Karthika Deepam October 10th Update: మోనిత కుట్ర తెలుసుకున్న కార్తీక్- చుక్కలు చూపించిన దుర్గ, దీపకి అండగా నిలిచిన రాజ్యలక్ష్మి
టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ నుంచి మోనితను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది వంటలక్క
అటు మోనిత, ఇటు దీప బతుకమ్మ పేర్చి గుడికి తీసుకోస్తూ ఉంటారు. శౌర్య ఆటోలో వెళ్తు దీపని చూసిన సన్నివేశం గుత్తు చేసుకుంటుంది. అదే విషయాన్ని తన బాబాయ్ ని అడుగుతుంది. నువ్వు ఇందాక రెస్టారెంట్ లో ఎవరితో మాట్లాడావు అంటే ఆ రోజు నీతో ఫోన్లో మాట్లాడింది కదా ఆవిడే అని చెప్తాడు. ఆవిడ మా అమ్మ ఏమో అనిపిస్తుందని శౌర్య చెప్తుంది. నీ గొంతు గుర్తుపడుతుంది కదా అని ఆయన అంటే ఆ రోజు నాకు జలుబు చేసింది.. కానీ ఈరోజు ఆవిడ వెనక నుంచి చూస్తే మా అమ్మలాగా అనిపించందని చెప్తుంది.
దుర్గ బతుకమ్మ సంబరాలు జరిగే ఊరికి వస్తాడు. దీపమ్మ చెప్పిన ఊరు ఇదే నా మోనిత బంగారం ఎక్కడ అని వెతుకుతూ ఉంటే డాక్టర్ అన్నయ్య వస్తాడు. దుర్గ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. కార్తీక్ సార్ ని తీసుకుని మోనిత ఇక్కడికే వచ్చిందంట కదా దాన్ని ఆడుకుంటాను. నా దెబ్బ తట్టుకోలేక కార్తీక్ సర్ ని ఇక్కడే వదిలిపెట్టి పారిపోవాలని అంటాడు. మోనిత, కార్తీక నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వస్తారు.
Also read: కీలక మలుపు, రాధే రుక్మిణి అని తెలుసుకున్న దేవి- ఆదిత్యే తన తండ్రి అని తెలిసిపోనుందా?
మోనిత: ఇది నీ ఊరే కార్తీక్, అందరూ పలకరిస్తున్నారు.. నీకు నేను ఉన్నాను
దుర్గ: హలో మోనిత.. హలో కార్తీక్ సర్.. ఇది చాలా అన్యాయం మోనిత, కలసి వద్దామని చెప్పి నాకౌ హ్యాండ్ ఇచ్చి మీరిద్దరు వచ్చేస్తారా?
మోనిత: దేవుడా వీడు ఇక్కడికి వచ్చి తగలడ్డాడు
దుర్గ: ఏంటి కార్తీక్ ఆర్ మీరైనా ఒక మాట చెప్పాలి కదా నువ్వు సర్ కి చెప్పలేదా? ఇంతదూరం బైక్ మీద వచ్చేసరికి ఒళ్ళు అంతా నొప్పిగా ఉంది
మోనిత: ఆపుతావా నేను ఎప్పుడు కలిసి వెళ్దామని చెప్పాను
దుర్గ: మన ఊర్లో బతుకమ్మ పండగ అక్కడ మన పాత జ్ఞాపకాలు చాలా ఉన్నాయి గుర్తు చేసుకుందాం అన్నావ్ కదా
కార్తీక్: ఓహో అలా అన్నదా సరే మీరిద్దరు కలిసి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోండి
మోనిత: కార్తీక్ ఆగు.. నీకు ఈ ఊరికి ఏంట్రా సంబంధం.. నీ ఊరు ఇదే అయితే నాది కూడా ఇదే అవుతుంది కదా
అప్పుడే ఊర్లో ఒక వ్యక్తి దుర్గని పలకరిస్తాడు. అది చూసి కార్తీక్ ఆలోచనలో పడతాడు. ఇది నీ ఊరేనా అని అడిగావ్ కదా పుట్టి పెరిగిన ఊరు కార్తీక్ సర్ ఏదో అనుకుంటారని కాదని అనుకుంటారా చెప్పు అని దుర్గ అంటాడు. మరో వ్యక్తి వచ్చి మోనిత ఒక్కతే వచ్చింది నువ్వు రాలేదేంటి అనుకున్నా వచ్చేశావా మీ ఇద్దరినీ చూస్తే ఏదోలా ఉందని మంట పెట్టేస్తాడు. ఆ మాటలు విని కార్తీక్ వెళ్ళిపోతాడు.
Also Read: శర్మకి కొడుకుగా మారిన యష్- సంతోషంలో వేద ఫ్యామిలీ, ఖైలాష్ పని అవుట్
మోనిత: చంపేస్తాను రా నిన్ను ఇది మీ ఊరా? అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా
దుర్గ: నువ్వు నేర్పినవే.. ఇలాగే ఊరందరి ముందు దీపమ్మని అవమానించావ్ కదా ఎంత బాధపడి ఉంటుంది. ఇవన్నీ నువ్వు భరించలేవు కానీ దీపమ్మ కార్తీక్ సర్ భార్య అని చెప్పేసేయ్
మోనిత: ఏంట్రా చెప్పేది కార్తీక్ భార్యని నేనే ఇదే మాట దీపకి చెప్పి ఇక్కడ నుంచి వెళ్లిపో
మళ్ళీ నువ్వు దీపమ్మ దగ్గరకి రాకుండా గట్టిగా ఇస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు. కార్తీక్ దగ్గరకి శివ వస్తే తనని ఆదిత్య అని పిలుస్తాడు. ఆ పేరు చెప్పగానే అస్పష్టంగా ఏదో కనిపిస్తుంది. అప్పుడే అటుగా శౌర్య వస్తుంది. శౌర్య కార్తీక్ పక్క నుంచే వెళ్తుంది కానీ గమనించదు.
దీప బతుకమ్మ తెచ్చి రాజ్యలక్ష్మి దగ్గరకి వచ్చి పెడుతుంది. తనని చూసిన ఒక మహిళ దీప గురించి తప్పుగా చెప్తుంది. ఆ అమ్మాయి అలాంటిది కాదే అని రాజ్యలక్ష్మి చెప్తుంది. మా అబ్బాయితో కలిసి ఈరోజే వచ్చిందని చెప్తుంది. మోనిత దీప గురించి ఏదో చెప్తుంటే నువ్వేమి చెప్పొద్దు అని అంటుంది. నిన్ను, తనని ఎప్పుడు ఈ ఊర్లో చూడలేదు, నలుగురు మనుషులని పెట్టీ లేనిది ఉన్నట్టు చెప్తే అది నిజం అయిపోదని రాజ్యలక్ష్మి అంటుంది. అది విని కార్తీక్ షాక్ అవుతాడు. అంటే ఇది వంటలక్క ఊరు కాదా తనని ఆవమానించడానికి ఆడిన నాటకమా అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. ఇద్దరి గురించి నాకు తెలియకపోయినా ఆ అమ్మాయి మంచిదని ఎలా చెప్తున్నానో తెలుసా కథ నువ్వు సృష్టించావ్ కాబట్టి అని రాజ్యలక్ష్మి చెప్తుంది.