అన్వేషించండి
Advertisement
Samantha Akkineni: రూమర్స్ పై సమంత రియాక్షన్.. ఫైనల్ గా ఫ్యాన్స్ కు క్లారిటీ..
సమంత హైదరాబాద్ ను వదిలి వెళ్లిపోతుందని.. ముంబైలో ఓ ఇల్లు కొనుక్కొని అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటుందని ప్రచారం జరిగింది. దానిపై సమంత ఏమంటుందంటే..?
అక్కినేని నాగచైతన్య, సమంతల మధ్య మనస్పర్థలు వచ్చాయని.. విడాకులు తీసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా అయితే సమంత హైదరాబాద్ ను వదిలి వెళ్లిపోతుందని.. ముంబైలో ఓ ఇల్లు కొనుక్కొని అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటుందని ప్రచారం జరిగింది. మీడియాలో వస్తోన్న ఏ ఒక్క వార్తపై అటు సమంత కానీ.. ఇటు నాగచైతన్య కానీ స్పందించలేదు. చైతు నటించిన 'లవ్ స్టోరీ' సినిమా విడుదల సమయంలో ఈ విషయంపై క్లారిటీ ఇస్తాడనుకున్నారు. కానీ ఆయన అసలు వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నించొద్దని ముందే చెప్పేశారు.
'లవ్ స్టోరీ' సినిమా ప్రమోషన్స్ లో కానీ.. సక్సెస్ మీట్ లో కానీ సమంత ఎక్కడా కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ అసలు ఏం జరుగుతుందో అర్ధంకాక తలలు పట్టుకున్నారు. ఎట్టకేలకు సమంత తనపై వస్తోన్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. సమంత 'సాకి' అనే క్లోతింగ్ బ్రాండ్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యాపారం మొదలుపెట్టి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించింది.
వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అఫ్ కోర్స్.. డివోర్స్ గురించి అడిగిన ప్రశ్నలను అవైడ్ చేసిందనుకోండి. కానీ ఓ నెటిజన్ 'ముంబై కి షిఫ్ట్ అవుతున్నారా..?' అని అడిగిన దానికి సమంత సమాధానం చెప్పుకొచ్చింది. అసలు ఇలాంటి వార్తలు ఎక్కడ నుంచి మొదలవుతాయో అర్ధం కాదని చెప్పిన సమంత.. అన్ని రూమర్లలానే ఈ రూమర్ లో కూడా నిజం లేదని చెప్పింది. ఇప్పటికీ, ఎప్పటికీ హైదరాబాదే తన ఇళ్లని స్పష్టం చేసింది. హైదరాబాద్ తనకు అన్నీ ఇచ్చిందని.. కాబట్టి అక్కడే జీవిస్తానని చెప్పింది.
రీసెంట్ గా ఓ జ్యోతిష్కుడు సమంత-నాగచైతన్య విడిపోతారని.. ఆ తరువాత చైతు కెరీర్ ఓ రేంజ్ లో ఉంటుందని.. సమంత ముంబైలో సెటిల్ అవుతుందని కొన్ని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
Also Read: నా శ్వాస ఉన్నంత వరకూ మీరే నా దైవం..బండ్ల గణేష్ ట్వీట్ వైరల్
Also Read: సామాజిక సేవలో సోనూ మరో అడుగు..శబ్దం, వాసన, రుచిని ఇకపై చక్కగా ఆస్వాదిద్దాం అన్న రియల్ హీరో
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion