By: ABP Desam | Updated at : 19 Oct 2022 10:28 AM (IST)
Edited By: RamaLakshmibai
Guppedantha Manasu October 19th Today Episode 585 ( (Image Credit: Star Maa/Hot Star)
గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్ ( Guppedantha Manasu October 19th Today Episode 585)
రిషి భోజనం చేస్తూ ఉంటాడు. భోజనం నిజంగా హోటల్ నుంచి తెచ్చిందేనా అని అడిగితే..వీడేంటి ఇలా అడుగుతున్నాడని గౌతమ్ మనసులో అనుకుంటాడు. ఇంకో ముద్ద తిన్న రిషి బయట ఎక్కువ సేపు నిల్చుని ఉంటే కాళ్ళు నొప్పి పెడతాయి లోపలికి రా అని అంటాడు. నేను కూర్చునే ఉన్నాను కదరా అని గౌతమ్ అనడంతో నిన్ను కాదులే...వసుధార లోపలికి రా అనడంతో వసు ఎంట్రీ ఇస్తుంది. ఇక్కడేం ఏం చేస్తున్నావు...ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా అంటాడు. నువ్వెందుకు వచ్చినట్టు అని రిషి అడిగితే..వెళ్లమంటారా అంటే..గౌతమ్ ని తోడుగా తీసుకెళ్లు అంటాడు. ఉండమనొచ్చు కదా అని వసు మనసులో అనుకునేలోగా..భోజనం చేసి వెళ్లు అంటాడు. అటు గౌతమ్ సెటైరిక్ గా పాటలు పాడుతుంటాడు. ఆ తర్వాత వసు ఇంటికెళ్లిపోతుంది.
Guppedantha Manasu - Promo | 19th Oct 2022 | Mon-Sat at 7 pm Only on #StarMaa #StarMaaSerials #GuppedanthaManasu pic.twitter.com/uRRq7rcd2K
— starmaa (@StarMaa) October 19, 2022
ఏంటి రిషి సార్ ఇలాగే మీరు ఆఫీసులో ఉంటే ఇంట్లో మేడం, సార్లు బాధపడతారు కదా మిమ్మల్ని ఇంటికి తీసుకెళతాను అనుకుంటూ తలుపు తీసేలోగా అక్కడ దేవయాని ఉంటుంది. దేవయాని ని చూసి ఆశ్చర్య పోతుంది ఇక్కడికి ఎందుకు వచ్చారు మేడం అని అడుగుతుంది.
దేవయాని: అయినా నేను ఇక్కడికి రాకూడదా వచ్చినందుకు మర్యాదలను చేయక్కర్లేదు నువ్వు అన్ని సర్దుకొని ఇంటికి పదా ఎలాగా కాబోయే కోడలివి కదా
వసు: ఈవిడ ఏదో కొత్త ప్లాన్ తో వచ్చారు ఏం మాట్లాడినా తిరిగి బెడిసి కొడుతుంది ఏం మాట్లాడకుండా ఉండాలి అని అనుకుంటుంది. దేవయాని: మనకెందుకు వసుధార ఈ గురుదక్షిణ ఒప్పందాలు లాంటివి హాయిగా నువ్వు, రిషి ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోకుండా ఎందుకంటావ్ పక్క వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ నీ సంతోషాన్ని నువ్వు దూరం చేసుకుంటున్నావు. నేను బయట వెయిట్ చేస్తాను అన్ని సదుకుని వచ్చేయని అంటుంది.
Also Read: దీప కోసం వంటలయ్యగా మారిపోయిన కార్తీక్, మోనితకి మొత్తం తెలిసిపోయింది!
ఆ తర్వాత సీన్లో రిషి గౌతమ్ లు బ్యాడ్మింటన్ ఆడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు..ఇంతలో రిషి కి వసు ఫోన్ చేసి సార్ దేవయాని మేడం ఇక్కడికి వచ్చారు త్వరగా రండి అని అనగా రిషి అప్పటికప్పుడే బయలుదేరి దారిలో వెళ్తూ, పెద్దమ్మ ఎందుకు అక్కడికి వెళ్ళింది అని అనుకోని దేవయానికి ఫోన్ చేస్తాడు. అప్పుడు దేవయాని, నాకు తెలుసు రిషి, వసుధార నీకు ఫోన్ చేసి చెప్తుందని నాకు అదే కావాలి అప్పుడే కదా నా ప్లాన్ అమలు పడుతుంది ఇక్కడికి వచ్చి నీతో మాట్లాడాలంటే ఇప్పుడు నీ ఫోన్ ఎత్తకూడదు అని ఫోన్ కట్ చేస్తుంది. ఇంట్లో ఉన్న వసు కంగారుపడుతూ జగతి మేడంకి విషయం చెబుదామా వద్దు మళ్ళీ వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు రిషి సార్ ఉన్నారు కదా చూసుకుంటారు అని అనుకుంటుంది. ఇంతలో రిషి అక్కడికి వస్తాడు ఏమైంది పెద్దమ్మ ఇక్కడికి వచ్చారని అడుగుతాడు.
దేవయాని: వసుధారని ఇంటి కోడలుగా బట్టలన్నీ సర్దుకుని ఇంటికి రమ్మన్నాను కానీ తను రావడం లేదు. నా పెద్దరికం పక్కనపెట్టి గురుదక్షిణ ఒప్పందం వదులు కోమని తన నిర్ణయం మార్పిద్దామని వచ్చాను
రిషి: అలా చేయకూడదు పెద్దమ్మ ఎవరు నిర్ణయాలు వాళ్ళకి ఉంటాయి. వాళ్ళంతట వాళ్లే మార్చుకోవాలి మన బలవంతం మీద వాళ్ళు మార్చుకుంటే తర్వాత ఎప్పటికైనా అది సమస్య అవుతుంది
వసు: అవును మేడం మన నిర్ణయాలు ఇంకొకరి మీద రుద్దకూడదు మారాలనుకుంటే వాళ్లే మారుతారు దాని కోసం మీరంతా కంగారు పడాలిసిన అవసరం లేదు. మీరు నా కోసం, రిషి సార్ కోసం ఇంత ఆలోచిస్తున్నారు అదే చాలు నేను ఎప్పటికైనా మీ ఇంటికి రావాల్సిన దాన్ని కదా నాకు రిషి సార్ కి మధ్య ఈ చిన్న ఒప్పందం తప్ప ఇంకేం అపార్ధాలు లేవు మేము బానే ఉన్నాం
అప్పుడు దేవయాని ఏదో మాట్లాడుబోతుండగా రిషి దేవయానితో, పెద్దమ్మ ఇప్పుడు ఈ మాటలన్నీ ఊరు బయట ఎందుకు మాట్లాడడం అని అంటాడు. ఇంతలో పక్కింటి ఆవిడ వచ్చి ఏం వసుధార బయట మాట్లాడుతున్నారు ఏవైనా గొడవా అని అడగగా, ఏమీ లేదు మా ఇంటి వ్యవహారమే అని వసుధార అంటుంది. మరి బయట ఎందుకు మాట్లాడుకోవడం ఇంట్లోకి వెళ్లి మాట్లాడొచ్చు కదా అని ఆ పక్క ఆవిడ అనగా భలే చెప్పారు అని వసుధార అంటుంది. అప్పుడు వసుధార నెమ్మదిగా దేవయాని చెవి దగ్గరికి వెళ్లి, మీరేం భయపడొద్దు మేడం నేను ఆ ఇంటికి వస్తాను. అందరి తిక్క కుదురుస్తాను అంటుంది.
దేవయాని: నేను ఇంటికి రమ్మని చెప్తున్నాను కదా ఏంటి తెలివిగా మాట్లాడుతున్నావా అని అంటుంది
వసు: మీరే అన్నారు కదా మేడం నేను తెలివైన దాన్ని అని
ఇప్పుడు రోడ్డు మీద మీరేం మాట్లాడుకోవద్దు ఇంటికి వెళదాం పదండి పెద్దమ్మా అని దేవయానిని అక్కడ నుంచి తీసుకెళ్లి పోతాడు.
Also Read: వసు దోబూచులాటని గమనించిన రిషి, ప్రేమ పక్షుల్ని కలిపే పనిలో గౌతమ్
దేవయాని-రిషి: కారులో రిషి, దేవయాని వెళ్తున్నప్పుడు, దేవయాని ఏడుస్తుంది. దానికి రిషి ఎందుకు ఏడుస్తున్నాడు అని అనగా నేను నా పెద్దరికం ని పక్కన పెట్టి వసుధారని ఒప్పందం మానుకోమని అడిగాను. ఎలాగో మీ అమ్మానాన్నలకి నీ మీద బాధ్యత లేదు. నేనే ఆ బాధ్యత తీసుకొని మాట్లాడుదాం అనుకుంటే వసుధార నా పెద్దరికం కూడా పట్టించుకోలేదు అని అంటుంది.దానికి రిషి వాసుధార నీ ఎలా మార్చాలో నాకు తెలుసు పెద్దమ్మ మీరు మా గురించి ఏం కంగారు పడొద్దు వసుధరకి జగతి మేడం మీద ఉన్న కృతజ్ఞతా భావం కన్నా నా మీద ఉన్న ప్రేమే ఎక్కువ అని అంటాడు.
ఎపిసోడ్ ముగిసింది
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
సిద్దార్థ్- కియారా జంటకు క్షమాపణలు చెప్పిన ఉపాసన, ఎందుకంటే..
Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
Ennenno Janmalabandham February 8th: బయటపడిన అభిమన్యు అసలు రంగు, మాళవిక బతుకు బస్టాండ్- మనసులతో ఊసులాడుకున్న వేద, యష్
Pawan Kalyan As God : ప్రేమికుల రోజు నుంచి దేవుడిగా పవన్ కళ్యాణ్
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !
No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్న్యూస్! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్ తెస్తున్నారు!
PM Modi On Opposition: ఈడీ దెబ్బకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి,ప్రజలే నా రక్షణ కవచం - ప్రధాని మోదీ