News
News
X

Guppedantha Manasu October 14th Update: జగతికి అత్తగారి హోదా , రిషిధార మధ్య చిచ్చు పెట్టిన చీర!

Guppedantha Manasu October 14th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 

గుప్పెడంత మనసు శుక్రవారం ఎపిసోడ్  ( Guppedantha Manasu  October 14th Today Episode 581)
దేవయాని ఇంట్లో బొమ్మల కొలువు సందడి నడుస్తోంది. బొమ్మలకు ఏ చీర సెలెక్ట్ చేయాలా అని వసు ఆలోచిస్తుంటే... నువ్వు ఆ పనిలో ఉండు నేను ఇప్పుడే వస్తానంటూ రిషి అక్కడి నుంచి వెళతాడు. అటు దేవయాని.. వీళ్లు వెళ్లి చాలాసేపైంది ఇంకా రాలేదేంటని అనుకుంటుంది..ఇంతలో గౌతమ్ వచ్చి అదే మాట అడుగుతాడు..నాకేం తెలుసు అని దేవయాని అనడంతో నేను వెళ్లి పిలుచుకుని రానా అని అడుగుతాడు..వెంటనే జగతి సైగ చేసి గౌతమ్ ని వెనక్కు రప్పిస్తుంది..

అటు రూమ్ లో రాజా రాణి బొమ్మలు తీసుకొచ్చిన రిషితో కలసి సెల్ఫీ తీసుకుంటుంది. ఈ బొమ్మలు ఎప్పటికీ వీడిపోకూడదని వసు అంటే..మన బంధం ఎప్పటికీ విడిపోకూడదని మనసులో అనుకుంటాడు.. ఏం ఆలోచిస్తున్నారు అని వసు అడుగుతుంది. కింద అందరూ రిషిధార కోసం వెయిట్ చేస్తుంటారు. వీళ్లింకా రాలేదేంటని మహేంద్ర అంటాడు.. ఇక్కడే ఉంటే ఏం లాభం వెళ్లి పిలుచుకుని రా అని కోప్పడుతుంది దేవయాని. ఇంతలో ఇద్దరూ రానే వస్తారు. ఆ బొమ్మలు బలే ఉన్నాయి ఇలా ఇవ్వు అని గౌతమ్ అంటే..నేను ఇవ్వను అంటాడు రిషి. ఆ బొమ్మలేంటని దేవయాని అడిగితే.. నేనే తయారు చేసి ఇచ్చానంటుంది వసుధార.. ఆ బొమ్మలతో పాటూ ఇద్దరికీ ఫొటో తీస్తాడు గౌతమ్..  మీరు కూడా రండి పెద్దమ్మా అని రిషి అంటే మీరుకానివ్వండి అనేస్తుంది దేవయాని. కాసేపు కళ్లు కళ్లు కలుస్తాయి..ఫొటో సెషన్ నడుస్తుంది.. దేవయాని తప్ప అందరూ సంతోషిస్తారు. గౌతమ్ చేతిలో ఫోన్ లాక్కున్న దేవయాని పూజకు టైమ్ అవుతోంది పదండి అంటుంది. 

Also Read: కార్తీక్ ఈజ్ బ్యాక్ - వంటలక్క సేఫ్, ఇక మోనితకు మూడినట్టే!

రాజా-రాణి బొమ్మల్ని కొలువులో పెట్టిన రిషి... ఈ బొమ్మలు మన ప్రేమకు ప్రతిరూపాలు వసుధార అని అనుకుంటే.. ఈ బొమ్మల మధ్య మనమధ్య దూరం ఎప్పుడూ ఉండొద్దు సార్ అనుకుంటుంది వసుధార. దేవయాని ఏదో మొక్కుబడిగా మాట్లాడుతుంది. ఎవరికి వారు మనసులో కోరికలు కోరుకుంటారు. వసుధార రిషిలు ఎప్పటికీ కలసి ఉండాలి ఆనందంగా ఉండాలని దండం పెట్టుకుంటారు..
దేవయాని: ఈ ఇంట్లో నా పెత్తనం సాగాలి..రిషి నా చెప్పుచేతల్లోనే ఉండాలి
ధరణి: పెద్దత్తయ్య ఏం కోరుకున్నారో అది మాత్రం జరగకూడదు
గౌతమ్: ఈ రిషి గాడి కోపాన్ని తగ్గించు
రిషి: వసుధార మనసులో ఉన్న అడ్డుతెర తొలగాలి..తను గొప్ప స్థాయికి వెళ్లాలి
వసు: రిషి సార్.. మా జగతి మేడంని రిషి సార్ అమ్మా అని పిలవాలి..మచ్చలేని చంద్రుడిలా చూడాలి..ఎప్పుడూ ప్రిన్స్ లా ఉండాలి
నేను ఇప్పుడే వస్తానంటూ రిషి పైకి వెళతాడు...ఎక్కడికి అని దేవయాని అడిగితే ఇప్పుడే వస్తానంటాడు...
దేవయానిని నిల్చోబెట్టి ఫొటో తీస్తాడు గౌతమ్..కొంచెం స్టైల్స్ మార్చండి పెద్దమ్మా మీలో ఉన్న వేరియేషన్స్ చూపించండి అని ఆటపట్టిస్తుంటాడు.. ఈ బొమ్మల కొలువు ఎందుకు పెడతారు పెద్దమ్మా అని గౌతమ్ అడుగుతాడు..దేవయాని నసుగుతుంటే.. నేను చెబుతాను సార్ అంటూ చిన్నపాటి క్లాస్ ఇస్తుంది వసుధార..

News Reels

Also Read: అందరి ముందూ రిషి చేయిపట్టుకుని తీసుకెళ్లిన వసు, మరో స్కెచ్ వేసిన దేవయాని!

ఇంతలో అక్కడకు వచ్చిన రిషి..మేడం ఇది మా నానమ్మగారి చీర..ఇంటికొచ్చే కోడలిగా ఈ సందర్భంగా వసుధార ఈ చీర కట్టుకుంటే బావుంటుంది అంటాడు. రిషి ఆ మాట అనగానే అందరి మొహాల్లో ఆనందం ఉప్పొంగుతుంది..దేవయానికి పెద్ద షాక్ తగిలి అలాగే ఆగిపోతుంది. ఈ చీర మీ చేతులమీదుగా వసుధారకి ఇవ్వండి అంటాడు రిషి... రాబోయే కోడలికి కాబోయే అత్తగారిని అని నాకు అధికారం ఇస్తున్నావా రిషి అనుకుంటుందిజగతి... నాన్నా రిషి అని దేవయాని పిలవగానే.. ఇవ్వనీయండి పెద్దమ్మా అని ఆ చీర జగతి చేతికిస్తాడు.  
దేవయాని: అసలే అది మా అత్తగారి చీర..పవిత్రంగా,గౌరవంగా చూసుకోవాలి కదా..ఉట్టి చీర ఇవ్వకు పసుపు, కుంకుమ అద్ది ఇవ్వు 
జగతి ఆ చీరపై తాంబూలం పెట్టి వసుధారకి సంతోషంగా అందిస్తుంది. మా అత్తగారి చీరను ఈరోజు నీకిలా బహుమానంగా నా చేతులతో ఇవ్వడం నా భాగ్యంగా భావిస్తున్నాను తీసుకో అంటుంది జగతి. మంచి పని చేశావురా అంటాడు గౌతమ్. ఏంటి వసుధారా అలా చూస్తున్నావ్ వెళ్లి ఆ చీర కట్టుకుని వచ్చి బొమ్మల కొలవులో దీపాన్ని వెలిగించు..ఈ ఇంటికోడలిగా భూషన్ వంశంలోకి ఈ రకంగా ఆహ్వానిస్తున్నాం అనుకో అంటుంది దేవయాని... మీ పెదనాన్న ఇక్కడ ఉండిఉంటే బావుండేది ఈ పండుగ రోజుల్లో వెళ్లి వసుధార వాళ్ల పెద్దవాళ్లతో మాట్లాడేవారం కదా..ఏదో మీటింగ్ ఉందని వెళ్లిపోయారంటుంది.. ఇప్పుడెందుకు అవన్నీ అన్న మహేంద్ర..నువ్వెళ్లమ్మా అంటాడు ....అప్పుడు వసుధార ఆ చీర తీసుకుంటుంది. 

వసుధార మాత్రం...వాగ్ధానం మరిచిపో అన్న మాటలు గుర్తుచేసుకుంటూ అయిష్టంగా ఆ చీర తీసుకుని రూమ్ లోకి వెళుతుంది. పైన రూమ్ కి వెళ్లి ఆ చీర పక్కన పెట్టేసి ఆలోచనలో పడుతుంది..ఇంతలో అక్కడకు జగతి వస్తుంది. 
జగతి: ఏంటి వసు ఆలోచిస్తున్నావ్..చీర కట్టుకో...
వసు: ఈ చీర కట్టుకుంటే సగం ఈ ఇంటికోడలు అయినట్టే కదా.. రిషి సార్ అంటే నాకు ప్రాణమే కానీ నేను ఇంటి కోడల్ని కావాలంటే దానికి అడ్డంకి మిగిలిపోయింది కదా..
జగతి: ఇప్పుడు అవన్నీ ఆలోచించే సమయంకాదుకదా..
వసు: సమయాన్ని సందర్భాన్ని పక్కనపెట్టి సడలింపులు ఇచ్చుకుంటూ పోతే దాన్ని వ్యక్తిత్వం,జీవితం అనరు..మనం ఒకటి నమ్మినప్పుడు కష్టమైనా నిలబడాలి..మధ్యలోనే ఎలా వదిలేస్తాం
జగతి: కొన్నిటిని చూసీచూడనట్టు వెళ్లాలి...
వసు: కొన్నింటిని మాత్రమే..అన్నింటినీకాదు..రిషి సార్ ని ఎలాంటి మచ్చ లేకుండా చూడాలి అనుకుంటున్నాను.. ప్రపంచంలో ఎవరైనా తల్లి గొప్పతనంగురించి అనర్గళంగా మాట్లాడతారు..అలాంటిది రిషి సార్ అమ్మ అని పిలవరు అంటే నేను తట్టుకోలేను..
జగతి: ఎందుకింత మొండిపట్టు..నా మాట విను..చీర కట్టుకో..దీన్ని పెద్ద ఇష్యూ చేయొద్దు..
ఇంతలో మహేంద్ర కూడా ఎంట్రీ ఇస్తాడు..దీనికంతటికీ నేనే కారణం కదా..నావల్లే కదా అనుకుంటాడు.. మహేంద్ర నువ్వెళ్లు నేను వస్తానంటుంది జగతి. 
జగతి: గురుదక్షిణ అడిగాడు కానీ ఈ విషయం ఇంత పెద్దది అవుతుందని మహేంద్ర అప్పుడు అనుకోలేదుకదా.. నా మాట విను
వసుధార ఆలోచనలో పడుతుంది...ఎపిసోడ్ ముగిసింది...

Published at : 14 Oct 2022 10:21 AM (IST) Tags: Guppedantha Manasu Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Rasagnya Reddy jyothi roy GuppedanthaOctober 14th Manasu Episode 581

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డికి టిక్కెట్ టు ఫినాలే? ఫైనల్‌కు దూసుకెళ్లిన సామాన్యుడు?

Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డికి టిక్కెట్ టు ఫినాలే? ఫైనల్‌కు దూసుకెళ్లిన సామాన్యుడు?

Actress Sai Pallavi: సినిమాలకు సాయి పల్లవి గుడ్ బై? ప్రజలకు మేలు చేయడానికేనట!

Actress Sai Pallavi: సినిమాలకు సాయి పల్లవి గుడ్ బై? ప్రజలకు మేలు చేయడానికేనట!

Liger Money laundering case : విజయ్ దేవరకొండను డిస్ట్రిబ్యూటర్లు వదిలేసినా ఈడీ వదల్లేదు

Liger Money laundering case : విజయ్ దేవరకొండను డిస్ట్రిబ్యూటర్లు వదిలేసినా ఈడీ వదల్లేదు

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

టాప్ స్టోరీస్

Roja Comments: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు కూడా లేరు, ఇదేం కర్మరా బాబు: మంత్రి రోజా

Roja Comments: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు కూడా లేరు, ఇదేం కర్మరా బాబు: మంత్రి రోజా

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

England Team Virus Attack: గుర్తుతెలియని వైరస్ బారిన పడ్డ ఇంగ్లండ్ క్రికెటర్లు- పాక్ తో తొలి టెస్ట్ వాయిదా!

England Team Virus Attack: గుర్తుతెలియని వైరస్ బారిన పడ్డ ఇంగ్లండ్ క్రికెటర్లు- పాక్ తో తొలి టెస్ట్ వాయిదా!

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే