Karthika Deepam October 18th Update: మోనిత చెంప చెళ్లుమనిపించిన దీప, కథ చెప్పిన కార్తీక్ , వారణాసి కోసం శౌర్య ఆరాటం
కార్తీకదీపం అక్టోబరు 15ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Karthika Deepam October 18th Episode 1486 (కార్తీకదీపం అక్టోబరు 18 ఎపిసోడ్)
దీప ఉదయాన్నే లేచి తాళిబొట్టుకి దండం పెట్టి దేవుడికి నమస్కారించి బయటకు వస్తుంది. బయటికి వచ్చి చూసేసరికి కార్తీక్ అప్పటికే కూర్చుని ఆలోచనలో ఉంటాడు. ఏమైంది డాక్టర్ బాబు ఇక్కడికి వచ్చారు.. తలుపు కొట్టాల్సింది కదా..ప్రతిరోజూ ఉదయాన్నే లేచే దాన్ని ఈరోజు కొంచెం ఎక్కువ సేపు అయిపోయింది అంటుంది. ఏం కావాలి డాక్టర్ బాబు అని దీప అడగడంతో ఏమీ వద్దు నీ పనులు చేసుకో అంటాడు కార్తీక్. అప్పుడు దీప పనులు చేస్తూ ఉండగా దీప దగ్గరికి వెళ్ళిన కార్తీక్, నీకు పిల్లలున్నారు కదా వంటలక్క అని అడుగుతాడు. అవును ఇద్దరు పిల్లలు ఉన్నారు శౌర్యని వాళ్ళ నాన్న రౌడీ అని పిలుస్తారు అని అంటుంది దీప.వాళ్ళు ఎక్కడున్నారు అని కార్తీక్ అడుగుతాడు. వాళ్లిద్దరూ అమెరికాలో ఉన్నారు అని చెప్తుంది. లేదు దీపా శౌర్య మనకోసమే ఎదురుచూస్తోంది, అంటే ఈ విషయం నీకు తెలియదన్నమాట అనుకుంటాడు మనసులో. పిల్లలు అక్కడే ఉన్నారనుకుని నువ్వు నాకోసమే ఇక్కడే ఉండిపోయావా అనుకుంటాడు. కార్తీక్ ఆలోచనలో పడడం చూసి ఏమైంది డాక్టర్ బాబు అని అడుగుతుంది దీప
కార్తీక్: శౌర్య ఇక్కడే ఉందని తెలుసు...నీకు చెబుదాం అంటే ఇప్పుడు మోనితతో లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటావ్ అందుకే చెప్పడం లేదు.
దీప: ఏం ఆలోచిస్తున్నారు డాక్టర్ బాబు
కార్తీక్: తలనొప్పిగా ఉంది కాఫీ ఇస్తావా...
ఐదు నిముషాల్లో పెట్టిస్తాను డాక్టర్ బాబు అని సంతోషంగా తీసుకొచ్చి ఇస్తుంది... మరోవైపు మోనిత కార్తీక్ రాత్రంతా ఇంటికి రాలేదు ఒకవేళ వంటలక్క దగ్గరకు వెళ్లాడా...
అని కార్తీక్ అంటాడు. దానికి దీప టీ పెట్టి తెస్తాను అని అంటుంది. ఆ తర్వాత సీన్లో మోనిత తన గదిలో కార్తీక్ కోసం ఆలోచించుకుంటూ, ఏంటి కార్తీక్ ఇంకా రాలేదు రాత్రంతా ఎక్కడికి వెళ్ళాడు కొంపతీసి వంటలక్క దగ్గర ఉన్నాడా వెళ్లి చూడాలి అని అక్కడికి వెళ్లి చూస్తుంది. అప్పటికే కార్తీక్ వంటలక్క కలిపి కాఫీ తాగుతుంటారు. ఆవేశంగా వెళ్లిన మోనిత.. రాంత్రంతా నా మొగుడితో అని మాట్లాడేలోగా...లాగిపెట్టి కొడుతుంది దీప..
దీప: ఇక్కడేమైందో తెలుసుకోకుండా వాగుతావేంటి..
మోనిత: అయితే చెంపపై కొడతావా.. నువ్వేంటి కార్తీక్ అలా చూస్తున్నావ్..నీ భార్యని కొడితే చూస్తూ ఉంటావేంటి
కార్తీక్: నా భార్య ఎవరు..నువ్వా-వంటలక్కా?...మతిమరుపు కదా... ఇంతకీ ఎందుకు కొట్టావ్
దీప: పిచ్చివాగుడు వాగితే ఎవరికైనా చెంప పగులుతుంది
కార్తీక్: రాత్రంతా...నాలుక నోట్లో 32 పళ్లను అడుగిందట..మీరు నములుతారు నేను రుచిని ఆస్వాదిస్తాను ప్రతిఫలంగా ఏం చేయగలం అని అడిగితే.. నువ్వేం చేయనక్కరర్లేదు నోు అదుపులో పెట్టుకో..ఒక్కమాట తేడా వచ్చినా పళ్లురాలగొడతారు.. కాబట్టి నీ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది..
మోనిత: నీకు నాలో తప్పులు వెతకడం తప్ప..నీకోసం నేను పడే ఆరాటం అర్థంకావడం లేదు.. ( కళ్లంతా ఎర్రగా ఉన్నాయి, కొంపతీసి రాత్రంతా వంటలక్కకి కాపలాగా కూర్చున్నాడా)
కార్తీక్: నీ మనసులో ఏముందో అదే జరిగిందిలే పద అంటాడు కార్తీక్..
Also Read: దుర్గ కాళ్ళ మీద పడి బతిమలాడుకున్న మోనిత, చుక్కలు చూపించిన దీప- శౌర్య కోసం వెతుకుతున్న కార్తీక్
అప్పుడు మోనిత...నన్నే కొడుతుందా దాన్ని వదిలేదే లేదు అనుకుంటుంది. కార్తీక్ కావాలని అక్కడికి వచ్చి ఏమైంది చెంప పట్టుకున్నావు అని అడుగుతాడు. ఇప్పుడేం జరిగింది అప్పుడే మర్చిపోయావా కార్తీక్ కావాలనే అడుగుతున్నావ్ కదా అని అంటుంది మోనిత. ఎవరైనా వాళ్ల భార్యని కొడితే తిరిగి వాళ్ళ చెంప పగలగొట్టాలి కానీ నువ్వు నీతులు చెప్తున్నావు చాలా బాగుంది కార్తీక్ అని అరుస్తుంటుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన దుర్గ...నువ్వు అడిగినట్టు మనిద్దరి కోసం రెండు రవ్వ దోశలు తెచ్చానంటాడు. పక్కనే ఉన్న కార్తీక్ ని చూసి అయ్యో కార్తీక్ సార్ వచ్చేసారా కార్తీక్ సార్ రారనుకుని నువ్వు నాకు రెండే తెమ్మన్నావు కదా అయ్యయ్యో ఇప్పుడు ఎలాగా పోనీ నాది ఇచ్చెయ్యనా అని దుర్గ అంటాడు. ఇంతలో దీప వచ్చి, కార్తీక్ బాబు మీ కోసం నేను టిఫిన్ తెచ్చాను అని చెప్పి నిన్న రాత్రిది అన్నం మిగిలింది దాంతో ఉదయాన్నే పులిహోర చేశాను అంటుంది దీప.
మీ డాక్టర్ బుక్ కూడా పులిహోర ఇష్టమా అని అడగడంతో చాలా ఇష్టం అని దీప అంటుంది. అయితే పద నాకు తినాలని ఉందని హాల్ లోకి వెళతాడు. దీప కార్తిక్ కి వడ్డిస్తున్నప్పుడు ఆనంద్ ఏడుస్తూ ఉంటాడు అప్పుడు దీప ఆనంద్ ని ఎత్తుకుంటుంది. కానీ దుర్గ మోనిత ని అడ్డుకుంటాడు. ఇందులో మోనిత అక్కడ బోటిక్ లో ఉన్న సుమలతతో వెళ్లి ఆనంద్ నీ తీసుకురమ్మని చెబుతుంది. సుమలత దీప దగ్గరికి వచ్చి ఆనంద్ ఇవ్వమని అడగగా మోనిత ఏం చేస్తుంది తనకు కావాలంటే తననే తీసుకుంటుంది అంటుంది. ఇంతలో మోనిత అక్కడికి వస్తుంది. నువ్వు ఈ మధ్య సరిగ్గా బాబుని చూసుకోవడం లేదు ఈరోజు నుంచి బాబు బాధ్యత దీపది అనడంతో అవసరం లేదు కార్తీక్ నేను చూసుకుంటానని బాబుని తీసుకుంటుంది. అప్పుడు కార్తీక్...దీపను చూసిన వెంటనే బాబు ఏడుపు ఆపేసాడని చెప్పి దీపను చూసుకోమన్నాను అంతకుమించి ఏం లేదు అంటాడు. ఇంతలో కార్తీక్ కి కాల్ రావడంతో ఫోన్ వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
Also Read: మేడమ్ తన ప్రాధాన్యత అనేసిన వసు, ఇంప్రెస్ అయిపోయిన ఇగో మాస్టర్- జగతి తరపున క్షమాపణ అడిగిన రిషి
శౌర్య..వాళ్ళ బాబాయ్ దగ్గరికి వచ్చి వారణాసి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది. లేదమ్మా అమ్మ హాస్పిటల్ లో ఉన్నారట ఎవరో గట్టిగా కొట్టారట అని చెప్పడంతో..వారణాసి నాకోసం ఎన్నో చేశాడని గుర్తుచేసుకుంటుంది. ఒకవేళ మోనిత ఆంటీ పని అయ్యి ఉంటుందా అని శౌర్య అనుకుంటుంది. అప్పుడు వాళ్ళ బాబాయ్ ఎందుకమ్మా అలా అనుకుంటున్నావు అని అడగగా మనం వెతుకుతున్న రహస్యం ఏదో వారణాసికి తెలిసి ఉంటుందా అందుకే మాటలు రాకుండా ఇలా చేసి ఉంటుందా అని ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు కార్తీక్ వారణాసి దగ్గరికి వెళతాడు... వారణాసి నువ్వు నా కోసం దీప కోసం చాలా చేశావు ...దీప బాగోగులు ఈ పదేళ్లు చూసుకున్నావు అని అంటాడు. నువ్వు కోలుకున్నాక నా ఇంట్లో మనిషిలా చూసుకుంటాను....
ఎపిసోడ్ ముగిసింది...