Guppedantha Manasu October 10th Update: సూపర్ ట్విస్ట్, పూలదండలతో ఇంటికి వచ్చిన రిషిధార- ఖంగు తిన్న దేవయాని
గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
జగతి కోపంగా జీవితాలు నాశనం అయిపోతున్నాయ్ మీకెవ్వరికి అర్థం కావడం లేదని అరుస్తుంది. ఏమైందని మహేంద్ర అడుగుతాడు. తప్పుల మీద తప్పులు చేస్తున్నారు, దేవయాని అక్కయ్యకి అవకాశం ఇస్తున్నారు, తప్పు చేస్తూనే ఉన్నారని అంటుంది. నమ్మిన దాని కోసం పోరాటం చేయడం తప్పు లేదు కదా అని వసు అంటుంది.
జగతి: వసు ఆపు.. మహేంద్ర రిషి గురించి తన మనసు గురించి నాకు తెలుసు. 20 ఏళ్ళకి పైగా నేను ఇంటికి ఎందుకు దూరంగా ఉన్నాను. ఆ ఇంట్లోకి రాలేకనా. రిషి మనసు గాయపడుతుందని ఆగాను కదా.. ఇప్పుడు మీరు అదే పని చేస్తున్నారు. చూడు వసు మనం ఒడిపోయినా ఎదుటివారిని గెలిపించాలి. అది గెలుపంటే.. నేను 20 ఏళ్లు ఒడిపోయినా రిషిని గెలిపించాను అది అర్థం కావడం లేదు. నన్ను అమ్మా అని పిలవడం ఇష్టం లేక ప్రేమని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. వసు నేను చెప్పేది విను అని గట్టిగా అరుస్తుంది.
మహేంద్ర నేను కన్నతల్లిగా ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు తన ప్రేమ కూడా నేనే అడ్డంకిగా మారాను. నేనేం తల్లిని మహేంద్ర అని ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఏమైంది జగతి అని మహేంద్ర చాలా కంగారుపడతాడు. రిషికి ధరణి ఫోన్ చేస్తుంది. జగతి అత్తయ్య మాట్లాడుతూ మాట్లాడుతూ సడెన్ గా పడిపోయారని చెప్తుంది. ఇప్పుడు ఎలా ఉన్నారు అని రిషి అడుగుతాడు. మహేంద్ర జగతిని ఇంట్లో డాక్టర్ వైద్యం చేస్తూ ఉంటుంది. తన మనసుకి ప్రశాంతత కావాలి అదే తనకి మందు అని డాక్టర్ చెప్తుంది. రిషి, వసు గురించే తన బాధ అంతా అని మహేంద్ర అనుకుంటాడు.
Also Read: మోనిత కుట్ర తెలుసుకున్న కార్తీక్- చుక్కలు చూపించిన దుర్గ, దీపకి అండగా నిలిచిన రాజ్యలక్ష్మి
రిషి వసు రెస్టారెంట్ దగ్గరకి వస్తాడు. జగతి గురించి వసుకి చెప్పడంతో తను చాలా టెన్షన్ పడుతుంది. పడిపోయారని తెలియదు కానీ అందుకు కారణం తెలుసు. జగతి మేడమ్ మీరు ఇద్దరూ ఒకే విషయం గురించి మాట్లాడుతున్నారని వసు అంటుంది. మేడమ్ ఎలా ఉన్నారో అని ఏడుస్తుంది. నేను నిన్ను తీసుకెళ్లాడానికే వచ్చాను అని రిషి చెప్పి తనని తీసుకుని ఇంటికి వెళ్తాడు. రిషి, వసు ఇద్దరూ దండలు వేసుకుని కుడి కాలు ఇంట్లోకి పెట్టి వస్తారు. వాళ్ళని చూసి దేవయాని షాక్ అవుతుంది. తర్వాత రిషి పెద్దమ్మా అని పలకరించేసరికి తెరుకుంటుంది. అదంతా దేవయాని ఊహ. ఇదేంటి నాకు అలా అనిపించింది, ఇది శుభమా అశుభమా అని ఆలోచిస్తుంది.
జగతి మేడమ్ ఎలా ఉన్నారు, తనకి ఏమైంది, తనని కాస్త జాగ్రత్తగా చూసుకోండి పెద్దమ్మా అని దేవయానికి చెప్తాడు. వసు వచ్చింది ఏంటి అని అనుకుంటుంది. నేనే తీసుకొచ్చాను మీకు మేడమ్ కి సహాయంగా ఉంటుందని తెచ్చినట్లు చెప్తాడు. నీ పెళ్లి గురించి ఎప్పటి నుంచో మాట్లాడాలని అనుకుంటున్నా అని దేవయాని చెప్తుంది.
Also read: కీలక మలుపు, రాధే రుక్మిణి అని తెలుసుకున్న దేవి- ఆదిత్యే తన తండ్రి అని తెలిసిపోనుందా?
రిషి: ఇందులో మాట్లాడటానికి ఏముంది? మా ఇద్దరి బంధం గురించి వసు వాళ్ళ ఇంట్లో చెప్తే సరిపోతుంది కదా. ఇక్కడ ఎవరి అనుమతి కూడా అవసరం లేదు నేనే అన్నీ చూసుకుంటాను మీకేమి శ్రమ ఇవ్వను అంటాడు.
ఏమైంది మేడమ్ అని వసు కంగారుగా అడుగుతుంది. మీరిద్దరు బాగున్నారా రిషికి నీ మీద కోపం తగ్గిందా అని అడగటం అటుగా వెళ్తు రిషి వింటాడు. తనకి మీ గురించి తప్ప వేరే ఆలోచన లేదని మహేంద్ర అంటాడు. మీరు ఎప్పుడు హుషారుగా ఉండాలి, నా మీద అరవాలి అని వసు అంటుంది. నేను ఎప్పుడు ఎలా ఉన్నా జగతి లోపల ఉన్న తల్లి ఒడిపోతూనే ఉందని బాధపడుతుంది.