అన్వేషించండి

Karthika Deepam October 17th Update: దుర్గ కాళ్ళ మీద పడి బతిమలాడుకున్న మోనిత, చుక్కలు చూపించిన దీప- శౌర్య కోసం వెతుకుతున్న కార్తీక్

టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కి గతం గుర్తొచ్చేసింది. ఇప్పుడు మోనిత ఏం చేయబోతోందనేది ఇంట్రెస్టింగ్...

మోనిత కోపంగా ఎవర్రా బంగారం అని దుర్గ మీద అరుస్తుంది. రాత్రి దీపని లేపేయ్యడానికి మనుషుల్ని పెట్టావ్ పని జరగలేదని చిరాకుగా ఉన్నావ్ అని దుర్గ అంటాడు. ఈ మాటలు అన్నీ కార్తీక్ దూరం నుంచి వింటాడు. దీపని చంపడానికి నేను మనుషుల్ని పంపించడం ఏంటని అంటుంది.

దుర్గ: కరెక్ట్.. దీపని చంపితే మనకి వచ్చే లాభం ఏంటి కార్తీక్ అడ్డు కదా తొలగించాలి. కార్తీక్ కోసమే మనుషుల్ని పంపించావ్ కదా

మోనిత: ఎందుకురా నన్ను టెన్షన్ పెడుతున్నావ్ నేను ఎవరిని పంపించలేదు నాకు ఎవరితో సంబంధం లేదు

దుర్గ: నేను ఏమైనా కార్తీక్ అనుకున్నావా బంగారం. నువ్వు ఎవరిని పంపించావో వాళ్ళకి నీకు ఉన్న సంబంధం ఎంతో నాకు తెలుసు

నువ్వు వెళ్ళు నీకు దణ్ణం పెడతాను అని మోనిత వాడిని పంపించేస్తుంది. పక్కకి తిరిగి చూసేసరికి కార్తీక్ ఉంటాడు. నువ్వు ఏ మనుషుల్ని పంపించలేదు అన్నావ్ గా మరి ఇదేంటి అని నిలదీస్తాడు. నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని మోనిత బతిమలాడుతుంది. మరి దీపని ఎందుకు చంపాలని అనుకున్నావ్ దీప నా భార్య అని అడుగుతాడు. కాదని మోనిత చెప్తుంది.

కార్తీక్: మరి ఎందుకు దీప అడ్డు తొలగించాల్సిన అవసరం ఏంటి. అంటే నీ భర్త వెంట ఎవరు పడినా వాళ్ళ ప్రాణాలు తియ్యాలని అనుకుంటావా.. నాకు నిజం కావాలి

మోనిత: నాకు నిజంగా ఏమి తెలియదు, నేను ఎవరిని పంపించలేదు

కార్తీక్: చెప్పిందే పడే పడే చెప్తే అబద్ధం నిజం అయిపొడు. నీలా ఫ్రాడ్ చేసే వాళ్ళని చూస్తే నాకు అసహ్యం వేస్తుందని ఛీ కొట్టి వెళ్ళిపోతాడు.

Also Read: ఊహించని మలుపు, కొడుకు కోసం వేదకి అన్యాయం చేయబోతున్న యష్- సులోచన, మాలిని వార్ స్టార్ట్

ఇక జరిగింది అంతా దీప తన డాక్టర్ అన్నయ్యకి చెప్తుంది. డాక్టర్ బాబు లేకపోతే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదని అంటుంది. గతం గుర్తుకి రాకపోయినా మోనిత ఎలాంటిదో కార్తీక్ తెలిసిపోయింది అది చాలులే అని డాక్టర్ అన్నయ్య అంటాడు. ఇప్పుడు చేసింది కార్తీక్ కి తెలిసింది కాబట్టి ప్రస్తుతం మోనిత ఏమి చేయదు నువ్వు చేయాల్సింది కార్తీక్ కి దగ్గర కావడమే అని ధైర్యం చెప్తాడు. ఇక కార్తీక్ గతంలో శౌర్య బొమ్మలు అమ్మిన ప్రదేశానికి వచ్చి అక్కడ ఎంక్వైరీ చేస్తాడు. శౌర్య గురించి ఏమి తెలియకపోవడంతో వెళ్ళిపోతాడు.

మోనిత దుర్గ టార్చర్ తట్టుకోలేక వాడి కాళ్ళ మీద పడి వెళ్లిపొమ్మని బతిమలాడుతుంది. ఇదంతా ఆ వంటలక్క కోసం చేస్తున్నావ్ కదా నీకు ఏం వస్తుంది తన కోసం చేస్తే నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో నీకు ఏం కావాలన్న ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అనేసరికి దీప, దుర్గ పగలబడి నవ్వుతారు. నా మొగుడితో నిజం చెప్పు అప్పుడు వదిలేస్తాను అని దీప అంటుంది. ఇంకో పది జన్మలు ఎత్తినా నువ్వు భార్యవి కాలేవు, మర్యాదగా మా జీవితాల్లో నుంచి వెళ్లిపొమ్మని దీప చెప్తుంది. ఆ మాటకి మోనిత ఫైర్ అవుతుంది. మాటతో పోయే దానికి వేటు దాకా ఎందుకని ఆగుతున్నా అని అంటుంది. నా ప్రాణాలు తియ్యాలని చూశావ్ కానీ నా భర్తే నా ప్రాణాలు కాపాడాడు, అది మూడు ముళ్ళకి ఉన్న గొప్పదనం . ఇంత జరిగినా దీని పొగరు తగ్గలేదు. నువ్వు ఇక్కడే ఉండి అనుమానం వచ్చేలా చెయ్యి ఎంతకాలం తట్టుకుంటుందో చూస్తాను అని దీప దుర్గతో చెప్తుంది.

Also Read: జగతికి అత్తగారి హోదా , రిషిధార మధ్య చిచ్చు పెట్టిన చీర!

మొన్నటి వరకు కార్తీక్ కి నేను ఏది చెప్తే అదే నిజం కానీ ఇప్పుడు నా మీద అనుమానం పెరిగిపోతుందని మోనిత టెన్షన్ పడుతుంది. కార్తీక్ శౌర్య గురించి ఆలోచిస్తూ దీప ఇంటి దగ్గరకి వెళ్తాడు. మన అందరితో సంతోషంగా ఉండాల్సిన దీప ఇక్కడ నా కోసం పాట్లు పడుతుంది. మతి ఉన్నప్పుడు నిన్ను అనుమానించాను, ఇప్పుడు మతి లేకుండా కూడా నిన్ను అనుమానించాను. నా వల్ల ఎన్ని కష్టాలు, అవమానాలు పడినా నా కోసం ఆరాటపడ్డావ్. నీకు నిజం చెప్పి వెళ్లిపోదాం అంటే శౌర్య ఇక్కడే ఉంది. మీరు ప్రమాదంలో ఉన్నారు. మోనిత మన జోలికి రాకుండా కాపాడుకోవాలి అని కార్తీక్ మనసులోనే బాధపడతాడు. దీప నిద్ర లేచి బయటకి వచ్చేసరికి కార్తీక్ ఇంటి బయట కూర్చుని ఉంటాడు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget