ABP దేశం ఎక్స్ క్లూజివ్ : సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ అలోక్ రంజన్ వ్యాఖ్యలు..
మెగాస్టార్ మేనల్లుడు, సినీ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
మెగాస్టార్ మేనల్లుడు, సినీ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సాయిధరమ్ తేజ్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే సాయితేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. హైదరాబాద్ నగరంలోని కేబుల్ బ్రిడ్జ్-ఐకియా సమీపంలో బైక్ స్కిడ్ అయ్యి ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ గాయాలు బలంగా తగిలాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులు ఆయన్ని సమీపంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు.
Also Read: సాయి ధరమ్ తేజ్ హెల్త్‌పై స్పందించిన పవన్.. బైక్ ప్రమాదం అందుకే జరిగింది: పోలీసులు
ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్యపరిస్థితి ఎలా ఉందనే విషయాలను అపోలో న్యూరోసర్జన్ డాక్టర్ అలోక్ రంజన్ ఏబీపీ దేశం ప్రతినిధికి తెలిపారు. సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు మెగాస్టార్ చిరంజీవి అపోలో హాస్పటల్ లోనే ఉండి తెలుసుకుంటున్నారని.. ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. అవయవాలకు ఎటువంటి ఇబ్బంది లేదని.. నర్వస్ సిస్టమ్ బాగానే ఉందని స్పష్టం చేశారు.
అయితే డిశ్చార్జ్ చేయడానికి మాత్రం కొన్ని రోజుల సమయం పడుతుందని.. ట్రీట్మెంట్ కొనసాగుతుందని.. ఆర్తో విషయంలో కూడా ఎటువంటి సమస్య లేదని వెల్లడించారు. మరోపక్క సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. మెగా ఫ్యామిలీ సభ్యులు, మరికొందరు సినీ సెలబ్రిటీలు, మంత్రి తలసాని.. సాయి ధరమ్ తేజ్ పై వస్తోన్న రూమర్లను ఖండిస్తున్నారు. నెగెటివ్ ప్రచారం చేయొద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.
Also Read: Sai Dharam Tej Health Update: వెంటిలేటర్‌పై సాయి ధరమ్ తేజ్.. మరో 48 గంటలు అబ్జర్వేషన్: వైద్యులు
Also Read: ఉదయాన్నే ఆ ట్వీట్.. ఇంతలోనే ప్రమాదం.. సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని ప్రార్థనలు
Also Read: కెమేరాకు చిక్కిన సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్.. ఇసుక వల్లే ప్రమాదమా? అతివేగమా?
Also Read: వెంటిలేటర్‌పై సాయి ధరమ్ తేజ్.. మరో 48 గంటలు అబ్జర్వేషన్: వైద్యులు
Also Read : Radheshyam movie: ప్రభాస్ సినిమాలో అతడేనా విలన్?