Dil Raju: ఇండస్ట్రీ సమస్యలను రాజకీయం చేయొద్దు.. నిర్మాత దిల్ రాజు వ్యాఖ్యలు
చిత్రపరిశ్రమ సమస్యలను రాజకీయం చేయొద్దని మీడియాను కోరారు దిల్ రాజు. టికెట్లు ఆన్‌లైన్ విధానం కావాలని పరిశ్రమ తరఫున మేమే ప్రభుత్వాన్ని కోరామని అన్నారు.
సినీ పరిశ్రమ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతలు బుధవారం నాడు మచిలీపట్నంలో సమావేశమైన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం మంత్రితో పాటు నిర్మాతలు కూడా మీడియాతో ముచ్చటించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో సినీ పరిశ్రమకు, తమకు ఎలాంటి సంబంధం లేదని నిర్మాతలుస్పష్టం చేసినట్లు పేర్ని నాని మీడియాకు తెలిపారు. ఆ తరువాత నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడారు.
Also Read:టెంట్ హౌస్‌లా పార్టీని కిరాయికి ఇస్తారు.. ఇండస్ట్రీతో పవన్‌కు సంబంధం లేదన్న పేర్ని నాని
కరోనా కాలంలో సినీ పరిశ్రమం ఎంతగా నష్టపోయిందో మంత్రికి వివరించామని తెలిపారు. కోవిడ్ ప్రభావం, థియేటర్ల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి గతంలోనే తీసుకెళ్లామని చెప్పారు. కొన్నాళ్లక్రితం మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు రాజమౌళితో కలిసి ముఖ్యమంత్రి జగన్ ను కలిశామని.. మా విజ్ఞప్తిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు. సినిమా అనేది చాలా సున్నితమని.. ఏ సమస్య వచ్చినా ఆ ప్రభావం నిర్మాతలపైనే పడుతుందని అన్నారు.
అందుకే చిత్రపరిశ్రమ సమస్యలను రాజకీయం చేయొద్దని మీడియాను కోరుతున్నట్లు చెప్పారు. టికెట్లు ఆన్‌లైన్ విధానం కావాలని పరిశ్రమ తరఫున మేమే ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. ఆన్‌లైన్ విధానం ద్వారా పారదర్శకత ఉంటుందని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
ఇదే ప్రెస్ మీట్ లో మరో నిర్మాత సునీల్ నారంగ్ కూడా మాట్లాడారు. రాజకీయం వేరు.. సినిమా పరిశ్రమ వేరని స్పష్టం చేశారు. ఎవరో ఏదో మాట్లాడితే.. తమకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. థియేటర్లో వంద శాతం ఆక్యుపెన్సీ పెరగాలనేది తమ ఉద్దేశమని.. టికెట్లను ఆన్‌లైన్ చేయమని అడిగింది తామేనని వెల్లడించారు.
Also Read: 'వల్గర్ ఆంటీ.. చీప్' అంటూ జెనీలియాపై దారుణమైన కామెంట్స్.. ఘాటు రిప్లై ఇచ్చిన బ్యూటీ..
Also Read: 'ఆర్ఆర్ఆర్'తో పోటీ.. తగ్గేదే లేదంటున్న ప్రభాస్..