By: ABP Desam | Updated at : 20 Oct 2022 07:45 AM (IST)
Edited By: RamaLakshmibai
Guppedantha Manasu October 20th Today Episode 586 ( (Image Credit: Star Maa/Hot Star)
గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్ ( Guppedantha Manasu October 20th Today Episode 586)
వసుధార దగ్గరకు వెళ్లి వచ్చిన తర్వాత రిషితో కారులో వెళుతూ డ్రామా వేస్తుంది దేవయాని. వసుధార మనసు మార్చుకుని నాకోసం వస్తుంది..జగతి మేడంపై కృతజ్ఞత వస్తుంది..అంతకన్నా ఎక్కువ ప్రేమ నాపై ఉంది..నా ప్రేమే గెలుస్తుంది మీరు బాధపడకండి అంటాడు రిషి. నాకైతే నమ్మకం లేదంటూ దొంగ ఏడుపు ఏడుస్తుంది దేవయాని. ఈ ఒక్క విషయం తప్ప మా ఇద్దరి మధ్యా ఎలాంటి గొడవలు లేవు..వసుధార ఎప్పటికైనా మనింటి కోడలు అవుతుంది పెద్దమ్మా..మీరు మనసుని కష్టపెట్టుకుని ఇలాంటి ప్రయత్నాలు చేయకండి అంటుంది. వసుధార గురించి నేను ఇంత ధీమాగా ఆలోచిస్తున్నాను..వసుధార కూడా ఇలాగే ఆలోచిస్తుందా అనుకుంటాడు రిషి..
అటు కాలేజీ దగ్గరకు వచ్చిన మహేంద్ర, జగతి..రిషి వచ్చాడా అని అడుగుతారు. నిన్నరాత్రి కాలేజీ గెస్ట్ హౌజ్ లోనే ఉన్నాడు వసుధార కాల్ చేస్తే వెళ్లాడంటాడు. ఇంతలో వసు రావడంతో ఏం జరిగిందని అడుగుతారు. దేవయాని వచ్చినప్పటి నుంచీ రిషి వచ్చి తీసుకెళ్లినంతవరకూ జరిగినదంతా చెబుతుంది.
మహేంద్ర: వదినగారు ఎంత కూల్ గా చెబుతారో అంత ప్రమాదకరం నీకు అర్థంకావడం లేదంటాడు.
జగతి: నీకు అక్కయ్య సంగతి తెలియదు..ఇరవైఏళ్లకు పైగా తన మనస్తత్వాన్ని చూస్తున్నాను ఎప్పుడూ మనం అంచనాలకు ఓ అడుగు పైనే ఉంటారు..అయినా గురుదక్షిణ ఒప్పందం విషయంలో దేవయాని అక్కయ్యతో కూడా చెప్పించుకుంటున్నావా. జీవితం అన్నాక పట్టువిడుపులు ఉండాలి కదా
వసు: నేను నమ్మినదాన్ని పాటించి తీరుతాను
జగతి: ఏంటి నీ నమ్మకం..గురుదక్షిణ విషయం వదిలేయవా. ఎన్నోసార్లు ఈ విషయం చెబుతూనే ఉన్నాను అయినా పట్టించుకోవడం లేదు జీవితాంతం బాధపడతావ్
వసు: లేద మేడం జీవితాంతం మీరు ఆనందంగా ఉంటారు.
జగతి కోపంగా వెళ్లిపోతుంది
వసు: రిషి సార్ ఫ్రెండ్ గా నాకు హెల్ప్ చేయాలి..
గౌతమ్: రిషి ఓ మాట వింటే వెనక్కు తీసుకోడు..వాడి మనసుకి చిన్నప్పటి నుంచీ అయిన గాయాన్ని ఒక్కసారిగా మారాలంటే ఇబ్బందే కదా..నేను ప్రయత్నిస్తున్నాకానీ టాపిక్ వాడితో మాట్లాడాలంటే భయంగా ఉంది. ఈ విషయంలో ఇద్దరూ మెండిగానే ఉంటే మీ బంధానికి ఇబ్బంది అవుతుంది చూసుకో..
వసు: నేను అనుకున్నది సాధిస్తాను...
బలమైన బంధాలతో పాటూ బలమైన పంతాలున్నాయి ఇద్దరికీ అనేసి ఫోన్ వస్తే మాట్లాడేందుకు వెళ్లిపోతాడు గౌతమ్. గురుదక్షిణ అడగకుండా ఉంటే బావుండేదని మహేంద్ర బాధపడతాడు.. లేదు సార్ నమ్మకంగా ఉండండి అంటుంది వసుధార...
Also Read: గతం మర్చిపోయిన మోనిత -వంటలక్కకి సెక్యూరిటీ, అస్సలు ఊహించని షాకిచ్చిన కార్తీక్
రిషి దగ్గర కూర్చుని డ్రామా కొనసాగిస్తుంది దేవయాని. జగతి మహేంద్రకి నీపై శ్రద్ధ లేదంటూ ఓవర్ యాక్షన్ చేస్తుంది. అదంతా నిజమే అనుకుంటాడు రిషి. మరోవైపు జగతి మహేంద్ర కార్లో ఇంటికి బయలుదేరుతారు. వదినగారు రోజురోజుకీ మరింత ప్రమాదకరంగా మారుతున్నారు మనమేం చేయలేమా అని మహేంద్ర అంటే..అక్కయ్య నిజస్వరూపం తెలిస్తే కానీ ఏమీ చేయలేం..రిషి తనంతట తాను తెలుసుకోవాలి అంటుంది జగతి.
రిషి ఒక్కడూ కూర్చుని వసుధారని తల్చుకుంటాడు. ఈ మధ్య ధైర్యం ఎక్కువవుతోంది..చీర విషయంలో సమర్థించుకుందని గుర్తుచేసుకుంటాడు. ఇంతలో వసుధార నుంచి ఏం చేస్తున్నారని మెసేజ్ వస్తుంది. ఖాళీగా ఉన్నానని చెప్పాలా, నీ గురించే ఆలోచిస్తున్నానని చెప్పాలా వద్దులే అనుకుని కలుద్దామా అని రిషి మెసేజ్ చేయగా..ఎక్కడ అని అడుగుతుంది వసుధార. వస్తున్నా అని కాల్ కట్ చేసి బయలుదేరుతాడురిషి.. అప్పుడే లోపలకు ఎంట్రీ ఇస్తారు మహేంద్ర-జగతి.
Also Read: రిషిధారని విడగొట్టేందుకు దేవయాని నయా స్కెచ్, జగతి -మహేంద్ర-గౌతమ్ ఏం చేయబోతున్నారు!
దేవయాని: అయిపోయాయా పనులు..రిషి గురించి ఆలోచించే తీరిక ఉందా..రిషి మనసు తెలుసుకునే ప్రయత్నం చేశావా ఇద్దరూ ఇద్దరే మహానటులు..
మహేంద్ర: నటించాడాలేంటి..మాకొడుకుపై మాకు ప్రేమ ఉండదా..
దేవయాని: రిషిడిస్ట్రబ్ అయి వచ్చాడు మీరు వెళ్లకండి
మహేంద్ర: నా కొడుకు రూమ్ లోకి వెళ్లడానికి నాకు మీ పర్మిషన్ కావాలా...
ఇంతలో రిషి బయటకు వస్తాడు...వెంటనే దేవయాని డ్రామా స్టార్ట్ చేస్తుంది.. మహేంద్ర-జగతి షాక్ లో ఉండిపోతారు.. రిషికి నాకు ఎలాంటి బంధం లేనట్టే కదా..ప్రత్యక్షంగా రిషిని పరోక్షంగా నన్ను ఏడిపిస్తున్నావ్ మహేంద్ర ...ఇంట్లోంచి నేను ఎక్కడికైనా వెళ్లిపోతాం అని డ్రామా మొదలెడుతుంది... రిషి అక్కడికి వచ్చి దొంగఏడుపు ఏడుస్తున్నదేవయానిని ఓదార్చి.. ఇలాంటి పరిస్థితులు వస్తాయని నేను ఊహించలేదు డాడ్..మిమ్మల్ని చూస్తుంటే మీరుకూడా మారిపోతారేమో అనిపిస్తోంది డాడ్.. సోరీ పెద్దమ్మా నేను వెళుతున్నా అనేసి వెళ్లిపోతాడు...
ఏంటిదంతా నేను ఏమన్నానని మహేంద్ర అడగడంతో జగతి...ఇప్పుడేం మాట్లాడొద్దని ఆపేస్తుంది. ఇప్పుడు మీ కళ్లు చల్లబడ్డాయా అని దేవయాని మరో డ్రామా వేస్తుంది. రిషితో అలాగే మాట్లాడుతారా అంటుంది..
జగతి: ఏం జరిగిందో రిషికి తెలియకపోవచ్చు కానీ మీకు తెలుసుకదా..
దేవయాని: బాగా తెలుస్తోంది.. అసలు మీకు రిషి ఆనందంగా ఉండడం ఇష్టంలేదా..
మహేంద్ర: మీరే అన్నీ అంటారు..అవన్నీ మేం అన్నామని నిరూపిస్తారు..
దేవయాని: రిషి మనసు తెలుసుకోలేరు..ఏం తల్లిదండ్రులు మీరు..అసలు మీ ఇద్దరి వల్లేకదా రిషి అలా అవుతోంది.. మహాతల్లి..కొడుకుని వదిలేసి వెళ్లిపోయిన కన్నతల్లీ నిజాలే మాట్లాడుతున్నాను. రిషి సరదాగా మాట్లాడి నవ్వుతూ పలకరించి ఎన్నాళ్లైందో కదా ఆ విషయం మీరు ఆలోచించారా..సాక్షి విషయంలో ఏదో చిన్న పొరపాటు జరిగితే సర్దిచెప్పాల్సింది పోయి వదిలేశారు..రిషి ఆనందాలు నీ కాలు ఇంట్లో మోపాక ఆగిపోయాయి..కొందరి లెగ్గుమహిమ అలా ఉంటుంది మరి.
వదినగారు మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని మహేంద్ర ఫైర్ అవుతుంటే..ఆపుతుంది జగతి..
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
Devil Movie: ‘డెవిల్’ కోసం కళ్యాణ్రామ్కు 90 స్పెషల్ కాస్ట్యూమ్స్ - ఇటలీ నుంచి తెప్పిన మోహైర్ ఊల్తో!
‘సరిపోదా శనివారం’ రిలీజ్ అప్డేట్, ‘నాసామిరంగ’ ఫస్ట్ సింగిల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Samantha: బాలీవుడ్ రియాలిటీ షోలో సమంత - స్టేజీపై హైదరాబాదీ ర్యాపర్తో హల్చల్!
Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ
Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు
Dhiraj Sahu IT Raids Money: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నగదు రూ.318 కోట్లు, ఇంకా 40 సంచులు పెండింగ్!
/body>