Bandla Ganesh: నా శ్వాస ఉన్నంత వరకూ మీరే నా దైవం..బండ్ల గణేష్ ట్వీట్ వైరల్
రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టాలీవుడ్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమయంలో పవన్ ని ఉద్దేశిస్తూ వీరాభిమాని బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ ని అభిమానించే వారిలో నిర్మాత బండ్ల గణేష్ స్టైలే వేరు. ఎప్పటికప్పుడు ప్రత్యేక అభిమానాన్ని చాటుకునే బండ్లగణేష్ మరోసారి పవర్ ఫుల్ ట్వీట్ చేశాడు.
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో టాలీవుడ్ లో నిర్మాతగా నిలదొక్కుకున్న బండ్ల గణేష్ ఆ తర్వాత వరుస సక్సెస్ లు అందుకున్నాడు. ఈ మధ్య కాలంలో నిర్మాతగా కొంచెం గ్యాప్ ఇచ్చినప్పటికీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం 'మా' ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నాడు బండ్ల గణేష్. జనరల్ సెక్రటరీ అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేశాడు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి బండ్ల చేసిన ట్వీట్ పై పెద్ద చర్చే జరుగుతోంది.
నా పయనం నా జీవితం నా గమ్యం నా ధైర్యం మేము మీతో మా ప్రయాణం మా శ్వాస ఉన్నంత వరకు మీరే మా దైవం జై పవర్ స్టార్ @PawanKalyan 🙏 pic.twitter.com/zLQxCkwEXa
— BANDLA GANESH. (@ganeshbandla) September 28, 2021
'రిపబ్లిక్' సినిమా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ సమస్యలపై ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఈ కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. కొందరు పవర్ కి మద్దతుగా నిలిస్తే మరికొందరు ఇండస్ట్రీ వేరు రాజకీయాలు వేరు అన్నట్టు కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ని దైవంగా భావించే బండ్ల గణేష్ మీడియాముందుకొచ్చి మాట్లాడాలని అభిమానులు కోరారు. అయితే ప్రస్తుతం 'మా' ఎన్నికలతో బిజీగా ఉన్నానన్న గణేష్ అక్టోబర్ 10న ఎన్నిక ముగిసిన తర్వాత 11వ తేదీ ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తా అని ప్రకటించాడు. ఇలాంటి టైమ్ లో బండ్ల ఒక్క ట్వీట్ తో పవన్ అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందంటే.." 'నా పయనం, నా గమ్యం, నా ధైర్యం.. మీతోనే నా ప్రయాణం.. శ్వాస ఉన్నంతవరకు మీరే నా దైవం జై పవర్ స్టార్' అనే ట్వీట్ వైరల్ అవుతోంది.
'మా' ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు నామినేషన్లు దాఖలు చేశారు. జనరల్ సెక్రెటరీగా పోటీ చేస్తున్న బండ్ల గణేష్ కూడా నామినేషన్ దాఖలు చేసి 'మా' బిల్డింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీకి మా బిల్డింగ్ అవసరం లేనేలేదన్న బండ్ల ఇప్పుడున్న ఆఫీస్ చాలన్నాడు. కొందరు కావాలనే ప్రలోభ పెడుతున్నారని మండిపడ్డాడు. 'మా' ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా తన గెలుపు తథ్యమని, తనకు ఎంతమంది ఆశీర్వాదాలు ఉన్నాయో ఎవరికీ తెలియదన్నాడు. 'మా' ఎన్నికల్లో తాను రాకెట్‌లా దూసుకెళ్తున్నానని, తన విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. తాను గెలిస్తే, 100మంది పేద కళాకారులను డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చాడు.
Also Read: కెప్టెన్సీ టాస్క్ కోసం నటరాజ్ మాస్టర్ తిప్పలు.. ప్రియాను హగ్ చేసుకున్న లోబో..
Also Read: 'లవ్ స్టోరీ'లో ఆ సీన్ ఫేక్.. చిరు డైరెక్టర్ కి 'నో' రెమ్యునరేషన్..
Also TRead: ''ఈ చెత్త మన చుట్టూ జరుగుతుందా..? ఛీ'' నాగార్జున కామెంట్స్