By: ABP Desam | Updated at : 29 Sep 2021 08:27 PM (IST)
జెనీలియాపై దారుణమైన కామెంట్స్
సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. సెలబ్రిటీలు ఏం చేసినా.. అది నిమిషాల్లో వైరల్ అయిపోతుంటుంది. ఏదైనా విషయం నెటిజన్లకు నచ్చకపోతే దారుణంగా ట్రోల్ చేస్తుంటారు. ఇటీవల బాలీవుడ్ జంట రితేష్ దేశ్ ముఖ్, నటి జెనీలియాలు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నారు. జెనీలియాను ఓ నెటిజన్ 'వల్గర్ ఆంటీ' అంటూ ట్రోల్ చేశారు. ఈ విషయంపై తాజాగా ఓ షోలో స్పందించింది జెనీలియా.
Also Read: 'ఆర్ఆర్ఆర్'తో పోటీ.. తగ్గేదే లేదంటున్న ప్రభాస్..
నటుడు అర్భాజ్ ఖాన్ హోస్ట్ చేస్తోన్న 'పించ్' అనే షోకి రితేష్, జెనీలియాలు అతిథులుగా వచ్చారు. ఈ షో స్పెషాలిటీ ఏంటంటే.. ఇందులో గెస్ట్ లుగా వచ్చే సెలబ్రిటీలను.. వారి ట్రోల్స్ కి సంబంధించిన కామెంట్స్ చదివి వారి రెస్పాన్స్ తీసుకుంటూ ఉంటారు. ముందుగా రితేష్, జెనీలియాలకు ఓ వీడియో చూపించాడు అర్భాజ్ ఖాన్. అందులో ఓ ఈవెంట్ లో నటి ప్రీతీ జింతాను రితేష్ చేతులపై ముద్దు పెట్టుకొని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే.. జెనీలియా జలసీతో చూస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్లిన తరువాత జెనీలియా కోపంతో భర్తను కొడుతున్నట్లు.. ఆయన వద్దని వేసుకుంటున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియా బాగా వైరల్ అయింది.
అయితే ఈ వీడియో చూసిన ఓ నెటిజన్.. 'నీకు సిగ్గు లేదా.. వల్గర్ ఆంటీ. ఎప్పడూ ఓవర్ యాక్షన్ చేస్తుంటావ్.. నీ ఏజ్ కి. మొహానికి అది అస్సలు సూట్ అవ్వదు. పెళ్లై.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. నీ ఓవర్ యాక్షన్ చూసి నీ పిల్లలు కూడా షాకై ఉంటారు' అంటూ ఇష్టమొచ్చినట్లుగా జెనీలియాను కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన జెనీలియా.. 'అతడి ఇంట్లో పరిస్థితులు బాలేనట్లు ఉన్నాయి. అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. భాయ్ సాబ్.. మీరు ఇంట్లో బాగానే ఉన్నారని ఆశిస్తున్నా' అంటూ ఘాటుగా బదులిచ్చింది. రితేష్ కూడా ఈ విషయంపై స్పందించాడు. పాపులారిటీ ఉన్నవాళ్లకి ఇలాంటి విమర్శలు మామూలే అని.. వాటిని పట్టించుకోకూడదని అన్నారు.
Amitabh Bachchan: చెప్పులు లేకుండా ఫ్యాన్స్‌ను కలిసిన అమితాబ్ బచ్చన్, 50 ఏళ్లుగా అలాగే చేస్తున్నారట - ఎందుకంటే..
'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రావణుడు మిస్సింగ్ - సైఫ్ అలీఖాన్ అందుకే రాలేదా?
7:11 PM Movie: మరో టైమ్ ట్రావెల్ సినిమా వస్తోంది - ఉత్కంఠభరితంగా ‘7:11pm’ మూవీ టీజర్!
NBK 108 Title : టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి - బాలకృష్ణ సినిమా టైటిల్ ఆవిష్కరణకు భారీ ప్లాన్
మనం అనుకుంటున్నట్టు ప్రభాస్ అలాంటి వాడు కాదు: కృతి సనన్
బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !
Viral Video: బాలికను ఎత్తుకెళ్లిన యువకుడు, ఎడారిలో బలవంతంగా పెళ్లి - మహిళా కమిషన్ సీరియస్
చట్టం పరిధిలోనే మార్గదర్శి కేసులో విచారణ- అవసరమైతే మళ్లీ శైలజ, రామోజీరావును ప్రశ్నిస్తాం: ఏపీ సీఐడీ
Odisha train accident: ప్రమాదానికి కారణం సిగ్నల్ ఫెయిల్యూర్ కాదు, లూప్‌లైన్‌లోకి వెళ్లడమే మిస్టరీ - సీనియర్ అధికారి