Ennenno Jnamala Bandham October 10th Update: శర్మకి కొడుకుగా మారిన యష్- సంతోషంలో వేద ఫ్యామిలీ, ఖైలాష్ పని అవుట్
సులోచనకి యాక్సిడెంట్ చేస్తాడు ఖైలాష్. దీంతో ఆమె చావుబతుకుల మధ్య ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
సులోచనని స్పృహలోకి తీసుకొచ్చేందుకు మాలిని ఏడుస్తూనే భరతనాట్యం చేస్తూ ఉంటుంది. అప్పుడే సులోచనలో కదలిక వస్తుంది. అది చూసి వేద, మాలిని చాలా సంతోషిస్తారు. ఈవిడకి స్పృహ వచ్చిందని డాక్టర్ వచ్చి చూసి చెప్తుంది. ఏం మాట్లాడటం లేదేంటి అని వేద టెన్షన్ గా అడుగుతుంది. అలాగే జరుగుతుంది ఒకసారి స్పృహలోకి వచ్చింది కదా చాలు మేము ఇచ్చే ట్రీట్మెంట్ కి ఆమె స్పందిస్తారు. ఇక గండం గడిచినట్టే అని డాక్టర్ చెబుతుంది. ఇది మిరాకిల్ అని మాలినితో మీరు ఆమె ప్రాణ స్నేహితురాలా అని అడుగుతుంది. కాదు బద్ధ శత్రువులం సులోచనకి నాకు ఒక్క క్షణం కూడా పడదు, తనంటే నాకు అసహ్యం అని మాలిని నవ్వుతూ చెప్తుంది.
హాస్పిటల్ బిల్ కట్టడానికి శర్మ దగ్గర డబ్బు లేకపోవడంతో యష్ అది చూసి నేను కడతాను మిరెమి టెన్షన్ పడకండి అని చెప్తాడు. వేదని పెళ్లి చేసుకునేటప్పుడే తన కుటుంబాన్ని నా కుటుంబంగా చూసుకుంటాను అని ప్రమాణం చేశాను. లోపల ఉన్నది వేదకి మాత్రమే అమ్మ కాదు నాకు కూడా. అలాంటిది బిడ్డకి అమ్మ కంటే ఎక్కువ ఏది ఉండడు అని చెప్పేసరికి శర్మ ఎమోషనల్ అవుతాడు. అదంతా వేద చూస్తూ చాలా సంతోషిస్తుంది. వేద ఇంటికి వచ్చేసరికి ఖుషి ఆత్రంగా అడుగుతుంది. అమ్మమ్మకి తగ్గిపోయిందా అని అడుగుతుంది. అంతా బాగుంది ఇప్పుడేమి ఇబ్బంది లేదని వేద చెప్తుంది. తల్లిని తలుచుకుని వేద చాలా ఎమోషనల్ అయిపోతుంది. తననే తలుచుకుంటు బాధపడుతుంటే ఖుషి వస్తుంది.
Also Read: మరోసారి దీపను బుక్ చేసిన మోనిత, రాజ్యలక్ష్మి దగ్గరకు చేరిన కార్తీక్ పంచాయతీ!
అమ్మవారి రక్ష ఇచ్చి ఇది అమ్మమ్మకి కట్టు తనకి త్వరగా తగ్గిపోతుంది, త్వరగా ఇంటికి వచ్చేస్తుందని ఖుషి చెప్తుంది. ఖైలాష్ కాంచనకి ఫోన్ చేసి పరిస్థితి ఎలా ఉందని ఆరా తీస్తాడు. సీరియస్ గా ఉందని 24 గంటలు గడిస్తే గాని ఏమి చెప్పలేమని డాక్టర్ చెప్పారని చెప్తుంది. తెలుసుకో ఆమెకి సంబంధించి అన్నీ విషయాలు కనుక్కుని నాకు చెప్తూ ఉండమని చెప్తాడు. సులోచన యాక్సిడెంట్ విషయంలో ఆయన ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు ఏంటి కాంచన అనుకుంటూ ఉంటే పక్కనే వేద ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావ్ అని వేద అనుమానంగా అడుగుతుంది. కానీ కాంచన విషయం దాటేస్తూ అబద్ధం చెప్తుంది. ఏదో జరుగుతుందని కాంచన టెన్షన్ పడుతుంది.
వేద సులోచన దగ్గరకి వస్తుంది. నయం అవగానే లేచి అన్నీ పనులు మీద వేసుకోకు ముందే చెప్తున్నా అన్నీ పనులు నేనే చూసుకుంటాను. నేను అలిసిపోయినప్పుడు ఎక్కడైనా నొచ్చుకున్నప్పుడు మాత్రం వచ్చి నీ ఒడిలో తలపెట్టుకుని పడుకుంటాను. నువ్వు నన్ను ఓదార్చు చాలమ్మ. నీకోసం నేను ఎంత తాపాత్రయపడుతున్నానో అంతకంటే ఎక్కువ ఖుషి ఆరాటపడుతుందని చెప్పి తను ఇచ్చిన రక్ష సులోచన చేతికి కడుతుంది. వేద యష్ దగ్గరకి భోజనం తీసుకుని వచ్చి తినమని ఇస్తుంది. వేద థాంక్యూ చెప్తుంది.
Also Read: టామ్ అండ్ జెర్రీ రిషిధార మళ్లీ గొడవ మొదలెట్టారు, ఆలోచనలో పడిన మహేంద్ర-జగతి
తరువాయి భాగంలో..
యష్ కోపంగా అభిమన్యు ఇంటికి వచ్చి ఎక్కడ రా నీ కారు ఆ ఖైలాష్ గాడు ఎక్కడ అని అడుగుతాడు. కారు ఏంటి ఖైలాష్ ఏంటని అభి అడుగుతాడు. డ్రామాలు ఆడకు నాకు మొత్తం తెలిసిపోయిందని యష్ అంటాడు. మా అమ్మకి యాక్సిడెంట్ చేసింది మీరే అని వేద అంటుంది.