అన్వేషించండి

RRR Movie Release Date: ‘ఆర్ఆర్ఆర్’ విడుదల వాయిదా.. స్పష్టం చేసిన రాజమౌళి టీమ్

బాహుబలి తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న RRR అక్టోబరు 13న విడుదలవుతుందని డేట్ ఇచ్చిన టీమ్ ఇప్పుడు ఆ రోజు రావడం లేదని అఫీషియల్ గా ప్రకటించింది. విడుదల తేదీ త్వరలోనే ప్రకటిస్తామంది.

‘బాహుబలి’తో టాలీవుడ్ రేంజ్ మార్చేసిన రాజమౌళి తర్వాతి ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో మెగా-నందమూరి వారసులు నటిస్తుండడంతో క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది. అయితే ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ట్రిపుల్ ఆర్.. ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల కాబోతున్నట్టు దర్శక నిర్మాతలు చెప్పారు. ముందుగా 2020 జులై 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు. ఆ తర్వాత 2021 జనవరి 8న పక్కా థియేటర్లలోకి వస్తామని ప్రకటించారు. అయితే అనివార్య పరిస్థితుల్లో మళ్ళీ వాయిదా వేయాల్సి వచ్చింది. చివరిగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ ముచ్చటగా మూడోసారి వాయిదా పడింది. ఈ విషయం ఎప్పటినుంచో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికీ తాజాగా రాజమౌళి అండ్ టీం అఫీషియల్‌గా ప్రకటించింది.

ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ అన్ని ఇంకా పూర్తి సామర్థ్యంతో పని చెయ్యని కారణంగా అక్టోబర్ 13 న ఆర్.ఆర్.ఆర్ ని రిలీజ్ చేయలేకపోతున్నామని.. త్వరలోనే ఆర్.ఆర్.ఆర్ న్యూ రిలీజ్ డేట్ ఇస్తామంటూ ప్రకటించారు. దానితో ఆర్.ఆర్.ఆర్ దసరా బరి నుంచి అఫీషియల్ గా తప్పుకున్నట్టే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తుండగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నాడు. అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

వాస్తవానికి వాయిదాల మీద వాయిదాలు పడకుండా రాజమౌళి సినిమా రిలీజయ్యే ఛాన్సే లేదని ప్రేక్షకులు ఫిక్సైపోయారు. గతంలో ‘ఈగ’, ‘బాహుబలి’ లాంటి సినిమాల షూటింగ్, గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం కావడంతో వాయిదాపడ్డాయి. పైగా చెక్కుడు కార్యక్రమంలో రాజమౌళిని మించిన వారు లేరనే ఉద్దేశంతోనే జక్కన్న అనే పేరు ఫిక్స్ చేసేశారు. కానీ ఇప్పుడు జక్కన్న చెక్కడం కామన్ కారణం అయినా... అంతకుమించిన మరో కారణం కరోనా. ఏదేమైనా ‘RRR’ వాయిదా అన్నది క్లారిటీ వచ్చేసింది. మళ్లీ విడుదల తేదీ కోసం సినీ ప్రియులు ఎదురుచూడాల్సిందే.

Alos Read:తేజ్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దన్న చిరంజీవి, త్వరగా కోలుకోవాలంటూ సినీ, రాజకీయ ప్రముఖుల ట్వీట్లు

Also read:తెలుగు సినిమా హీరోలకు బైకులంటే ఎందుకంత మోజు..

Also Read: సాయిధరమ్ తేజ్ పై కేసు నమోదు, ప్రమాదానికి కారణం అదే అన్న మాదాపూర్ ఏసీపీ

Also Read: సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయిన బైక్ గురించి తెలుసా.. సరిగ్గా 5 నెలల క్రితం సుప్రీం హీరోనే..

Also Read: జైల్లోకి జెస్సీ, నా కొడుకు మెంటల్ గా డిస్ట్రబ్ అయ్యాడు సపోర్ట్ చేయండంటూ జస్వంత్ పడాల తల్లి భావోద్వేగం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget