News
News
X

Guppedanta Manasu October 17th: మేడమ్ తన ప్రాధాన్యత అనేసిన వసు, ఇంప్రెస్ అయిపోయిన ఇగో మాస్టర్- జగతి తరపున క్షమాపణ అడిగిన రిషి

గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 

జగతి, మహేంద్ర వసు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి జగతి ఇది అలా కొట్టడం కరెక్ట్ కాదు, వసుధార ఎంత బాధపడి ఉంటుందో అని మహేంద్ర అంటాడు. నువ్వు వసు గురించి ఆలోచిస్తున్నావ్ కానీ రిషి ఎంత బాధపడి ఉంటాడో అని జగతి అంటుంది. ప్రతి సారి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటావ్ తనని అంత ప్రేమిస్తావ్ కదా అందరి ముందు అలా ఎలా వసుధారని కొట్టగలిగావ్ అని అడుగుతాడు. మనం ప్రేమించిన వాళ్ళు తప్పు చేస్తేనే ఎక్కువ కోపం వస్తుంది, కంట్రోల్ చేసుకోలేకపోయాను, వసుకి గురువుగా కాకుండా రిషి తల్లిగా ఆలోచించాను. రిషి బాధపడతాడు అనే ఆలోచన వసుకి లేకుండాపోయింది అది కరెక్ట్ కాదు కదా అని జగతి అంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా వసుని కొట్టడం కరెక్ట్ కాదని అంటాడు. ఇదంతా తన వల్లే అవుతుందని మహేంద్ర బాధపడతాడు.

రిషి, వసు ఒక చోట కూర్చుని జరిగింది తలుచుకుని బాధపడతారు. మన ఇద్దరి మధ్య ఒక చీర, ఒక గురుదక్షిణ అడ్డుకట్ట వేస్తుందా అని వసు అడుగుతుంది. ఒక చీర మన బంధాన్ని శాసిస్తుందా అని అడుగుతుంది.

రిషి: జరిగినదానికి నువ్వు బాధపడటం లేదా

వసు: ఏం జరిగింది సార్.. మేడమ్ కొట్టడమా, మీరు ఇచ్చిన చీర కట్టుకోకపోవడమా

News Reels

రిషి: రెండు అనుకో.. అసలు ఏంటి నీ సమస్య

వసు: అప్పుడు ఉన్న పరిస్థితి గురించి మాట్లాడుకున్నాం. నేను చేసింది తప్పని అనుకున్నారు ఏమో కొట్టారు. ఈ విషయంలో నేనేమీ బాధపడటం లేదు

రిషి: అది మా నాన్నమ్మ చీర అని చెప్పి ఇచ్చాను. అది కట్టుకుంటే ఇంటి కోడలి హోదా వస్తుందని వచ్చినట్టే అని పెద్దమ్మ కూడా చెప్పారు కదా

వసు: చీర కట్టుకుంటే బంధం ఉన్నట్టు కట్టుకోకపోతే బంధం లేనట్టా

రిషి: నేను చెప్పినప్పుడు అయినా నువ్వు చీర కట్టుకోవాలి కదా

వసు: ఆకాశమంత ప్రేమ ముందు ఆరు గజాల చీర ఎంత చెప్పండి. అంత ప్రేమ మీరు నాకు ఇస్తున్నప్పుడు ఆ చీర కట్టుకుంటేనే ప్రేమ ఉన్నట్టు అనుకుంటే ఎలా. ఎవరు ఏమనుకున్నా మన మధ్య బంధం మారదు కదా

రిషి: అభిప్రాయాలు వేరు అయినప్పుడు బంధం ఒక్కటి ఎలా అవుతుంది, ఆ బంధం ధృడంగా ఎలా ఉంటుంది

Also Read: ఊహించని మలుపు, కొడుకు కోసం వేదకి అన్యాయం చేయబోతున్న యష్- సులోచన, మాలిని వార్ స్టార్ట్

వసు: ప్రేమ.. ప్రేమ అన్నింటినీ కలుపుతుంది, ఓర్చుకుంటుంది. మన మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయేమో కానీ అనంతమైన ప్రేమ ఉంది. మన మధ్య ప్రేమని ఒక చీర కొలవలేదు. ఆ చీర మీకు ఒక ఎమోషన్, ఒక గొప్ప భావన అంతే.. ఆ చీర నాకు ఇవ్వాలనే ఆలోచన మీకు వచ్చిందని నేను అనుకొను.

రిషికి దేవయాని చీర ఇచ్చిన విషయం గుర్తు చేసుకుంటాడు. అవును ఆ చీర పెద్దమ్మ నీకు ఇవ్వమన్నారని చెప్తాడు. తను ఏ తప్పు చేయలేదని వసు సమర్దించుకుంటుంది. నాకు బాధగా ఉందని రిషి అంటాడు. మేడమ్ తరపున నేను నీకు సోరి చెప్తున్నా అని అంటాడు. మీరు ఎందుకు సోరి చెప్తున్నారు, జగతి మేడమ్ నన్ను కొట్టారు, మీరు తన తరపున సోరి చెప్తున్నారు అంటే మీ మనసులో ఏమనుకుంటున్నారు అని వసు మాట్లాడబోతుంటే రిషి కోపంగా వసుధార అని అరుస్తాడు. అక్కడ నుంచి వెళ్లిపోదామని అంటాడు.

Also Read: దుర్గ కాళ్ళ మీద పడి బతిమలాడుకున్న మోనిత, చుక్కలు చూపించిన దీప- శౌర్య కోసం వెతుకుతున్న కార్తీక్

దేవయాని చేసిన పనికి ఫుల్ ఖుషి అవుతుంది. జగతి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకుని తనకి చెప్పమని ధరణికి చెప్తుంది. వసుని రిషి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. బై చెప్పకుండా వెళ్లిపోతుంటే వసుని పిలుస్తాడు. కారు తాళాలు తీసుకుని వసు లోపలికి రమ్మని చెప్తుంది. రిషి దేవయానికి ఫోన్ చేసి ఇంటికి రావట్లేదని చెప్తాడు. వసు చేతులని తన చేతుల్లోకి తీసుకుంటాడు రిషి. ఎక్కువ ప్రేమ కలిగినా అంతే భయం వేస్తుందని చెప్తాడు. నీ లైఫ్ లో నీకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది కదా మరి నీ లైఫ్ లో నీకు ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు నేనా.. మీ మేడమ్ నా ? ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత అని అడుగుతాడు. మేడమ్ సర్ అని చెప్తుంది. షాకైన రిషి మరి నేను ఏంటని అడుగుతాడు. మీరు నా జీవితం అని వసు చెప్తుంది. మీరు నేను వేరు వేరు కాదు ఇప్పుడు, నా లైఫ్ మీరు అయినప్పుడు ప్రాధాన్యత అనే ప్రశ్న ఉండదు కదా అని అంటుంది.

Published at : 17 Oct 2022 08:45 AM (IST) Tags: Guppedanta Manasu Serial Guppedanta Manasu Serial Today Episode Guppedanta Manasu Serial Written Update Guppedanta Manasu Serial October 17th Episode

సంబంధిత కథనాలు

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

Yashoda Court Case : 'యశోద' సినిమాపై కేసు కొట్టేసిన కోర్టు - ఇది హ్యాపీ ఎండింగ్!

Yashoda Court Case : 'యశోద' సినిమాపై కేసు కొట్టేసిన కోర్టు - ఇది హ్యాపీ ఎండింగ్!

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

18 pages movie song: మీరు పాడకపోతే ఇక్కడే ధర్నా చేస్తా - శింబుతో బలవంతంగా పాట పాడించిన నిఖిల్, ఈ వీడియో చూశారా?

18 pages movie song: మీరు పాడకపోతే ఇక్కడే ధర్నా చేస్తా - శింబుతో బలవంతంగా పాట పాడించిన నిఖిల్, ఈ వీడియో చూశారా?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలు- ఫైనల్ కి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరు?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలు- ఫైనల్ కి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరు?

టాప్ స్టోరీస్

Medaram Mini Jatara : వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం మినీ జాతర

Medaram Mini Jatara : వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం మినీ జాతర

AP New CS Jawahar Reddy: ఏపీ సీఎస్‌గా జవహర్ రెడ్డి నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

AP New CS Jawahar Reddy: ఏపీ సీఎస్‌గా జవహర్ రెడ్డి నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

Green Signal To Sharmila Padayatra : షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ - వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని షరతు !

Green Signal To Sharmila Padayatra :   షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ - వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని షరతు !

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు