Karthika Deepam October 13th Update: హమ్మయ్య డాక్టర్ బాబు-వంటలక్క మళ్లీ కలసిపోయారు, ఇప్పుడు మోనిత పరిస్థితేంటి!
కార్తీకదీపం అక్టోబరు 13ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ నుంచి మోనితను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది వంటలక్క
![Karthika Deepam October 13th Update: హమ్మయ్య డాక్టర్ బాబు-వంటలక్క మళ్లీ కలసిపోయారు, ఇప్పుడు మోనిత పరిస్థితేంటి! Karthika Deeppam October 13th Episode 1482 Written Update Today Episode Karthika Deepam October 13th Update: హమ్మయ్య డాక్టర్ బాబు-వంటలక్క మళ్లీ కలసిపోయారు, ఇప్పుడు మోనిత పరిస్థితేంటి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/13/8edf1cc409250b1d5dd4a441c77dc3431665634374696217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Karthika Deepam October 13th Episode 1482 (కార్తీకదీపం అక్టోబరు 13 ఎపిసోడ్)
శౌర్య, చంద్రమ్మ, ఇంద్రుడు వీళ్లంతా దీప గురించి మాట్లాడుకుంటారు. మోనిత మాటలను బట్టి మా అమ్మా నాన్న బతికే ఉన్నారన్నది నాకు క్లారిటీ వచ్చిందన్న శౌర్య మోనిత ఆంటీని కలసి వస్తానని వెళుతుంది. మరోవైపు డాక్టర్ బాబుని చూసిన వారణాసి గతం గుర్తుచేసేందుకు ప్రయత్నిస్తాడు కానీ ఏమీ గుర్తురావడం లేదంటాడు.
వారణాసి: మీకు గతం గుర్తుకురావకపోవడం ఏంటి..అందుకేనా ఎవ్వర్నీ కలవలేదు..మీకోసం అమ్మగారు అయ్యగారు ఎంత ఏడ్చారో తెలుసా..శౌర్య పిచ్చిదానిలా వెతుకుతోంది..ఇంతకీ దీపక్క ఏమైంది డాక్టర్ బాబు
కార్తీక: దీప అంటే వంటలక్కే కదా..అయితే బతికే ఉంది. నేనే తన భర్తని అని మొరపెట్టుకుంది, నేను కాదన్నా అసహ్యించుకున్నా, అవమానించినా నా చుట్టూనే తిరిగింది..నిజంగా దీప నా భార్య అయితే..నేను చాలా తప్పు చేసినట్టే.
వారణాసి: దీపమ్మని అవమానించారా చాలా పెద్ద తప్పే చేశారు.. పదేళ్లు అవమానాలు భరించి మీకు దగ్గరైంది..ఇప్పుడు కూడా అవమానాలే అంటే దీపక్క ఎంత కుమిలిపోయి ఉంటుందో..
కార్తీక్: నీ పేరంటన్నావ్..ఏమో వారణాసి నువ్వు చెప్పేది వింటుంటే నిజమే అనిపిస్తోంది..ఆ ఫొటోలు చూస్తుంటే దీపే నా భార్య అని అర్థమవుతోంది. కానీ నాకేం గుర్తురావడం లేదు..ఏదీ నిజం అని అంగీకరించలేకపోతున్నాను..
వారణాసి: మీకు ఇంకా ఆధారాలు చూపిస్తాను..దీపక్కే మీ భార్య...
కార్తీక్: ఏం మాట్లాడాలో తెలియడం లేదు..నన్ను ఒక్కడినే వదిలేయ్ నువ్వెళ్లు
వారణాసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు..
Also Read: డాక్టర్ బాబుకి గతం గుర్తొచ్చేసిందోచ్, మోనిత కుట్ర నుంచి దీపను కాపాడగలడా!
అటు దీప మోనిత మాటలు నమ్మి వీధి చివర కార్తీక్ ఉన్నాడేమో అని వెతుక్కుంటూ వస్తుంది. మోనిత పెట్టిన రౌడీలు దీపను చంపేందుకు వెనుకే నడుచుకుంటూ వెళుతుంటారు...వాళ్లని చూసి వారణాసి దీపక్కా అని అరుస్తాడు.. దీప వాళ్లని చూడకుండా వెళ్లిపోతుంది...వారణాసిని వాళ్లు చితక్కొడుతుంటే కార్తీక్ ఫైట్ చేసి వాళ్లని వెళ్లగొడతారు..కిందపడిపోయిన వారణాసిని లేపేందుకు ప్రయత్నిస్తాడు.
మోనిత దగ్గరకు వెళ్లిన శౌర్య..రాయితో కొట్టాలని రాయి విసురుతుంది..అదే సమయంలో కార్తీక్ తలకు రాయి తగులి మొత్తం జరిగినదంతా గుర్తొస్తుంది. దీపా అని అరుస్తూ స్పృహ తప్పి పడిపోయిన వారణాసిని లేపడానికి ప్రయత్నిస్తాడు. అదే సమయంలో శౌర్యని చూసిన మోనిత వెంటపెడుతుంది. ఇంద్రుడు, చంద్రమ్మ దగ్గరకు వెళ్లిన శౌర్య జరిగినదంతా చెబుతుంది. చూసి రమ్మంటే కాల్చి వచ్చావా పద వెళ్లిపోదాం అని ఆటో ఎక్కి వెళ్ళిపోతారు.
మోనిత-కావేరి
మోనిత కంగారుపడుతుంటుంది. మంచి అవకాశం పోయింది. పదేళ్లుగా ఏ అవకాశాలు లేక ఎదురు చూస్తూనే ఉన్నాను కార్తీక్ కోసం. బంగారు లాంటి అవకాశం దొరికింది అనుకుంటే ఇప్పుడే ఆ వంటలక్క వచ్చి మధ్యలో పెంట పెట్టింది అంటుంది. అప్పుడు కావేరి.. మీరు ఇక్కడున్నట్టు తనకి ఎలా తెలుసు అంటుంది. ఏమో ఎక్కడికి వెళితే అక్కడకే వస్తోంది.. దానికితోడు ఇప్పుడు దుర్గ, శౌర్య ఇద్దరు తయారయ్యారంటుంది. మరోవైపు కార్తీక్ కోసం వెతికిన దీప తిరిగి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వస్తుంది.
దీప: అన్నయ్యా డాక్టర్ బాబు కనిపించడం లేదు మోనిత చాలా ధీమాగా ఉంనది ఆ సందు చివర ఉన్నారని చెప్పింది తీరా అక్కడికి వెళ్తే డాక్టర్ బాబు కనిపించలేదు. తిరిగి వచ్చి చూసేసరికి మోనిత కూడా లేదు నన్ను పక్కదారి మళ్ళించి వాళ్ళు వెళ్లిపోయినట్టున్నారు. మళ్ళీ తిరిగి రారేమో అని బాధపడుతూ ఉంటుంది.
అన్నయ్య: ఇప్పుడే ఏదో ఊహించుకోని బాధపడొద్దు ఎక్కడికి వెళ్ళి ఉండరు
Also Read: రాణికి బుగ్గచుక్క దిద్దిన రిషి, మురిసిన వసు, జగతి ఆనందం కోసం మరో అడుగు
అటు కార్తీక్..వారణాసిని హాస్పిటల్ కి తీసుకెళతాడు. వారణాసిని డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇంతలో కార్తీక్ కి తల పైన కట్టు కట్టి మీకు ఏ ప్రాబ్లం లేదండి బానే ఉన్నది అని అంటాడు. పక్కనున్న నర్స్ కార్తీక్ ఇన్ఫర్మేషన్ రాసుకుంటూ ఉండగా తను కూడా డాక్టరు అని వాళ్లకు తెలుస్తుంది. మీరు డాక్టర్ కార్తీకా అని అడగడంతో అవును హైదరాబాద్ లో కార్డియాలజిస్ట్ అని అంటాడు కార్తీక్. వారణాసి ఎలా ఉన్నాడని అడగడంతో..తలగి గట్టి దెబ్బతగిలింది..కోమాలోకి వెళ్లేఅవకాశం ఉందని చెబుతారు.
ఎపిసోడ్ ముగిసింది..
రేపటి( శుక్రవారం) ఎపిసోడ్ లో
డాక్టర్ బాబు ఏమయ్యారో తెలియక పిచ్చెక్కుతోందని దీప ఏడుస్తుంది.. మోనితకి కూడా ఏమీ తెలియదు దొరుకుతారులే అంటాడు దుర్గ...ఆయన్ని చూసేవరకూ నాకు మనశ్సాంతి ఉండదు వెళదాం పద అంటుంది దీప.. బయటకు రాగానే కార్తీక్ ఎదురుపడతాడు...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)