Guppedantha Manasu October 12th Update: రాణికి బుగ్గచుక్క దిద్దిన రిషి, మురిసిన వసు, జగతి ఆనందం కోసం మరో అడుగు
Guppedantha Manasu October 12th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్ ( Guppedantha Manasu October 12th Today Episode 579)
జగతి ఆరోగ్యం గురించి ఆరాతీసిన రిషి..చిన్నపాటి క్లాస్ వేస్తాడు.
రిషి: మీరు ఇక్కడికి వచ్చాక డాడ్ ఆనందంగా ఉన్నారు దయచేసి డాడ్ ఆనందాన్ని దూరం చేయొద్దు అనేసి వెళ్లేందుకు వెనక్కు తిరగ్గానే అక్కడ మహేంద్ర ఉంటాడు. అప్పుడు రిషి జగతితో, అబద్ధం చెప్తే ప్రతిక్షణం దాన్ని కాపాడుతూ ఉండాలి నిజం చెప్తే అదే మనల్ని కాపాడుతుంది.నేను ఇప్పుడు మీకు చెప్పిన విషయాలన్నీ నిజాలే..అబద్ధం లేదు ఇక మీ ఇష్టం..డాడ్ జాగ్రత్త అని చెప్పేసి వెళ్లిపోతాడు
మహేంద్ర: రిషి మాటలకు బాధపడకు జగతి
జగతి: రిషి కఠినంగా మాట్లాడినా మనసులో ఉన్నది చెప్పాడు..రిషి బంధాన్ని విడగొట్టొద్దు..రిషిని ఒంటరిని చేయొద్దు.. వసులేకపోతే రిషి మళ్లీ ఒంటరి అవుతాడు ఆ పరిస్థితి రాకూడదనే ఆశిస్తున్నాను మహేంద్ర అంటుంది..
ఆటోలో బయలు దేరిన వసుధార.. ఈ రోజు రిషి సార్ కి గిఫ్ట్ ఎలాగైనా ఇవ్వాలి, సార్ కి ఫోన్ చేద్దామా అని అనుకుంటుంది. అయినా నేను ఆలోచిస్తున్నన్ని సార్లు ఆయన ఆలోచిస్తారా..ఎంతైనా అబ్బాయిలకి అమ్మాయిల మీద ప్రేమ తక్కువే అని అనుకుంటుంది. ఇంతలో రిషి నుంచి థ్యాంక్యూ అనే మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూస్తూ ఆటో దిగుతుంది వసుధార.. రిషి వసుకి మెసేజ్ చేస్తూ నడుస్తుంటాడు..ఇద్దరూ ఢీ కొట్టుకుంటారు. మరోసారి కొట్టుకోపోతే కొమ్ములొస్తాయ్ అంటూ బొమ్మరిల్లు జెనీలియాలా డైలాగ్ చెబుతుంది... అవునా నిజంగా బావుంటాయా అనుకున్న రిషి ఎవ్వరూ చూడకపోవడం చూసి కావాలని ఢీ కొడతాడు...
వసు: థ్యాంక్స్ ఎందుకు చెప్పారు
రిషి: మనకు ఉపయోగపడే పనిచేసినప్పుడు థ్యాంక్స్ చెబుతారు... లిస్టు పెద్దదే ఉంది..నీకోసం మేడం ఎదురుచూస్తుంటారు వెళ్లు
వసు వెళుతుండగా..ఆగు అని అడుగుతాడు
రిషి: ఇకపై పికప్ లు డ్రాప్ లు ఉండకూడదంటే ఏం చేయాలి
వసు: ఇద్దరం ఒకే దగ్గర ఉండాలి
రిషి: మొత్తానికి ఇద్దరం ఒకే దగ్గర ఉండాలని కదా..అదెప్పుడు అనేది నువ్వే డిసైడ్ చేయి అంటాడు..
ఆ వెనుకే దేవయాని మొత్తం చూస్తుంది...రిషి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంటాడు...
దేవయాని: ఎందుకొచ్చావ్ అని రిషి అడిగాడా
వసు: లేట్ గా ఎందుకొచ్చావ్ అని అడిగాడు
దేవయాని: నాకలా అనిపించలేదు...
వసు: మీకు కావాల్సింది జరగనప్పుడు అలాగే అనిపిస్తుంది
దేవయాని: చాలా ఎక్కువ చేస్తున్నావ్ వసుధారా
వసు: మనం తప్పుచేయనప్పుడు ఎక్కువ చేసినా పర్వాలేదు... అయినా మీరు అడగాలి అనుకున్న ప్రశ్నలన్నీ ఓ పత్రంపై రాసివ్వండి నేను సమాధానం రాసిస్తాను...
Also Read: డాక్టర్ బాబుకి గతం గుర్తొచ్చేసిందోచ్, మోనిత కుట్ర నుంచి దీపను కాపాడగలడా!
కార్లో వెళుతూ..జగతితో మాట్లాడిన విషయాలు గుర్తుచేసుకుంటాడు. వసుధార ఆలోచనలు మార్చి గురదక్షిణ అంశాన్ని పక్కనపెట్టి నాకు అప్పగిస్తారా..మేడం ఏం చేస్తారో అని ఎదురుచూస్తున్నాను అనుకుంటాడు రిషి...
అటు జగతి కూడా సేమ్ అదే ఆలోచిస్తుంది... ఒక్క పిలుపుకోసం వసుధారతో బంధాన్ని దూరం చేయకండి అని...
జగతి: పరిస్థితి విషమించకుండా వీళ్లిద్దరి బంధం చేయిదాటకుండా మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. తనకోసం మనం పది అడుగులు ముందుకేయాలి..దీన్ని రిషి పరోక్షంగా మనకు అప్పగించిన బాధ్యతగా నేను భావిస్తున్నాను
మహేంద్ర: గురుదక్షిణ చెల్లించి తీరుతాను అన్న వసు మాటలు గుర్తుచేసుకున్న మహేంద్ర..తండ్రిగా రిషి బాధ్యత తీసుకుంటాను కానీ భర్తగా నీ మనసు తెలుసుకోవాలి కదా...దేవయాని అక్కయ్య వల్లే ఇదంతా జరిగింది..ఇలాంటి విషయాలు మనం ఇంట్లో మాట్లాడకుండా ఉంటేనే బావుంటుంది...
ఇంతలో వసు, గౌతమ్ అక్కడకు వస్తారు...
వసు: మేడం ఆరోగ్యం ఎలా ఉంది..
జగతి: శరీరం బాగానే ఉంది..మనసు బాలేదు..
మహేంద్ర: జగతీ..ఇక్కడేం మాట్లాడవద్దు అని చెప్పానుకదా..
వసు: జగతి మేడంకి ఇష్టమైన పనిని చేయబోతున్నాను
మహేంద్ర: అంటే నాక్కూడా నచ్చుతుంది...
జగతి: ఏం చేయబోతున్నావు.. ఒకప్పుడు రిషిని చూస్తే భయం వేసేది..ఇప్పుడు నిన్ను చూస్తే భయం వేస్తోంది
వసు: మీరు భయపడే పనులు చేయను..రిషి సార్ పర్మిషన్ తీసుకోవాలి
ఇక పనైనట్టే అని గౌతమ్ నిట్టూరిస్తే..అలా ఎందుకు అంటావ్ అంటుంది జగతి..
నువ్వెక్కడ ఏం చేసినా పర్వాలేదు కానీ ఇంట్లో మాత్రం వదినగారి పర్మిషన్ తీసుకోవాలి...
వసు: చూద్దాం సార్..రిషి సార్ ఉన్నారు కదా..
Also Read: రాజా-రాణి బొమ్మలతో రిషిధార ఆటలు, దేవయానికి క్లారిటీ జగతికి క్లాస్ ఇచ్చిన రిషి
రిషి రూమ్ లో కూర్చుని ఆలోచిస్తుంటాడు...వసుధార వెళుతుంది...
రిషి: ఏంటి అక్కడే నిల్చున్నావ్..రా ( బ్యాగ్ వెనుక దాచుకుని వెళుతుంది) వసు చేతిలో ఏముందా అని తొంగి చూస్తాడు
ఏదో దాచిపెడుతున్నావ్..దాపరికాలు, దాగుడుమూతలు ఆపలేదా
వసు: ఏంటి సార్ అలా మాట్లాడుతారు..గిఫ్ట్ సార్..
రిషి: నా బర్త్ డే కాదుకదా..
వసు: గిఫ్ట్ ఇవ్వడానికి మనసు ఉంటే చాలు..సందర్భం అవసరం లేదు..
ఓపెన్ చేసి చూసిన రిషి..చాలా బావున్నాయి వసుధార అంటాడు. అవును సార్ రాజు మీరు, రాణి నేము ఇద్దరం ఎప్పుడూ పక్కపక్కనే ఉండాలి అంటుంది. రిషి చాలా సంతోషపడతాడు..
వసు: సర్ మీరు ఏమి అనుకోకపోతే మీకు ఒక విషయం చెప్పాలి జగతి మేడంకి బొమ్మల కొలువ అంటే చాలా ఇష్టం.అందుకే ఈ ఇంట్లో బొమ్మలకొల్లు పెడదాం అనుకుంటున్నాను మీరు ఏమంటారు
రిషి: చిన్నప్పటి నుంచి ఎప్పుడూ బొమ్మల కొలువు జ్ఞాపకాలు నా దగ్గర లేవు ...జగతి మేడం ఆనందపడితే డాడ్ సంతోషంగా ఉంటారు అని ఆలోచించి సరే అంటాడు
వసు: మీరు ఒప్పుకుంటారని నేను అసలు అనుకోలేదు సార్
రిషి: నేను ప్రిన్స్ అంటావు, విలన్ చేసేసావా
వసు: లేదు సర్ ఊరకనే అలా అన్నాను
రిషి: బొమ్మలు బానే ఉన్నాయి వసుధార, కానీ చిన్న లోటు ఉంది...వసుధార కంటి కాటుకను తీసి రాణికి దిష్టి తగలకుండా చుక్క పెడతాడు
వసు: కళ్ళు తెరిచి దిష్టి చుక్క నాకు పెట్టలేదా అని అనుకుంటుంది
అప్పుడు రిషి వసువైపు చూస్తుండిపోతాడు.....ఎపిసోడ్ ముగిసింది