Radheshyam movie: ప్రభాస్ సినిమాలో అతడేనా విలన్?
బాహుబలి ప్రభాస్ నటిస్తున్న పీరియాడికల్ లవ్ స్టోరీ రాధేశ్యామ్. ఇప్పుడు ఈ సినిమా గురించి తాజా అప్డేట్ లు ఇవిగో...
ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో రాధేశ్యామ్ కూడా ఒకటి. ఇది 1970లలో సాగే పీరియాడికల్ లవ్ స్టోరీ. ప్రస్తుతం హైదరాబాద్లోనే దీని షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందుకే ఇందులో ప్రభాస్ విలన్ గా బాలీవుడ్ నటుడిని తీసుకొస్తున్నారని తెలుస్తోంది. ‘గోపాల గోపాల’ సినిమాలో విలన్ గా నటించిన మిథున్ చక్రవర్తి ‘రాధే శ్యామ్’ లో కూడా నటించబోతున్నాడట. ఈ విషయంలో ఇంకా సినిమా యూనిట్ స్పందించలేదు. ఈ మూవీని సంక్రాంతి విడుదల చేస్తున్నారు సినిమా నిర్మాతలు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదలవ్వాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చి, బాగా ఆలస్యమైంది. అయితే సంక్రాంతికే పెద్ద సినిమాలు చాలా విడుదలవ్వబోతున్నాయి. మహేశ్ 'సర్కారు వారి పాట', పవన్-రానా 'అయ్యప్పనుమ్ కోశియమ్' రీమేక్ కూడా సంక్రాంతికే రాబోతున్నాయి.
ఈసినిమాలో చాలా భాగం యూరోప్ లో చిత్రీకరణ జరుపుకుంది. తరువాత కొన్ని కీలక సన్నివేశాలు కడపలోని గండికోటలో కూడా చిత్రీకరించారు. బాహుబలిలో కట్టప్పగా కనిపించిన సత్యరాజ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. రాధాకృష్ణ రాధేశ్యామ్ కు దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందని తెలుస్తోంది. ఇవే కాకుండా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘సలార్’, ఓమ్ రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాలలో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. ఇవి పూర్తయ్యాక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటించనున్నాడు బాహుబలి. ఇందులో ప్రభాస్ పక్కన దీపికా పడుకునే నటించబోతోంది. అలాగే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కూడా కీలకపాత్ర పోషించనున్నారు.
Also read: హైదరాబాద్ లో సలార్ షూటింగ్... సెట్స్ లో ప్రభాస్
Also read: బైక్ రైడింగ్ వద్దని ఎన్నో సార్లు చెప్పా.... సీనియర్ నటుడు నరేష్
Also read: ‘ఆర్ఆర్ఆర్’ విడుదల వాయిదా.. స్పష్టం చేసిన రాజమౌళి టీమ్
Also read: నిలకడగా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం... తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన అపోలో వైద్యులు
Also read: 'ఇట్స్ టైమ్ ఫర్ సెలబ్రేషన్' సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై మంచు లక్ష్మీ కామెంట్స్!
Also read: సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం.. అపస్మారక స్థితిలోకి హీరో, ఆస్పత్రికి చిరు, పవన్
Also read: తేజ్.. నీ చిరునవ్వును మేం మళ్లీ చూడాలి.. టాలీవుడ్ సెలబ్రిటీల స్పందన ఇది
Also read: ఉదయాన్నే ఆ ట్వీట్.. ఇంతలోనే ప్రమాదం.. సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని ప్రార్థనలు