Karthika Deepam October 19th Update: దీప కోసం వంటలయ్యగా మారిపోయిన కార్తీక్, మోనితకి మొత్తం తెలిసిపోయింది!
కార్తీకదీపం అక్టోబరు 19ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Karthika Deepam October 19th Episode 1486 (కార్తీకదీపం అక్టోబరు 19 ఎపిసోడ్)
హాస్పిటల్ కి వెళ్లిన కార్తీక్ వారణాసిని చూసి బాధపడతాడు. నువ్వు కోలుకున్నాక నా ఇంట్లో మనిషిలా చూసుకుంటాను అనుకుంటాడు. అక్కడికి డాక్టర్ రావడంతో వారణాసి పరిస్థితి ఎలాఉందని అడుగుతాడు. ఇంకా కోమాలోనే ఉన్నారు కానీ ప్రతి ట్రీట్మెంట్ కి రియాక్ట్ అవుతున్నారని డాక్టర్ చెబుతారు. అప్పుడు ఆ డాక్టర్ కార్తీక్ ని చూసి...మీ ప్రొఫైల్ ఫోన్లో చూశాను. చాలా బాగుంది... హైదరాబాద్ వదిలి ఎందుకు ఇక్కడికి వచ్చారు ఏదైనా హాస్పిటల్లో పని చేస్తున్నారా అని అడుగుతాడు. అనుకోని పరిస్థితిలో రావాల్సి వచ్చింది ఇంకొన్ని రోజులు ఉంటాం ఈ లోపల ఏమైనా సర్జరీలు ఉంటే చెప్పండి అని అంటే.. సరే అంటాడు ఆ డాక్టర్.
దీప-అన్నయ్య
దీప వాళ్ల అన్నయ్యకి కాఫీ ఇస్తూ డాక్టర్ బాబుకి ఎవరు ఫోన్ చేసి ఉంటారు ఇప్పుడే వస్తాను అని వెళ్లిపోయారు ఈ ఊర్లో డాక్టర్ బాబుకి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అన్నయ్య అలాగ అనుకోవద్దమ్మ ఈమధ్య ఒక కార్తీక్ లో మార్పు వస్తోంది. బయటకు వెళ్ళినా సరే తిరిగి ఇల్లు దారి గుర్తు పెట్టుకుని వస్తున్నాడు. అలాగే పేర్లు కూడా మర్చిపోవడం లేదు కొంచెం కొంచెంగా గుర్తొస్తున్నాయి నీకు మంచి రోజులు వచ్చినట్టే అంటాడు. అప్పుడే వచ్చిన దుర్గ అవును దీపమ్మ..నీకు మంచి రోజులు వస్తున్నాయి...చూశావా ఆ మోనిత ఎలాగా గింజుకుంటుందో. కార్తీక్ సార్ కి గతం గుర్తొచ్చే లోపల... సార్ భార్య అని చెప్పి పరిపోతుంది అంటాడు.
Also Read: మోనిత చెంప చెళ్లుమనిపించిన దీప, కథ చెప్పిన కార్తీక్ , వారణాసి కోసం శౌర్య ఆరాటం
మోనిత కూడా కార్తీక్ గురించి ఆలోచిస్తుంటుంది. కార్తీక్ ఎక్కడికి వెళ్లాడు..నాకు చెప్పకుండా వెళ్లాడేంటి అనుకుంటుండగా కార్తీక్ వస్తాడు. ఏదో ఫోన్ వస్తే వెళ్లావు కదా ఎక్కడికి వెళ్లావ్, ఎవర్ని కలిశావ్ అని మోనితను అడుగుతాడు. ఫ్రెండ్ ని కలిసి వస్తున్నానంటాడు. నీకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరూ లేరుకదా ఎవర్ని కలిశావ్ పేరు చెప్పు అంటుంది. సుబ్బారావు, అప్పారావు లేకపోతే ఆనందరావు, సౌందర్యో నీకు తెలుసా వాళ్లు అని కార్తీక్ అంటాడు. దానికి మోనిత ఉలిక్కిపడి ఆనందరావు సౌందర్య అంటున్నాడేంటి భయపడుతుంది. ఈ లోగా టీ తీసుకురమ్మని అడిగితే ట్యాబ్లెట్ చేతికిచ్చి నేను టీ తీసుకొస్తానని వెళుతుంది మోనిత. ఏం ట్యాబ్లెట్స్ ఇస్తోంది అనుకుంటూ ఓ ట్యాబ్లెట్ బయటపడేస్తాడు. ఈ లోగా మోనిత టీ తీసుకురావడంతో ఆ ట్యాబ్లెట్స్ ఏంటని అడుగుతాడు. నీకు ఆరోగ్యం బాలేదు కదా..గతం గుర్తుకురావడానికి కూడా అని మోనిత అనడంతో.. నీ ప్లాన్ నాకు తెలుసు అదెప్పటికీ సాగనివ్వను అనుకుంటాడు.
ఇల్లంతా బాలేదు..ఇలాఉంటే డాక్టర్ బాబుకి కూడా నచ్చదంటూ సర్దుతుంటుంది. ఇంకా ఎందుకమ్మా ఇక్కడ నువ్వు, కార్తీక్ ఇంటికి వచ్చేయండి అంటాడు డాక్టర్ అన్నయ్య. వద్దు హేమచంద్రగారూ వంటలక్క పర్ణశాలలో ఉంటేనే అందం అంటూ ఎంట్రీ ఇస్తాడు కార్తీక్. దీప-హేమచంద్ర షాక్ లో చూస్తుంటారు... ఈ మధ్య కొంచెం కొంచెం గుర్తుంటున్నాయన్న కార్తీక్.. ఇల్లు బాలేదని టెన్షన్ పడుతున్నావా నేను హెల్ప్ చేస్తానంటాడు. ఉదయం ఎవరు కాల్ చేశారని దీప కూడా అడుగుతుంది... వారణాసి అని చెబితే ..నాకు గతం గుర్తొచ్చిన విషయం తెలిసిపోతుంది అనుకుంటూ మాట దాటవేస్తాడు. కార్తీక్ ఇల్లు శుభ్రం చేస్తాడు..ఆ తర్వాత దీప నువ్వు కూర్చో నేను వంటచేస్తానంటాడు. గతంలో కార్తీక్ వంటచేసిన విషయం గుర్తుచేసుకుంటుంది దీప.
Also Read: వసు దోబూచులాటని గమనించిన రిషి, ప్రేమ పక్షుల్ని కలిపే పనిలో గౌతమ్
ఇంతలో కార్తీక్ కి శివ కాల్ చేయడంతో బయటకు వెళ్లి మాట్లాడతాడు... ఎట్టి పరిస్థితుల్లోనూ పాప దొరకాలి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. వెతుకుతూనే ఉన్నాను అయినా దొరకడం లేదనుకుంటూ ఇంట్లోకి వస్తుండగా మోనిత క్వశ్చన్ చేస్తుంది. చాలా రోజుల నుంచి నీ ప్రవర్తన మారుతోంది శివ..నిజం చెప్పకపోతే ఉద్యోగం లోంచి తీసేస్తాను అని బెదిరిస్తుంది. తప్పని పరిస్థితుల్లో శివ జరిగిన విషయం అంతా చెప్పేస్తాడు. విన్నాక భయపడిన మోనిత..కార్తీక్ కి గతం గుర్తొచ్చేసిందా ఏంటని భయపడుతుంది. ఒకవేళ గతం గుర్తొస్తే దీప ను తీసుకెళ్లిపోతాడా...దీప కూడా శౌర్యని కలవకూడదు అనుకుంటూ ఈ రోజు నుంచి నీకు 2 వేలు జీతం పెంచుతున్నా అంటూ ఇక పాప గురించి మర్చిపో అంటుంది. ఇంతలో దుర్గా అక్కడికి రావడంతో నేను వెళతా అని శివ అనడంతో మోనిత ఆపుతుంది. ఇక్కడికి ఎందుకొచ్చావని మోనిత అడిగితే.. దీప కార్తిక్ సర్ లను ఏకాంతంగా వదిలేయడానికి వచ్చానులే అంటాడు.
దుర్గ మాట విని మోనిత కంగారుగా వంటలక్క ఇంటికి వెళుతుంది.మోనిత కంగారు పడుతూ అక్కడికి వెళ్లి చూసేసరికి కార్తీక్ వంట చేసి దీపకు వడ్డిస్తుంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన మోనిత కోపంతో..నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ కార్తీక్ అయినా వంటలక్క నా మొగుడుతో నువ్వేం చేస్తున్నావే అని అనంతో కార్తీక్ అడ్డుకుంటాడు. నా కార్తీక్ తో వంటవండిస్తావా అని ఫైర్ అవుతుంది.. నేనే కావాలని అడిగిమరీ వంటచేశానంటాడు కార్తీక్. అయినా ఇంట్లో వాళ్ళ ప్రవర్తనలే బాగుంటే నేను ఎందుకు ఇక్కడికి వస్తాను ఇంట్లోనే ఉండేవాడిని కదా అంటాడు కార్తీక్. నేనేం చేశానని మోనిత అంటే.. వాళ్లచేత వీళ్లచేత గంటాకి రమ్మను, రెండు గంటలాగి రమ్మను అని చెప్పడం అసహ్యంగా ఉంటుందని నేనే వచ్చేశాను... మొన్నెప్పుడో నీకు దుర్గకి డాక్టర్ బాబు అడ్డం అని రెండు గంటలు బయట తిప్పి తీసుకురమ్మని శివతో చెప్పి పంపించావ్ కదా..ఏ భర్త అయినా భార్య అలా చెబితే తట్టుకోగలరా అందుకే డాక్టర్ బాబు బయటకు వచ్చేశారంటుంది దీప... షాక్ తింటుంది మోనిత..
ఎపిసోడ్ ముగిసింది