News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Guppedantha Manasu October 13th Update: అందరి ముందూ రిషి చేయిపట్టుకుని తీసుకెళ్లిన వసు, మరో స్కెచ్ వేసిన దేవయాని!

Guppedantha Manasu October 13th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 
Share:

గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్  ( Guppedantha Manasu  October 13th Today Episode 580)

వసుధార ఇచ్చిన బొమ్మలు చూసి రిషి మురిసిపోతుండగా అక్కడకు వచ్చిన గౌతమ్..బొమ్మలు చాలా బావున్నాయి ఏదీ చూడనీ అంటాడు. ఇవి నా బొమ్మలు ఇవ్వను అంటాడు. మళ్లీ ఆ బొమ్మలు లాక్కునేందుకు గౌతమ్ ప్రయత్నించడంతో ఇవి నా బొమ్మలు అని చెప్పి మురిసిపోతాడు. ఇంట్లో బొమ్మల కొలువు పెడుతున్నాం నువ్వు హెల్ప్ చేయాలని గౌతమ్ కి చెబుతాడు.  ఆ తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర రిషి కోసం వెయిట్ చేస్తుంటారు. నేను మెసేజ్ చేశానులెండి అని వసుధార అనేలోగా రిషి వస్తాడు. ధరణి వడ్డిస్తుండగా..ఈ రోజు నేను వడ్డిస్తాను మీరు కూర్చోండి అంటాడు. దేవయాని వారిస్తున్నా రిషి పర్వాలేదు అంటాడు. వసుధారకి కొసరి కొసరి పెడుతుంటాడు..అరేయ్ మేం కూడా ఇక్కడున్నాంరా అంటాడు గౌతమ్. నువ్వుంటావు లేరా.. పాపం వసుధార రూమ్ లో ఏం వండుకుంటోందో ఏం తింటుందో అన్న స్పృహ నీకుందా అంటాడు.. ఆ తర్వాత అందరకీ వడ్డిస్తాడు. దేవయాని కుళ్లుకుంటుంది..అందరూ మురిసిపోతారు. జగతికి వడ్డించడులే అనుకుంటుంది దేవయాని..కానీ రిషి అందరితో పాటూ జగతికి వడ్డిస్తాడు...
మహేంద్ర: తను ఎక్కువ తినదు చాలు చాలు 
రిషి: తిననివ్వండి డాడ్..హెల్త్ ప్రాబ్లెమ్స్ అన్నీ క్లియర్ అవ్వాలంటే అన్నీ తినాలి..తృప్తిగా తినాలి
దేవయాని కుళ్లుతో చూస్తండడం చూసి..ఏమైనా వడ్డించమంటారా మేడం ఎందుకలా చూస్తున్నారు తినండి అంటుంది వసుధార.. తననే చూస్తున్న జగతిని చూసి రిషి..మేడం తినండి అలా చూస్తున్నారేంటి అంటాడు.. డైనింగ్ టేబుల్ దగ్గర తెగ సందడి చేస్తాడు.. దేవయానికి ముద్ద దిగదు..
రిషి: డాడ్..మేడం గారితో కలసి సరదాగా ఏదైనా పిక్ నిక్ వెళ్లొచ్చుకదా ( అందరికీ పెద్ద షాకే ఇది)..ఐ మీన్ మనసు ప్రశాంతంగా ఉంటుంది..
గౌతమ్: రిషి సూపర్ ఐడియా ఇచ్చాడు వెళ్లండి.. ఎప్పుడూ కాలేజీ, ఇల్లేనా
ప్లాన్ చేయండని వసు..వెళ్లిరండి చిన్నమావయ్య అని ధరణి అనడంతో సరే ప్లాన్ చేద్దాం అంటాడు మహేంద్ర
రిషి: డాడ్ మీ సంతోషమే నా సంతోషం, బంధాలు పక్షుల్లా స్వేచ్ఛగా ఎగిరినంతకాలం చాలా బావుంటాయి..కానీ బంధాలను ఒప్పందాల పేరుతో బంధించనంతవరకే బావుంటాయి..
మహేంద్ర: అన్నిటికీ ఒప్పుకుంటావ్ కానీ గురుదక్షిణకు ఒప్పుకోవని అర్థమైంది అనుకుంటాడు మహేంద్ర..
రిషి: డాక్టర్ చెప్పినట్టు మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో మీరుకూడా ఆలోచించండి...

Also Read: హమ్మయ్య డాక్టర్ బాబు-వంటలక్క మళ్లీ కలసిపోయారు, ఇప్పుడు మోనిత పరిస్థితేంటి!

బొమ్మల కొలువు గురించి డిస్కషన్ మొదలెడతారు... నా బాల్యంలో అలాంటి అందమైన జ్ఞాపకాలు చాలా తక్కువ అని బాధపడతాడు రిష. బొమ్మలకొలువుతో మంచి పని చేస్తున్నాం అంటాడు మహేంద్ర. ఏమంటారు వదినగారు అని మహేంద్ర అంటే..అన్నీ మీరే డిసైడ్ చేసుకుని నన్ను అడుగుతున్నారెందుకు అనుకుంటుంది దేవయాని. వీళ్లకి వీళ్లే డిసైడ్ చేసుకుని నన్ను అడుగుతున్నారనుకుంటుంది. ఇంకా చాలా ఉంటాయని దేవయాని అనడంతో..మీ చేయి పడనిదే ఏమీ జరగదు అంటాడు రిషి. వసుధార ఇంట్లోకొచ్చింది, ఇప్పుడు బొమ్మల కొలువు అంటోంది..ఏదో ఒకటి చేయాలి తప్పదు అనుకుంటుంది దేవయాని.

Also Read: రాణికి బుగ్గచుక్క దిద్దిన రిషి, మురిసిన వసు, జగతి ఆనందం కోసం మరో అడుగు

అటు రూమ్ కి వెళ్లగానే..ఏంటి అందరి ముందూ అలా తీసుకొచ్చావ్ అని అడుగుతాడు రిషి. ఒక్కోసారి చాలావాటికి చిరునవ్వే సమాధానం అవుతుందని సమాధానం ఇస్తుంది. మనం వచ్చిన పని చూద్దాం అంటుంది. అటు బొమ్మల  కొలువు దగ్గర నేను హెల్ప్ చేయనా అని దేవయాని అంటే..వద్దులెండి అక్కయ్య గారు మీరు అలా నిలబడండి మేం చేస్తాం అంటుంది. పెద్దమ్మ కుళ్లు బఠానీ అంటూ గౌతమ్ సైలెంట్ గా సెటైర్స్ వేస్తుంటాడు...
ఎపిసోడ్ ముగిసింది...

Published at : 13 Oct 2022 10:13 AM (IST) Tags: Guppedantha Manasu Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Rasagnya Reddy jyothi roy GuppedanthaOctober 13th Manasu Episode 580

ఇవి కూడా చూడండి

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Devil Movie: ‘డెవిల్’ కోసం కళ్యాణ్‌రామ్‌కు 90 స్పెషల్ కాస్ట్యూమ్స్‌ - ఇటలీ నుంచి తెప్పిన మోహైర్ ఊల్‌తో!

Devil Movie: ‘డెవిల్’ కోసం కళ్యాణ్‌రామ్‌కు 90 స్పెషల్ కాస్ట్యూమ్స్‌ - ఇటలీ నుంచి తెప్పిన మోహైర్ ఊల్‌తో!

‘సరిపోదా శనివారం’ రిలీజ్ అప్‌డేట్, ‘నాసామిరంగ’ ఫస్ట్ సింగిల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘సరిపోదా శనివారం’ రిలీజ్ అప్‌డేట్, ‘నాసామిరంగ’ ఫస్ట్ సింగిల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Samantha: బాలీవుడ్ రియాలిటీ షోలో సమంత - స్టేజీపై హైదరాబాదీ ర్యాపర్‌తో హల్‌చల్!

Samantha: బాలీవుడ్ రియాలిటీ షోలో సమంత - స్టేజీపై హైదరాబాదీ ర్యాపర్‌తో హల్‌చల్!

Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!

Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!

టాప్ స్టోరీస్

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు

Dhiraj Sahu IT Raids Money: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నగదు రూ.318 కోట్లు, ఇంకా 40 సంచులు పెండింగ్!

Dhiraj Sahu IT Raids Money: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నగదు రూ.318 కోట్లు, ఇంకా 40 సంచులు పెండింగ్!

General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

General elections in February :  ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ?  కేంద్ర  ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?