News
News
X

Karthika Deepam October 11th Update:డాక్టర్ బాబుని చూసిన వారణాసి - నిజానికి దగ్గరగా కార్తీక్, దీప ప్రాణాలు తీసేందుకు సిద్ధమైన మోనిత

కార్తీకదీపం అక్టోబరు 11ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ నుంచి మోనితను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది వంటలక్క

FOLLOW US: 
 

Karthika Deepam October 11th Episode 1480 (కార్తీకదీపం అక్టోబరు 11 ఎపిసోడ్)

మీరంతా ఇక్కడి వాళ్లు కాదన్న రాజ్యలక్ష్మి మాటలు కార్తీక్ వినలేదని మోనిత కూల్ అయ్యేలోగా ఆ పక్కనే కార్తీక్ నిల్చుని ఉండడం చూసి టెన్షన్ పడుతుంది మోనిత. మరోవైపు శౌర్య అక్కడకు రావడం చూసి మోనితలో టెన్షన్ పెరుగుతుంది. కార్తీక్, దీపని ఇక్కడ లేకుండా చేయాలని ప్లాన్ చేసిన మోనిత.. కార్తీక్ ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయి..శివతో దీపను రమ్మని కబురుపెడుతుంది. కార్తీక్ పిలుస్తున్నాడని శివ చెప్పడంతో దీప వెళుతుంది...అక్కడ మోనిత ప్రత్యక్షమవుతుంది. పిలిచింది నేను కార్తీక్ కాదంటుంది మోనిత
మోనిత: ఈ రోజుతో నీ బతుకే తెల్లారిపోతుంది..పిచ్చిపిచ్చి వేషాలేస్తున్నావేంటి..నీకు రాజ్యలక్ష్మికి ఏంటి నీ సంబంధం
దీప: అప్పుడే మొదలెట్టేశావా..ఇంతకీ ఏమన్నారు..నీది ఈ ఊరు కాదు, అదంతా నీ నాటకం అని బండారం బయటపెట్టేశారా. ఈ బతుకమ్మ పూర్తై ఇంటికి వెళ్లేలోగా ఆయనకు తెలిసిపోతుంది
మోనిత: తెలిస్తే ఏంటి నమ్ముతాడా..ఇలాంటి రాజ్యలక్ష్మిలు వందమంది వచ్చినా ఏం చేయలేవు
దీప: నా డాక్టర్ బాబుని నాకుదూరం చేయడం కోసం ఓ ఊరుని, ఓ గతాన్ని సృష్టించావు..కానీ దేవుడున్నాడు.. నువ్వు ఏ ఊరిలో నాటకం ఆడావో..ఆ ఊరి పెద్ద నాకు తెలిసేలా చేశాడు దేవుడు అంటుంది దీప
మోనిత: కార్తీక్ ని దక్కించుకునేందుకు ఎంతకైనా తెగిస్తాను..నువ్వు ఇలాగే చేస్తే నీ ప్రాణాలు తీసైనా కార్తీక్ ని నా సొంతం చేసుకుంటాను..
దీప: నువ్వు ఎంత నీచానికైనా దిగజారతావు నాకు తెలుసు..కానీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా.. నన్ను డాక్టర్ బాబుని విడదీయలేవు
మోనిత:  పైకి పోయాక దయ్యమై చూడు
దీప: నువ్వు బతికున్న దయ్యానివి..ఈ రోజుతో నీ ఆటలు కట్టు.. 
మోనిత: కార్తీక్ ను వదలకపోతే పోతావ్
దీప: వదిలేది నువ్వే..పోయేది నువ్వే..నన్ను ఏమీ చేయలేవు
దీప అక్కడి నుంచి వెళ్లిపోతుంది...మోనిత కూడా వెళ్లేందుకు ట్రై చేస్తుండగా..ఆగు అని కార్తీక్ పిలుపు వినిపిస్తుంది...

Also Read: మోనిత కుట్ర తెలుసుకున్న కార్తీక్- చుక్కలు చూపించిన దుర్గ, దీపకి అండగా నిలిచిన రాజ్యలక్ష్మి

మోనిత:నువ్వెప్పుడు వచ్చావ్
కార్తీక్: దీపకు ఏమని వార్నింగ్ ఇచ్చావ్..మొత్తం విన్నాను..అంత ఈజీగా చెప్పేస్తున్నావ్..అంతకు ముందు ఎన్ని ప్రాణాలు తీశావ్.. దీప ప్రాణాలు తీశావ్
మోనిత: నాకు అడ్డొస్తే నిజంగానే ప్రాణాలు తీస్తాను..జిడ్డులా నిన్ను పట్టుకుని వేలాడుతుంటే ఏం చేయాలి.. నిజం చెబుతున్నా ఈసారి నిజంగానే నీ వెంట పడిందో ప్రాణాలు తీస్తాను
కార్తీక్: అసలు వదలాల్సింది నువ్వా..దీపా..మనది ఈ ఊరే కాదంటున్నారు..నువ్వు చెప్పిందంతా అబద్ధమేకదా.. అంటే నువ్వు నా భార్య అన్నది కూడా నిజమే కదా..
మోనిత: ఆవిడ చెబితే నిజమని ఎలా నమ్ముతున్నావ్..ఇన్నాళ్లూ మనం కలసి ఉన్నది నిజం కదా.. ఇలాంటివన్నీ చేస్తుంది కాబట్టే దీప ప్రాణాలు తీయాలనే కోపం వచ్చింది. నీకు వంటలక్కపై అభిమానం ఉంటే పోయి చెప్పు..మళ్లీ మా మధ్యలోకి రాకు అని...

News Reels

శౌర్య, చంద్రమ్మ, ఇంద్రుడు..ముగ్గురూ దీపకోసం వెతుకుతారు. ఆవిడే మా అమ్మ అనిపిస్తోందంటుంది శౌర్య. బస్సులో వాటర్ బాటిల్ ఇచ్చిందని చంద్రమ్మ, ఆ రోజు నువ్వు ఫోన్లో మాట్లాడిన ఆమె అని ఇంద్రుడు మాట్లాడుకుంటారు. ముగ్గురూ వెతికేందుకు వెళతారు.

Also Read: సూపర్ ట్విస్ట్, పూలదండలతో ఇంటికి వచ్చిన రిషిధార- ఖంగు తిన్న దేవయాని

ఊరిపెద్ద రాజ్యలక్ష్మి ఇంటిముందు అంతా బతుకమ్మ ఆడతారు. ఆ తర్వాత అంతా బతుకమ్మలు తీసుకుని చెరువు దగ్గరకు బయలుదేరుతారు. అటు కార్తీక్..ఇది మీ ఊరుకాదన్న రాజ్యలక్ష్మి మాటలు, నీ అడ్డు తొలగించి కార్తీక్ ని సొంతం చేసుకుంటానన్న మోనిత మాటలు గుర్తుచేసుకుంటాడు. పెద్దావిడ వంటలక్క మంచిది అంటోంది, దీప ఎందుకు భరిస్తోంది.. ఏది నిజం ఏది అబద్ధం...మొన్న వంటలక్క వేసిన నాటకం చూస్తుంటే నాకు ఏదో అయింది..ఆ నాటకానికి నాకు సంబంధం లేకపోతే నేను ఎందుకలా రియాక్టవుతాను..నిజం నా చుట్టూనే ఉంది నేనే తెలుసుకోలేకపోతున్నాను అనుకుంటాడు...

శివ-శౌర్య
మేడం సార్ పిలుస్తున్నారని చెప్పి దీపక్కను ఎందుకు పిలవమంది..సార్ ని తీసుకుని ఇక్కడకు ఎందుకు వచ్చింది.. ఆ దుర్గ మేడంతో క్లోజ్ గా ఉంటోంది..మేడం జీతం ఇస్తోందని చెప్పి ఫ్రాడ్ అయిన మోనిత మాట విని దీపక్కకు అన్యాయం చేయకూడదు అనుకుంటాడు..ఇంతలో హలో అని శౌర్య పిలుస్తుంది. ఆ రోజు నా దగ్గర వినాయక బొమ్మలన్నీ కొన్నావ్ కదా అని గుర్తుచేస్తుంది. అవి నేను కొనలేదు కానీ మా సార్ కొన్నారు..ఆరోజు నీ దగ్గరకు మా సార్ వద్దాం అనుకున్నారు కానీ అని అప్పుడు శౌర్యని చూసి మోనిత కంగారు పడిన విషయం గుర్తుచేసుకుంటాడు. ఇప్పుడు ఈ పాని సార్ దగ్గరకు తీసుకెళితే అసలు విషయం బయటపడుతుందని ఆలోచిస్తాడు... ఇదంతా చూసిన మోనిత శివకి కాల్ చేసి పాపను ఎక్కడికి తీసుకెళుతున్నావ్ అని అడుగుతుంది.దాన్ని అక్కడే వదిలి నీ దారిన నువ్వెళ్లిపో అని బెదిరిస్తుంది... కాల్ కట్ చేయగానే మా మేడం పిలుస్తున్నారు నువ్వెళ్లిపో అని చెప్పి శౌర్యని పంపించేస్తాడు... మేడం ఈ పాపని చూసి ఎందుకు కంగారుపడుతోంది ఏంటో తెలుసుకోవాలి అనుకుంటాడు..

ఎపిసోడ్ ముగిసింది

రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
మోనిత-దీప ఇద్దరూ నాకు పరిచయం లేనివారే..దీపను మాత్రమే నమ్ము అని చెబుతుంది రాజ్యలక్ష్మి. అవే ఆలోచనల్లో ఉన్న కార్తీక్ కి వారణాసి ఎదురుపడతాడు..డాక్టర్ బాబు మీరు బతికే ఉన్నారా అంటాడు. అరేయ్ ఆపరా ఎవరు మాటలు నమ్మే పరిస్థితిలో లేనంటాడు...అప్పుడు వారణాసి..ఈ ఫొటో చూసి చెప్పండంటూ దీప-కార్తీక్ కలసి ఉన్న ఫొటో చూపిస్తాడు.... కార్తీక్ షాక్ లో ఉంటాడు...

Published at : 11 Oct 2022 07:14 AM (IST) Tags: Karthika Deepam Serial karthika Deepam Serial Today Episode Karthika Deepam Serial Written Update Karthika Deepam Episode 1480 Karthika Deepam Serial October 11th

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Mahesh Babu: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - తిరిగి రంగంలోకి దిగిన మహేష్!

Mahesh Babu: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - తిరిగి రంగంలోకి దిగిన మహేష్!

స్టార్లను సైతం వెనక్కి నెట్టిన రామ్‌చరణ్ - ట్రూ లెజెండ్ అవార్డు దక్కించుకున్న మెగాపవర్!

స్టార్లను సైతం వెనక్కి నెట్టిన రామ్‌చరణ్ - ట్రూ లెజెండ్ అవార్డు దక్కించుకున్న మెగాపవర్!

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!

Prabhas Marathi Movie : ఇప్పుడు మారుతి సెట్స్‌కు ప్రభాస్ - క్రిస్మస్ ముందు వరకూ!

Prabhas Marathi Movie : ఇప్పుడు మారుతి సెట్స్‌కు ప్రభాస్ - క్రిస్మస్ ముందు వరకూ!

టాప్ స్టోరీస్

President Droupadi Murmu : నేడు ఏపీకి ద్రౌపదీ ముర్ము, నేవీ డే కార్యక్రమాల్లో పాల్గోనున్న రాష్ట్రపతి

President Droupadi Murmu : నేడు ఏపీకి ద్రౌపదీ ముర్ము, నేవీ డే కార్యక్రమాల్లో పాల్గోనున్న రాష్ట్రపతి

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Weather Latest Update: ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Weather Latest Update:  ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Horoscope Today 4th December 2022: ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Horoscope Today 4th  December 2022:  ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు