Perni Nani : టెంట్ హౌస్‌లా పార్టీని కిరాయికి ఇస్తారు.. ఇండస్ట్రీతో పవన్‌కు సంబంధం లేదన్న పేర్ని నాని
సినిమా ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మద్దతు లేదన్న అభిప్రాయం కల్పించేందుకు పేర్ని నాని ప్రయత్నించారు. చిరంజీవి విచారం వ్యక్తం చేశారని స్వయంగా ప్రకటించుకున్నారు.
![Perni Nani : టెంట్ హౌస్‌లా పార్టీని కిరాయికి ఇస్తారు.. ఇండస్ట్రీతో పవన్‌కు సంబంధం లేదన్న పేర్ని నాని Minister Perni Nani attempt to say that there is no support for Pawan Kalyan in the film industry Perni Nani : టెంట్ హౌస్‌లా పార్టీని కిరాయికి ఇస్తారు.. ఇండస్ట్రీతో పవన్‌కు సంబంధం లేదన్న పేర్ని నాని](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/29/971d46b2bbfbc3eb6c5249233e77ecb5_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మంగళగిరి సభలో పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. కిరాయికి రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని మండిపడ్డారు. పార్టీ పెట్టి పెంట్ హౌస్‌లో అద్దెకిస్తున్నారని ఆరోపించారు. పలువురు సినిమా నిర్మాతలు ఆయనను మచిలీపట్నంలో కలిశారు. వారితో సమావేశం తర్వాత పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. సినిమా ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలతో తమకు సంబంధం లేదని చెప్పడానికే నిర్మాతలు వచ్చారని పేర్ని నానిప్రకటించారు. రిపబ్లిక్ సినిమా ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి తనతో మాట్లాడారని.. ఆయన విచారం వ్యక్తం చేశారని పేర్ని నాని చెప్పారు. పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదని చిరంజీవి చెప్పారన్నారు.
Also Read : ఎలాంటి యుద్ధానికైనా సిద్దం .. వైఎస్ఆర్‌సీపీ నేతలకు పవన్ కల్యాణ్ హెచ్చరిక !
ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు ఇండస్ట్రీ అభిప్రాయం కాదని అనేక మంది చెప్పారని మంత్రి తెలిపారు. పవన్ కల్యాణ్ మాటలు మాట్లాడిన మాటలు నిజం కాదని చెప్పాలని తాము రిక్వెస్ట్ చేశామని అందుకే నిర్మాతలు వచ్చారని పేర్ని నాని చెప్పారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ కొత్తది కాదని ఆ విధానానికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉందన్నారు. టాలీవుడ్ సమస్యలపై సీఎం సానుకూలంగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. సినిమా టిక్కెట్ల అమ్మకానికి నిర్దిష్ట విధానం అవసరం ఉందన్నారు.
మీడియాతో మాట్లాడిన నిర్మాత దిల్ రాజు సినీ పరిశ్రమ సున్నితమైనదని.. వివాదాల్లోకి లాగవద్దని కోరారు. సినిమా టిక్కెట్ల రేట్లు పెంచాలని కోరామని.. గత సమావేశంలోనూ కోరామన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. పవన్ కల్యాణ్ ఓ వైపు మంగళగిరిలో పార్టీ సమావేశం పెట్టి ప్రభుత్వం, వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్న సమయంలోనే వ్యూహాత్మకంగా నిర్మాతల్ని మంత్రి పిలిచి చర్చలు జరిపారు. ఈ విషయాన్ని పేర్ని నాని కూడా పరోక్షంగా అంగీకరించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఖండించాలని రిక్వెస్ట్ చేశామని చెప్పారు.
Also Read : డ్రగ్స్ పోయి బూతులు వచ్చే ఢాం..ఢాం..ఢాం ! రాజకీయం అంతా డైవర్షన్ పాలిటిక్సేనా ?
ఇండస్ట్రీ కోసం మాట్లాడుతున్నా అని పవన్ చెప్పుకుంటున్నా... ఇండస్ట్రీ వాళ్లంతా తమకే మద్దతు ఇస్తున్నారని మంత్రి చెప్పారు. పవన్ కళ్యాణ్ వ్వాఖ్యలతో సంబంధం లేదని చెప్పేందుకే వారు వచ్చారన్నారు. నిజానికి మచిలీపట్నంలో జరిగిన సమావేశానికి ప్రత్యేకమైన ఎజెండా ఏమీ లేదు. ఇరవయ్యో తేదీన అమరావతిలో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలే మాట్లాడారు. ఇప్పటికీ ప్రభుత్వం వారు లేవనెత్తిన అంశాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ సీఎం సానుకూలంగా ఉన్నారని చెబుతున్నారు. అదే మాట ఇప్పుడు కూడా చెప్పారు.
Also Read : బద్వేలు బరిలో బీజేపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థి ! పోటీకి ఎవరు ముందుకు వస్తారు ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)