News
News
X

Karthika Deepam October 24th Update: సీరియల్ లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దీప - దుర్గకి స్పాట్ పెట్టిన మోనిత, ఇరుక్కుపోయిన కార్తీక్

కార్తీకదీపం అక్టోబరు 24 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

FOLLOW US: 
 

Karthika Deepam October 24th Episode 1491 (కార్తీకదీపం అక్టోబరు 23 ఎపిసోడ్)

శౌర్య  ఆటోలో వెళ్లడం దీప చూస్తుంది. వెంటనే కార్తీక్..కార్లో ఫాలో అవుదాం రా అంటాడు. కార్లో శౌర్య వెనుకే ఫాలో అవుతారు. దారిలో దీప, కార్తీక్ తో ఇన్ని రోజులు తను శౌర్యా? కాదా? అనుకున్నాను ఇప్పుడు నాకు స్పష్టంగా తెలిసింది శౌర్యే. నన్ను వెతుక్కుంటూ ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నట్టుంది తను కలిసే అవకాశం చాలా సార్లు వచ్చిన సరే నేనే పట్టించుకోలేదు అంటూ  గతంలో బస్టాండ్ లో, జాతర లో జరిగిన సంఘటన గుర్తుతెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది. కార్తీక్ కూడా  మనసులో అదే అనుకుంటాడు. నేను నిన్ను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాను..దేవుడు మనతో ఎందుకు ఆడుకుంటున్నాడు అనుకుంటాడు.

సీరియల్ లోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్యారెక్టర్ ను కూడా మోనిత సెట్ చేసినదే. ఏం చేయాలో చెబుతూ ప్లాన్ చెబుతుంది మోనిత. మీకు కావాల్సింది దీపను తప్పించడమే కదా నేను చూసుకుంటానంటుంది. ఏమైనా తేడా వస్తే అప్పుడు చెప్తాను అంటుంది. ఒకవేళ తేడా వచ్చినా నీ పేరు బయటికి రాదు అని చెప్పి వాణి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మోనిత, ఇప్పుడు చూడండి ఇది చేసే తమాషా అని అనుకుంటుంది. 
Also Read: అనుమానంతో ఊగిపోయిన మోనితకు చెంపదెబ్బ, చూస్తూ నిల్చున్న కార్తీక్ - షాక్ లో దీప

దీప కార్తీక్ నిరాశతో తిరిగి ఇంటికి వస్తుంటారు.కార్తీక్ మనసులో...దీప నువ్వు ఎంత బాధ పడుతున్నావో నాకు అర్థమవుతుంది పక్కనే ఉన్నా భర్తని అని నేను ఒప్పుకోవడం లేదు.ఒకే ఊర్లో ఉన్న కూతురు నిన్ను కలవడం లేదు అని అనుకుంటూ మీ వాళ్ళది హైదరాబాదు అన్నావు కదా మీ వాళ్ళందరూ అక్కడ ఉంటే మరి శౌర్య ఎందుకు ఇక్కడ ఉన్నది అని కార్తీక్ అడుగుతాడు. దానికి దీప, వాళ్ళు ఇక్కడ లేరు అమెరికా వెళ్ళిపోయారు ఇక్కడ శౌర్య ని ఎందుకు వదిలేసారో తెలీదు. యాక్సిడెంట్ జరిగిన చోట శౌర్య లేదు కనుక తను కూడా చనిపోయింది అనుకున్నారా లేకపోతే తను కూడా హైదరాబాద్ తిరిగి వచ్చేసరికి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేసారేమో అని అంటుంది. దానికి కార్తీక్ కార్ ఆపి..ఇల్లు మారిపోయారా అని అంటాడు. కారు ఎందుకు ఆపారు డాక్టర్ బాబు అంటే ఏమీ లేదు అని కార్తీక్ తిరిగి కారు నడుపుతూ ఎప్పటికైనా శౌర్య ని కనిపెడదాం బాధపడొద్దు అని ధైర్యం చెబుతాడు.

News Reels

ఆ తర్వాత సీన్లో వాణి తన ఫోన్లో కార్తీక్, దీప, దుర్గ ఫోటోలను చూస్తూ నవ్వుతుంది. తర్వాత ఆటోలో ఎక్కి ఎక్కడికో వెళ్ళిపోతుంది. మరోవైపు కార్తీక్ దీప కారు దిగి ఇంటికి వచ్చేసరికి మోనిత ఎదురుపడుతుంది. నా కార్తిక్ ని ఎక్కడికి తీసుకెళ్లావ్ వంటలక్క అని కోపంగా అడిగితే కారు నడిపింది ఆయన తీసుకెళ్లింది ఆయన నన్నెందుకు అడుగుతున్నారు అని అంటుంది దీప.
మోనిత: నిన్నే అనాలి నా భర్తని నువ్వు లాగేసుకుంటున్నావు? పూర్వకాలంలో ఒక భర్తను ఇంకొక అమ్మాయికి వదిలేస్తే పతివ్రత అంటారేమో కానీ ఇప్పుడు మాత్రం చేతకాని దాన్ని అని అంటారు. నేను చేతకానిదాన్ని కాదు చెంప పగిలించే దాన్ని అని దీప మీదకు వెళుతుంది
అదే సమయంలో ఎంట్రీ ఇచ్చిన వాణి అక్కడికి వచ్చి మోనిత చెంప చెల్లుమనిపిస్తుంది. ఇదేంటి నన్ను కొట్టింది అని మోనిత మనసులో అనుకుంటుంది. 
వాణి: నువ్వు నాకు ఎంత అన్యాయం చేశావు నా బొటిక్ ని నాశనం చేసావు నాకు ఇప్పుడు 20 లక్షలు నష్టం వచ్చింది. కార్తీక్ సార్ మీ భార్యని మీ ముందే కొట్టినందుకు నన్ను క్షమించండి.అయినా ఏంటే ఊరంతా కార్తీక్ సార్ ఈవిడ భార్యాభర్తలు అంటున్నారు అని దీప వైపు చూపిస్తూ అంటుంది.నీకు,కార్తీక్ కి సంబంధం లేదట ఒకవేళ అది నిజమైతే నేనే వాళ్ళని కలుపుతాను అని అంటుంది. 
మోనిత: ఇదేదో రివర్స్ దారి నుంచి వస్తున్నట్టున్నది ఏదైతే ఏమైంది మన పని అయితే అదే చాలు అనుకొని సైలెంట్ గా ఉంటే డౌట్ వస్తాది అనుకోని, ఏంటే నువ్వు నాకు చెంప చెల్లుమనిపించేది నేనే నీకు చుక్కలు చూపిస్తాను. నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను అని కార్తీక్ ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది మోనిత. 
వాణి: నువ్వేం బాధపడొద్దు వదిన ఆ మోనిత పని నేను చూసుకుంటాను
అదే సమయంలో దుర్గ అక్కడికి వచ్చి మోనితను అభినందిస్తాడు. నీకోసమే వెతుకుతున్నా దుర్గ నువ్వే నా దగ్గరికి వచ్చావు అని మనసులో అనుకుంటుంది వాణి. అప్పుడు వాణి నేను మోనిత అంతు చూడాలి అంటే చుట్టుపక్కల ఎక్కడైనా ఉండాలి నాకు ఒక మంచి ఇల్లు చూసి పెట్టండి అని అనగా దుర్గ, దీప ఇంట్లో ఉండమని చెప్తాడు. దానికి దీప, నాకు తోడుగా ఉంటానంటే సమస్య లేదు కానీ ఇల్లు చిన్నది అంటుంది.
Also Read: రిషిని ఒంటరివాడిని చేసేందుకు దేవయాని మరో కుట్ర, ఇంట్లోకి అడుగుపెట్టి షాక్ ఇచ్చిన వసుధార

శౌర్య ఆటో ఎదురుగా కూర్చుని...అమ్మానాన్నతో గడిపిన క్షణాలు గుర్తుచేసుకుంటుంది. ముందు నాన్నని నాకు దూరం చేశాడు కొన్ని రోజులు అందరూ ఆనందంగా ఉన్నాం అనుకుంటే ఇప్పుడు ఇద్దరినీ దూరం చేసి నాతో ఆడుకుంటున్నాడు. అమ్మానాన్నలు నాతోనే ఉన్నారని నాకు తెలుసు ఎలాగైనా వాళ్ళని పట్టుకుంటాను అని ఏడుస్తూ ఉంటుంది శౌర్య. అదే సమయంలో శౌర్య వాళ్ళ బాబాయ్ అక్కడికి వచ్చి, మీ పిన్ని ఫోన్ చేసిందమ్మా మనం వెళ్లాల్సిన అవసరం లేదట తనే డబ్బులతో ఇంటికి వస్తుందట అని చెబుతాడు. ఈ లోగా శౌర్య ఏడవడం చూసి..ఏమైందమ్మా అని ఓదార్చుతాడు. తప్పకుండా దొరుకుతారమ్మా అని శౌర్య కు ధైర్యం చెబుతాడు. 
ఎపిసోడ్ ముగిసింది

రేపటి ( మంగళవారం) ఎపిసోడ్ లో
దీప టిఫిన్ చేసి దుర్గ, వాణికి పెడుతుంది. నేను టిఫిన్ తినను అంటుంది వాణి. ఇది తింటే వీళ్లిద్దరూ పోతారు అనుకుంటుంది. అంతలో కార్తీక్ వచ్చి టిఫిన్ పెట్టమంటాడు. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచనలో పడుతుంది వాణి. తింటే ఈయనా పోతాడు..తినొద్దంటే నాపై అనుమానం వస్తుందని భయపడుతుంటుంది...

Published at : 24 Oct 2022 08:47 AM (IST) Tags: Karthika Deepam Serial karthika Deepam Serial Today Episode Karthika Deepam Serial Written Update Karthika Deepam Episode 1491 Karthika Deepam Serial October 24th

సంబంధిత కథనాలు

Veera Simha Reddy : తమన్‌కు టార్గెట్ ఫిక్స్ చేసిన బాలకృష్ణ ఫ్యాన్స్ - బాక్సులు పగిలిపోవాలంతే

Veera Simha Reddy : తమన్‌కు టార్గెట్ ఫిక్స్ చేసిన బాలకృష్ణ ఫ్యాన్స్ - బాక్సులు పగిలిపోవాలంతే

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Mahesh Babu: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - తిరిగి రంగంలోకి దిగిన మహేష్!

Mahesh Babu: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - తిరిగి రంగంలోకి దిగిన మహేష్!

స్టార్లను సైతం వెనక్కి నెట్టిన రామ్‌చరణ్ - ట్రూ లెజెండ్ అవార్డు దక్కించుకున్న మెగాపవర్!

స్టార్లను సైతం వెనక్కి నెట్టిన రామ్‌చరణ్ - ట్రూ లెజెండ్ అవార్డు దక్కించుకున్న మెగాపవర్!

టాప్ స్టోరీస్

Janasena Slow : జోరుగా ప్రచారాలు - అభ్యర్థులపై కసరత్తులు, ఎన్నికకు సిద్ధం అయిన వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ ! జనసేన వెనుకబడిందా ?

Janasena Slow : జోరుగా ప్రచారాలు - అభ్యర్థులపై కసరత్తులు, ఎన్నికకు సిద్ధం అయిన వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ ! జనసేన వెనుకబడిందా ?

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Rahul Gandhi on BJP: 'పెట్రోల్, గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు?'

Rahul Gandhi on BJP: 'పెట్రోల్, గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు?'

IND vs BAN 1st ODI: నేడు భారత్- బంగ్లా తొలి వన్డే- బంగ్లా పులులపై టీమిండియా పైచేయి సాధిస్తుందా!

IND vs BAN 1st ODI:  నేడు భారత్- బంగ్లా తొలి వన్డే- బంగ్లా పులులపై టీమిండియా పైచేయి సాధిస్తుందా!