Karthika Deepam October 20th Update: గతం మర్చిపోయిన మోనిత -వంటలక్కకి సెక్యూరిటీ, అస్సలు ఊహించని షాకిచ్చిన కార్తీక్
కార్తీకదీపం అక్టోబరు 20 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Karthika Deepam October 20th Episode 1488 (కార్తీకదీపం అక్టోబరు 20 ఎపిసోడ్)
వంటలక్కపై ఫైర్ అవుతున్న మోనితతో... ఇంట్లో వాళ్ళ ప్రవర్తనలే బాగుంటే నేను ఎందుకు ఇక్కడికి వస్తాను ఇంట్లోనే ఉండేవాడిని కదా అంటాడు కార్తీక్. నేనేం చేశానని మోనిత అంటే.. వాళ్లచేత వీళ్లచేత గంటాకి రమ్మను, రెండు గంటలాగి రమ్మను అని చెప్పడం అసహ్యంగా ఉంటుందని నేనే వచ్చేశాను... మొన్నెప్పుడో నీకు దుర్గకి డాక్టర్ బాబు అడ్డం అని రెండు గంటలు బయట తిప్పి తీసుకురమ్మని శివతో చెప్పి పంపించావ్ కదా..ఏ భర్త అయినా భార్య అలా చెబితే తట్టుకోగలరా అందుకే డాక్టర్ బాబు బయటకు వచ్చేశారంటుంది దీప... షాక్ తింటుంది మోనిత..ఇప్పుడు నాతో వస్తున్నావా లేదా అంటే.. వంటలక్క ఇంటికొచ్చి తినకుండా వస్తే ఏం బావుంటుంది చెప్పు..నువ్వెళ్లు నేను తినేసి వస్తానంటాడు. ఆ దుర్గ గాడిని ఏదో ఒకటి చేస్తేకానీ నాకు మనశ్సాంతి ఉండదు అనుకుంటూ విసురుగా వెళుతుంది మోనిత. డాక్టరమ్మ చాలా కోపంగా వెళ్లినట్టుంది డాక్టర్ బాబు అని దీప అంటే...పట్టించుకోకులే వంటలక్కా మనం తిందా అంటాడు
Also Read: రిషిధారని విడగొట్టేందుకు దేవయాని నయా స్కెచ్, జగతి -మహేంద్ర-గౌతమ్ ఏం చేయబోతున్నారు!
అటు దుర్గ ఏదో ఫోన్ మాట్లాడుతుండగా వింటుంది మోనిత..ఆ తర్వాత దీపని నిన్ను ఎలా వదిలించుకుంటానో, కార్తీక్ ని ఎలా దక్కించుకుంటానో చూస్తుండండి అని సవాల్ చేస్తుంది మోనిత. ఏదో కాన్ఫిడెంట్ గా ఉంది...దాని ప్లాన్ దానికే తిప్పికొడతా అనుకుంటాడు దుర్గ. ఆ తర్వాత కార్తీక్ భోజనం చేసి బయటకు వచ్చి చేతులు కడుక్కుంటాడు. ఇంటికెళతాను అని కార్తీక్ అంటుండగా..మోనిత చాలా కోపంగా ఉంది జాగ్రత్త అంటాడు దుర్గ. కార్తీక్ వెళ్లిపోయిన తర్వాత మోనిత చేసిన సవాల్ విషయం దీపతో చెబితే..అంత సీన్ లేదులే దుర్గ వదిలెయ్ అంటుంది. అంత తేలిగ్గా తీసుకోవడం కరెక్ట్ కాదు దీపమ్మా జాగ్రత్తగా ఉండాలని దుర్గ అనడంతో..నువ్వు దాన్ని ఓకంట కనిపెడుతూ ఉండు అంటుంది దీప..
అటు శివ..మోనిత మాటలు గుర్తుచేసుకుంటాడు. పాప గురించి ఆలోచిస్తంటే నచ్చడం లేదు, వంటలక్క దగ్గరకు వెళితే నచ్చడం లేదు.. ఇక్కడ ఏదో చిక్కుముడి ఉందనుకుంటాడు శివ. ఇంతలో వచ్చిన కార్తీక్.. పాప గురించి వెతికావా అంటే ఉదయం నుంచి తిరిగానుకానీ కనిపించలేదంటాడు. మేడం చెప్పినది చెప్పొద్దులే అనుకుంటాడు. శివ అని కార్తీక్ పిలవడంతో ఎన్నాళ్లకి నా పేరు పెట్టి పిలిచారు సార్..మీరు ఎంత పెద్ద పని చెప్పినా చేస్తానంటాడు. ఈ రోజు నుంచి రాత్రిపూట వంటలక్క ఇంటిముందు పడుకో అంటాడు. మొన్న పాపని వెతకమన్నారు, ఇప్పుడు వంటలక్క ఇంటిముందు పడుకోమంటున్నారు.. ఆపాపకి, దీపక్కకి , సార్ కి ఏదైనా సంబంధం ఉందా అనుకుంటాడు...
Also Read: దీప కోసం వంటలయ్యగా మారిపోయిన కార్తీక్, మోనితకి మొత్తం తెలిసిపోయింది!
బయటకు వెళ్లిన మోనిత.. దుర్గ పెట్టిన టార్చర్ మొత్తం గుర్తుచేసుకుంటుంది. నువ్వు లేకపోయి ఉండి ఉంటే నా లైఫ్ ఎప్పుడో సెట్టైపోయేది...మోనితతో పెట్టుకుంటావా ఇప్పుడు అనుభవిస్తావ్ చూడు..రేపటితో నీపనైపోతుంది.. నిన్ను వంటలక్కని వదిలించుకుని కార్తీక్ తో కలసి ఆస్ట్రేలియా చెక్కేస్తాను అక్కడకు వంటలక్క ఎలా వస్తుందో చూస్తాను అనుకుంటుంది. మరోవైపు దుర్గ ...మోనిత గురించి చెప్పిన మాటలు గుర్తుచేసుకుని దీప ఆలోచనలో పడుతుంది. దుర్గ అంత గట్టిగా చెప్పాడంటే మోనిత ఏం ప్లాన్ వేస్తోంది అనుకుంటుంది..అది ఎంత కొట్టినా చావని పాము అంత తేలిగ్గా వదలదు వెంటనే డాక్టర్ బాబు దగ్గరకు వెళ్లాలి ఏం చేస్తోందో తెలుసుకోవాలి అనుకుంటుంది.
అటు దుర్గ కూడా అదే విషయం ఆలోచిస్తుంటాడు. దీపక్క మీదా...నామీదా..లేదంటే కార్తీక్ సార్ ని తీసుకెళ్లిపోవడానికా అసలేం ప్లాన్ చేస్తోందనే ఆలోచనలో పడతాడు. ఇంతలో అక్కడకు వచ్చిన కార్తీక్..దుర్గ ఏంటి ఏదో టెన్షన్లో ఉన్నాడేంటి మామూలుగా అయితే మోనితని టెన్షన్ పెడతాడు కానీ టెన్షన్ పడుతున్నాడంటే దీపని ఏమైనా చేస్తానందా...ఆ విషయం తెలిసి దుర్గ కంగారుపడుతున్నాడా అనుకుంటాడు. ఇంతలో దీప వచ్చి..మోనిత చేసిన సవాల్ గురించి కార్తీక్ కి చెబుతుంది. ఇంతలో పోలీసులను తీసుకొచ్చిన మోనిత..దుర్గని అరెస్ట్ చేయమని చెబుతుంది. ( ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని దుర్గ అడిగితే ఆ పని మనమే చేశాం అన్నది ఆధారం లేదుకదా మనల్నెవడు పీకేది అన్న దుర్గ మాటలు రికార్డ్ చేసి ఇచ్చిన వీడియో చూపిస్తారు పోలీసులు).
పోలీసులు దుర్గను తీసుకెళుతుండగా కార్తీక్ ఆపుతాడు. మరి దుర్గని నీ బంధువు అన్నావ్ కదా..ఆగు దుర్గ వచ్చినప్పుడు వీడియో రికార్డ్ చేశానంటూ మోనిత నా దగ్గరి బంధువు అన్న వీడియో చూపిస్తాడు. నీ బంధువు అంటే నువ్వుకూడా క్రిమినలే అవుతావు కదా మోనిత అని కార్తీక్ బుక్ చేస్తాడు. అప్పుడు పోలీస్..మీ ఇద్దరూ కలసి ఏం చేశారు..ఇద్దర్నీ కలసి ఇంటరాగేట్ చేయాలంటారు. ఇద్దరూ క్రిమినల్స్ కాదంటాడు కార్తీక్. ఈవిడ కంప్లైంట్ ఇచ్చింది, మీరు ఈవిడ కూడా ఇందులో భాగస్వామే అంటున్నారేంటంటారు... మోనిత గతం మర్చిపోయిందని రివర్స్ కౌంటర్ ఇస్తాడు... ఆ వీడియో గురించి దుర్గ వివరణ ఇస్తాడు. కార్తీక్ కి గతం గుర్తొచ్చిందా ఏంటని మోనిత టెన్షన్ పడుతుంది. పోలీసులు వెళ్లిపోతుండగా.. ఈవిడ వంటలక్క ఈవిడ ప్రాణానికి ప్రమాదం పొంచిఉంది..సెక్యూరిటీ కల్పించగలరా అని అడుగుతాడు. ఎవరివల్ల హాని అని పోలీసులు అడిగితే కార్తీక్ ఆలోచనలో పడతాడు....
ఎపిసోడ్ ముగిసింది