Karthika Deepam October 21st Update: శౌర్య ని ఫాలో అవుతున్న కార్తీక్ -దీప, ట్యాబ్లెట్స్ బయటపడడంతో మోనితలో టెన్షన్
కార్తీకదీపం అక్టోబరు 21 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Karthika Deepam October 21st Episode 1489 (కార్తీకదీపం అక్టోబరు 21 ఎపిసోడ్)
దుర్గని అరెస్ట్ చేయించడానికి పోలీసుల్ని మోనిత తీసుకొస్తే.. పోలీసుల దగ్గర కార్తీక్ మోనితని ఇరికిస్తాడు. ‘దుర్గ మంచోడే.. మోనిత గతం మరిచిపోయింది’ అని రివర్స్ కౌంటర్ ఇస్తాడు. వంటలక్కకి రక్షణ కల్పించండని అడుగుతాడు. మా దగ్గర రౌడీ షీటర్ల లిస్ట్ ఉంది అదంతా బయటకు తీస్తే దాడిచేసింది ఎవరో బయటపడుతుందనేసి వెళ్లిపోతారు. వెంటనే.. దీప, దుర్గ... కార్తీక్‌కి థాంక్స్ చెప్పి వెళ్లిపోతారు. వెంటనే మోనిత... ‘కార్తీక్ ఏం చేస్తున్నావ్ నువ్వు? ఇలా ప్రవర్తిస్తావేంటీ?’ అంటూ నిలదీస్తుంది. ‘అదే నా డౌట్ కూడా.. ఎందుకు ఇలా చేస్తున్నావ్ మోనితా, మొన్నేమో దుర్గ బంధువు, స్నేహితుడు అని చెప్పి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావ్ ఇప్పుడు క్రిమినల్ అని జైల్లో వేయిస్తే.. తర్వాత నీ పేరు చెబితే పోయేది నా పరువే అంటాడు.
మోనిత: మరి వంటలక్క విషయంలో ఎందుకు అలా మాట్లాడావ్’
కార్తీక్: ‘అది కూడా సేమ్ మోనితా.. తీరా ఆ వంటలక్కకి ఏదైనా అయితే ఇరుక్కునేది నువ్వే కదా? అందుకే అలా చేశాను..
మోనిత: ‘ఏంటో కార్తీక్ నీకు అన్నీ ఈ మధ్య బాగానే గుర్తుంటున్నాయి’
కార్తీక్: తలకు దెబ్బ తగిలినప్పటి నుంచి బాగానే గుర్తుంటుంది మోనితా.. అయితే గతం గుర్తురావట్లేదు.. అవును నా గతం వల్ల నీకేం సమస్య లేదు కదా’
మోనిత: నాకేం పర్వాలేదంటూ నసుగుతూ నెమ్మదిగా పక్కకు తప్పుకుంటుంది మోనిత
Also Read: గతం మర్చిపోయిన మోనిత -వంటలక్కకి సెక్యూరిటీ, అస్సలు ఊహించని షాకిచ్చిన కార్తీక్
మరోవైపు కార్తీక్ ఫొటో పెట్టుకుని దుర్గ పూజలు చేస్తూ ‘నన్ను కాపాడాడిన దేవుడు’ అంటూ ఉంటాడు. మోనిత వచ్చి..‘రేయ్ సేఫ్ అయ్యానని సంబరాలు చేసుకోకు.. నేనేంటో త్వరలోనే చూపిస్తానంటుంది.
దుర్గ: నీ విషయంలో కార్తీక్ సార్‌కి పూర్తిగా అనుమానం వచ్చేసింది. నిన్ను వదిలించుకోవాలనే అబద్ధాలు చెప్పిమరీ పోలీసుల నుంచి నన్ను కాపాడాడు. నన్ను పోలీసులు తీసుకెళ్తే మళ్లీ నువ్వెక్కడ వెంటపడతావేమో అని కాపాడాడు...మనిద్దరం వెళ్లిపోతే డాక్టర్ బాబు వంటలక్కతో సెటిలైపోతారు..ఈ మధ్య ఇద్దరూ బాగా క్లోజ్ అయిపోయారు నీకు అర్థంకావడం లేదా...
మోనిత: ఇప్పుడు బయటపడ్డావని అంతా అయిపోయింది అనుకున్నావేమో..ఇంకా చాలాఉంది ..మోనిత అసలు స్వరూపం ఏంటో చూపిస్తా
అటు దీప..జరిగినదంతా తన అన్నయ్యకి చెబుతుంది. ఏం జరిగినా మన మంచికే... కారణం ఏదైనా దుర్గ విషయంలో మనకు మంచే చేశారు అది చాలు అంటాడు. మరోవైపు మోనిత ఇంట్లో పనిచేసే శివలత.. చీపురుతో ఇళ్లంతా తుడుస్తుంటే.. సోఫో కింద నుంచి టాబ్లెట్స్ వస్తూ ఉంటాయి. వాటిని చేతిలోకి తీసుకుని మోనితకి చూపిస్తుంది. షాక్ అవుతుంది మోనిత. ‘మేడమ్ ఇవన్నీ సోఫా కింద దొరికాయి.. ఇవి సార్ వేసుకునేవే కదా? అంటే సార్ వేసుకోవట్లేదనుకుంటా మేడమ్’ అంటుంది శివలత. మోనిత బిత్తరపోతుంది. ‘ఏంటి కార్తీక్ ఇలా ప్రవర్తిస్తున్నాడు.. కార్తీక్‌కి గతం గుర్తొచ్చిందా? దుర్గ విషయంలో కార్తీక్ నన్ను నమ్మడం లేదా? ముందు దుర్గాని, దీపని తప్పించాలి’ అనుకుంటూ ఆలోచనలో పడుతుంది.
అటు కార్తీక్..శౌర్యని వెతుకుతూ తిరుగుతుంటాడు. ఎక్కడున్నావమ్మా నువ్వు కనిపించేసరికి నేను గుర్తుపట్టలేకపోయానని బాధపడతాడు. అదే సమయంలో శౌర్య కూడా తన బాబాయ్ తో కలసి తల్లిదండ్రులను వెతుకుతుంది. ఓసారి మోనిత ఇంటిదగ్గరకు వెళ్లి గట్టిగా పిలిచి రాయితో కొట్టి పారిపోవాలని ఉందంటుందంటుంది. మోనితని కొడితే చూడాలని ఉందికానీ వద్దులేమ్మా అని సర్దిచెబుతాడు ఇంద్రుడు. శౌర్య-ఇంద్రుడు వెళుతున్న పక్కరోడ్ లోనే ఉంటాడు కార్తీక్. ఇంద్రుడు చెప్పిన మాటలు విని గట్టిగా శౌర్య నవ్వడం వింటాడు కార్తీక్..శౌర్యా అనుకుంటూ పరిగెత్తుతాడు..కానీ అప్పటికే శౌర్య వెళ్లిపోతుంది.
Also Read: రిషి ముందు జగతి మహేంద్రని బుక్ చేసిన దేవయాని, ధీమాగా ఉన్న వసు
కార్తీక్ ఇంట్లో లేకపోవడంతో దీప దగ్గర ఉన్నాడేమో అని వెళుతుంది మోనిత. అక్కడ కార్తీక్ లేడని తెలిసి.. ‘నీ మొగుడు నాకే సొంతం.. కార్తీక్ నావాడు.. నీ అంతు చూస్తాను... అప్పుడు ఇలా చేశాను.. ఇప్పుడు అలా చేశాను.. అంటూ మొత్తం తను చేసిన నేరాలన్నీ ఏకరువు పెడుతుంది. అప్పుడే దీప కూల్‌గా.. ‘అంతా విన్నారుగా డాక్టర్ బాబు బయటకు రండి అంటుంది కావాలని. షాక్ అయిన మోనిత ‘అయ్యో కార్తీక్.. ఆవేశంలో దీపని రెచ్చగొట్టడానికి అన్న మాటలు.. ఇవి నిజం కాదు.. నమ్మకు’ అంటూ కార్తీక్ ఎటు నుంచి వస్తాడో అని బిక్కుబిక్కుమంటూ చూస్తుంటుంది. దీప పడి పడి నవ్వుతుంది. కావాలనే దీప మోనితని హడలెత్తించిందన్నమాట...
ఎపిసోడ్ ముగిసింది..
రేపటి( శనివారం) ఎపిసోడ్ లో
వంటలక్కా ఇక్కడేం చేస్తున్నావని డాక్టర్ బాబు అడుగుతాడు. పాప్ కార్న్ ఎవరికోసం అని దీప అడిగి..మా శౌర్యకి పాప్ కార్న్ అంటే ఇష్టం అంటుంది. శౌర్య ఎక్కడుందని అడుగుతాడు... అప్పుడే ఆటోలో వెళ్లడం చూసి అదిగో ఆ ఆటోలో వెళుతోందని చెబుతుంది. వెంటనే కార్తీక్,దీప శౌర్య ని ఫాలో అవుతారు..