకంటే నిలువెల్లా విషమే కాబట్టి.. ఆ విషయాన్ని దించేది ఇద్దరే ఇద్దరు ఒకరు దీపమ్మ, మరొకరు ఈ దుర్గ 

Also Read: రిషి ఒడిలో వసు, ఇంట్లోంచి వెళ్లిపోయిన జగతి-మహేంద్ర, 'గుప్పెడంతమనసులో' కీలక మలుపు

దీప బయట బట్టలు ఆరేస్తూ..సంగారెడ్డి జాతరలో ఇంద్రుడు..జ్వాల గురించి మాట్లాడిన మాటలు గుర్తుచేసుకుంటుంది. శౌర్య ఇక్కడే ఉందా..నాకోసం వెతుకుతోందా అని రకరకాలుగా ఆలోచిస్తుంది. దసరాలో అతను పిలిచిన వెంటనే వెళ్లి పాపను చూసి ఉండాల్సింది తప్పుచేశాను... ఆ అమ్మాయి వాళ్ల అమ్మానాన్నల కోసం వెతుకుతోంది, గొంతు కూడా శౌర్యలానే ఉందనుకుంటుంది. 

మోనిత: దుర్గని వదిలించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కావడం లేదు. ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అంటే కార్తీక్ ఒప్పుకోవడం లేదు. ఏం చేయాలిప్పుడు అని ఆలోచిస్తుంది. 

మరోవైపు దీప..శౌర్య కోసం వెతుకుతూ ఉంటుంది. అదే సమయంలో అక్కడున్న పాప్ కార్న్ షాప్ కనిపిస్తుంది. శౌర్యకి పాప్ కార్న్ ఎంతిష్టమో అనుకునే లోగా ...కార్తీక్ కొని తీసుకొచ్చి దీప పక్కన నిల్చుంటాడు. మీరెందుకు కొన్నారని దీప అడుగుతుంది
కార్తీక్: ఏమో వంటలక్క చూసిన వెంటనే కొనాలనిపించింది గతం మర్చిపోయాను కదా నాకు గతంలో నాకు ఇది ఇష్టమేమో. లేకపోతే నాకు ఇష్టమైన వాళ్లకు ఇష్టమేమో 
దీప: నా శౌర్యకు కూడా పాప్ కార్న్ అంటే ఇష్టమే 
కార్తీక్: కార్తీక్ మనసులో, నువ్వు చెప్తున్నావు నేను చెప్పలేకపోతున్నాను అంతే దీప అని అనుకుంటాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు 
దీప: శౌర్య కోసం వెతుకుతున్నాను 
శౌర్య ఇక్కడే ఉన్నదా నీకు కనిపించిందా అని అడగడంతో లేదు శౌర్య గొంతు వినిపించింది అలాగే ఆటో వెనుకాల అమ్మ నాన్న ఎక్కడ అని కూడా రాసి ఉంది అందుకే వెతుకుతున్నాను అంటుంది దీప. 

అదే సమయంలో శౌర్య ఆటోలో వెళుతుంది. దీప చూసి శౌర్యా అని అరుస్తుంది. ఎక్కడుందని కార్తీక్ అడగడంతో ఆటోలో కనిపించింది అంటాడు..ఇద్దరూ ఫాలో అవుతారు.. ఎపిసోడ్ ముగిసింది...

సోమవారం ఎపిసోడ్ లో
దీపతో కలిసొచ్చిన కార్తీక్ ను చూసి ఫైర్ అవుతుంది మోనిత. వెళ్లండి డాక్టర్ బాబు అని దీప అంటే...నా మొగుడు నాతో రావడానికి నీ పర్మిషన్ ఏంటే అని వంటలక్కపైకి వెళుతుంది మోనిత. ఇంతలో మరో ఆమె అక్కడికొచ్చి మోనితను లాగిపెట్టి కొడుతుంది. నోరెత్తితే నాలుక చీరేస్తా అంటుంది...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Metro News:  నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
Nara Lokesh: ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
Aurangzeb Tomb: ఔరంగజేబ్ సమాధి తొలగించాలని నాగపూర్‌లో ఆందోళనలు - ఇదంతా చావా సినిమా తెచ్చిన చావేనంటున్న మహారాష్ట్ర సీఎం
ఔరంగజేబ్ సమాధి తొలగించాలని నాగపూర్‌లో ఆందోళనలు - ఇదంతా చావా సినిమా తెచ్చిన చావేనంటున్న మహారాష్ట్ర సీఎం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Blue Whales Welcome Sunita Williams | ఫ్లోరిడా తీరంలో ఆస్ట్రానాట్లకు స్వాగతం పలికిన సముద్ర జీవులు | ABP DesamSunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Metro News:  నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
Nara Lokesh: ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
Aurangzeb Tomb: ఔరంగజేబ్ సమాధి తొలగించాలని నాగపూర్‌లో ఆందోళనలు - ఇదంతా చావా సినిమా తెచ్చిన చావేనంటున్న మహారాష్ట్ర సీఎం
ఔరంగజేబ్ సమాధి తొలగించాలని నాగపూర్‌లో ఆందోళనలు - ఇదంతా చావా సినిమా తెచ్చిన చావేనంటున్న మహారాష్ట్ర సీఎం
Telangana Latest News:పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
YS Viveka Case: వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
Chandrababu Naidu meets Bill Gates: ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
Kannappa Songs: మోహన్ బాబు బర్త్ డే స్పెషల్... 'కన్నప్ప'లో 'ఓం నమః శివాయ' సాంగ్ గ్లింప్స్ రిలీజ్
మోహన్ బాబు బర్త్ డే స్పెషల్... 'కన్నప్ప'లో 'ఓం నమః శివాయ' సాంగ్ గ్లింప్స్ రిలీజ్
Embed widget