News
News
X

Karthika Deepam October 12th Update: డాక్టర్ బాబుకి గతం గుర్తొచ్చేసిందోచ్, మోనిత కుట్ర నుంచి దీపను కాపాడగలడా!

కార్తీకదీపం అక్టోబరు 12ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ నుంచి మోనితను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది వంటలక్క

FOLLOW US: 
Share:

Karthika Deepam October 12th Episode 1481 (కార్తీకదీపం అక్టోబరు 12 ఎపిసోడ్)

బతుకమ్మ ఆడిపాడిన తర్వాత వాటిని తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేస్తారు. నా బతుకును నిలబెట్టు బతుకమ్మ అని వేడుకుంటుంది దీప. చాలా సేపటి నుంచి డాక్టర్ బాబు కనిపించడం లేదమ్మా అని డాక్టర్ తల్లితో అంటుంది. నీ భర్తను ఏమీ చేయదని నీకు తెలుసుకదమ్మా...ఎప్పటికైనా నిజం చేరవలసిన వాళ్లకి చేరకతప్పదు, నీ భర్త నిన్ను వెతుక్కుంటూ వస్తాడు, ఆ మోనిత ఏమీ చేయలేదని ధైర్యం చెబుతుంది డాక్టర్ తల్లి. అదే సమయంలో మోనిత ఎవరికో కాల్ చేసి దీపను చంపేసేందుకు స్కెచ్ వేస్తుంది. మరికొన్నిగంటల్లో నీ చరిత్ర సమాప్తం దీపా...నేను డాక్టర్ బాబు పక్కనే ఉంటాను కాబట్టి నాపై అనుమానం రాదు అనుకుంటుంది మోనిత. అయితే దీప మాత్రం మోనితను చూడదు...ఆ పక్కనుంచి వెళ్లిపోతుంది. 

డాక్టర్ బాబుని వెతుకుతూ దీప..
దీప వెనుకే ఫాలో అవుతూ మోనిత..
తల్లిని వెతుకుతూ శౌర్య...
మరోవైపు కార్తీక్ కనిపించకపోవడంతో మోనిత టెన్షన్ పడుతుంది. నేను కార్తీక్ పక్కనే ఉండకపోతే అనుకున్న పని అవదని మోనిత తన ఫ్రెండ్ కావేరితో అంటుంది...వెతకడానికి వెళతారు. ఇంతలో ఇంద్రుడికి దీప కనిపిస్తుంది. మా అమ్మాయితో మీరు ఫోన్లో మాట్లాడారు కదా..సరుకులు చెబితే రాశారు కదా ఒక్కసారి రండి అని బతిమలాడుతాడు..నేను చెప్పేది వినండి అంటూ జరిగినదంతా చెబుతాడు కానీ దీప మాత్రం కార్తీక్ టెన్షన్లో పట్టించుకోకుండా వెళ్లిపోతుంది.. ఇంద్రుడు చెప్పేది వినదు. 
అటు శౌర్య ఎదురుపడడంతో మోనిత ఫైర్ అవుతుంది. నోరు మూసుకుని ఇక్కడి నుంచి పో.. మీ అమ్మానాన్నని నేనే మట్టిలో కలిపేశాను అని చెబితే అర్థం కావడం లేదా ఇక్కడి నుంచి పో అని అరుస్తుంది. ఈలోగా ఇంద్రుడు వచ్చి మనం వెతుకుతున్న ఆమె కలిసిందని ఏదోకంగారులో ఉండి పిలిచినా రానని కసురుకుంది...పైగా నీ కథ మొత్తం చెప్పాను కానీ వినిపించుకోకుండా వెళ్లిపోయింది.. అయితే మా అమ్మ అయి ఉండదు బాబాయ్ వెళదాం పదా అంటుంది శౌర్య..

Also Read: డాక్టర్ బాబుని చూసిన వారణాసి - నిజానికి దగ్గరగా కార్తీక్, దీప ప్రాణాలు తీసేందుకు సిద్ధమైన మోనిత

కార్తీక్ ఒక్కడూ తిరుగుతూ గతం గుర్తుచేసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తాడు. మరోవైపు అందరూ ఎవరికి వారే కార్తీక్ కోసం వెతుకుతూ ఉంటారు. కార్తీక్ కి గతం గుర్తొచ్చి వెళ్లిపోయాడేమో అని మోనిత అంటే..గతం గుర్తొస్తే వెళ్లిపోడు వచ్చి నీ గొంతు పట్టుకుంటాడంటుంది మోనిత స్నేహితురాలు కావేరి.  కార్తీక్ ఒక్కడూ ఆలోచిస్తుంటే గ్రామపెద్ద రాజ్యలక్ష్మి అక్కడకు వస్తుంది.

రాజ్యలక్ష్మి: వాళ్లు వీళ్లు చెప్పింది నమ్మకు..నీ మనస్సాక్షితో ఆలోచించు.. పరాయి ఆడవాళ్ల భర్తతో సంబంధం పెట్టుకునేవారుంటారు కానీ పరాయి ఆడదాని భర్తను తన భర్త అని చెప్పుకునేవారుండరు..
కార్తీక్: మోనిత నా భార్య అంటోంది..నన్ను కాపాడుకోవడానికి తాపత్రయం పడుతోంది..ఇదంతా నిజమే కదా
రాజ్యలక్ష్మి: నిజంగా భార్య అంటే నువ్వు చేజారిపోతావనే భయం ఎందుకు..కేవలం ప్రేమించిన అమ్మాయి మాత్రమే. 
కార్తీక్: నా భార్య కాకపోతే బిడ్డ అంటూ ఓ బిడ్డను తీసుకొచ్చి నా చేతిలో ఎందుకు పెట్టింది..ఎంత ఆలోచించినా గుర్తుకురావడం లేదు
రాజ్యలక్ష్మి: దీపని నమ్ము..దీపను మాత్రమే నమ్ము..నేను మనుషుల్ని వారి మనస్తత్వాన్నికాచి వడబోసినదాన్ని.. ఓ ఆడదాని చూపు బట్టి వాళ్లలో స్వచ్ఛత తెలుస్తుంది.. మోనిత చూపులో నిజాయితీ లేదు, దీప చూపులో కచ్చితత్వం ఉంది. తన భర్త తనకు కాకుండా పోతాడనే బాధ ఉందికానీ ఇంకేం లేదు.. మోనిత-దీప ఇద్దరూ పరిచయం లేనివారే అయినా దీప ముందు మోనిత దూదిపింజలా తేలిపోతుంది.. పెద్దదానిగా చెబుతున్నా నా మాట విను..దీప మాటను విశ్వశించు.. బతుకమ్మ సాక్షిగా చెబుతున్నా నీకంతా మంచే జరుగుతుంది....

రాజ్యలక్ష్మితో మాట్లాడి కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా వారణాసి ఎదురుపడతాడు. డాక్టర్ బాబు మీరు బతికే ఉన్నారా నేను నమ్మలేకపోతున్నాను..మిమ్మల్ని మళ్లీ ఇలా చూస్తాను అనుకోలేదంటాడు. ఎవడ్రా నువ్వు ఊర్లో అడుగుపెట్టింది మొదలు ఒకర్ని మించి మరొకరు సీన్ క్రియేట్ చేస్తున్నారు..గతం గుర్తులేదని చెప్పి ఆడుకోవడానికి చూస్తే ఊరుకోను..ఎవ్వరి మాటలు విని మోసపోదలుచుకోలేదు వెళ్లు...
వారణాసి: నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి డాక్టర్ బాబు..ఈ ఫొటోచూసి ఆ మాట చెప్పండి అని దీపకార్తీక్ కలిసున్న ఫొటో చూపిస్తాడు. ఇప్పటికైనా నమ్ముతారా..

Also Read: రాజా-రాణి బొమ్మలతో రిషిధార ఆటలు, దేవయానికి క్లారిటీ జగతికి క్లాస్ ఇచ్చిన రిషి

శౌర్య...మోనిత మాటలు గుర్తుచేసుకుని బాధపడుతుంది
శౌర్య: మొదటిసారి నన్ను చూసినప్పుడు మోనిత బాగా మాట్లాడింది, జాలి చూపించింది..కానీ ఇప్పుడేమో నన్ను చూడగానే కంగారు పడిపోయింది,కసురుకుంది
ఇంద్రుడు: తనకు కావాల్సింది నువ్వు ఊర్లో ఉండకపోవడం..అమ్మానాన్నలు లేరనే అనుకుందాం అలాంటప్పుడు నిన్ను హైదరాబాద్ ఎందుకు పంపించాలి.. తెలిసిన అమ్మాయివి కదా తనతో పాటూ రెండు రోజులు ఉంచుకోవచ్చు కదా... ఇంటికి వెళితే తన బండారం బయటపడుతుందని భయపడుతోంది. నిజం ఏంటో తెలియదు కానీ తను నీతో చెప్పింది మాత్రం అబద్ధం 
శౌర్య: పిన్ని ఏది...
ఇంద్రుడు: ఇంకా వెతుకుతోంది ఆవిడకోసం...

అటు దీపను చంపేందుకు మోనిత రౌడీలను పిలిపిస్తుంది. ఇంతలో దీప స్వయంగా మోనిత దగ్గరకు వస్తుంది..
డాక్టర్ బాబుని నువ్వే దాచేశావ్ అని దీప అంటే..నాకు దాచాల్సిన అవసరం ఏంటి ఇక్కడే ఉన్నాడు అంటుంది.  కాస్త రిలీఫ్ గా ఉంటుందని వీధి చివరకు నడుచుకుంటూ పోయాడు వెళ్లి చూస్కో అని పంపిస్తుంది...( వెంటనే తాను రప్పించిన రౌడీలకు సమాచారం ఇస్తుంది). కార్తీక్ కోసం ఎప్పుడో ఒకరి ప్రాణాలు పోయేందుకు కారణం అయ్యాను..ఇప్పుడు మళ్లీ నువ్వు పోతావ్ అనుకుంటుంది.

రేపటి(గురువారం) ఎపిసోడ్
వారణాసి రోడ్డుపై పడిఉంటాడు...ఆ పక్కనే నిల్చుని దీప ఎక్కడ, పిల్లలెక్కడ అని కార్తీక్ అరుస్తుంటాడు. మరోవైపు కార్తీక్ ని వెతుక్కుంటూ దీప వస్తుంది...

Published at : 12 Oct 2022 07:29 AM (IST) Tags: Karthika Deepam Serial karthika Deepam Serial Today Episode Karthika Deepam Serial Written Update Karthika Deepam Episode 1481 Karthika Deepam Serial October 12th

సంబంధిత కథనాలు

Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?

Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?

The Power: అమ్మాయిల ఒంటి నుంచి నిజంగా కరెంటు పుడితే - ‘ది పవర్’ టీజర్ మైండ్ బ్లోయింగ్!

The Power: అమ్మాయిల ఒంటి నుంచి నిజంగా కరెంటు పుడితే - ‘ది పవర్’ టీజర్ మైండ్ బ్లోయింగ్!

PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి

PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి

Sasivadane Title Song : హరీష్ శంకర్ విడుదల చేసిన 'శశివదనే' పాట - కోమలితో రక్షిత్ ప్రేమంట!  

Sasivadane Title Song : హరీష్ శంకర్ విడుదల చేసిన 'శశివదనే' పాట - కోమలితో రక్షిత్ ప్రేమంట!  

HBD Brahmanandam: నవ్వుతూ, నవ్విస్తూ వుండాలి - బ్రహ్మానందానికి చిరంజీవి బర్త్‌డే సర్‌ప్రైజ్, ఇంటికెళ్లి మరి విసెష్!

HBD Brahmanandam: నవ్వుతూ, నవ్విస్తూ వుండాలి - బ్రహ్మానందానికి చిరంజీవి బర్త్‌డే సర్‌ప్రైజ్, ఇంటికెళ్లి మరి విసెష్!

టాప్ స్టోరీస్

Union Budget 2023 : విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.683 కోట్లు, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు ఇవే!

Union Budget 2023 : విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.683 కోట్లు, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు ఇవే!

ఇది జాతీయ బడ్జెట్టా ! కొన్ని రాష్ట్రాల బడ్జెట్టా, వాళ్లకు టైమ్ దగ్గర పడింది: ఎమ్మెల్సీ కవిత

ఇది జాతీయ బడ్జెట్టా ! కొన్ని రాష్ట్రాల బడ్జెట్టా, వాళ్లకు టైమ్ దగ్గర పడింది: ఎమ్మెల్సీ కవిత

Tarakratna Vijayasai : తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది - బాలకృష్ణకు ధ్యాంక్స్ చెప్పిన విజయసాయిరెడ్డి !

Tarakratna Vijayasai : తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది - బాలకృష్ణకు ధ్యాంక్స్ చెప్పిన విజయసాయిరెడ్డి !

AP Capital Vizag: ఏపీ క్యాపిటల్ అని గూగుల్ లో సెర్చ్ చేసినా విశాఖనే వస్తుంది: స్పీకర్ తమ్మినేని

AP Capital Vizag: ఏపీ క్యాపిటల్ అని గూగుల్ లో సెర్చ్ చేసినా విశాఖనే వస్తుంది: స్పీకర్ తమ్మినేని