News
News
X

Bigg Boss 5 Telugu: కెప్టెన్సీ టాస్క్ కోసం నటరాజ్ మాస్టర్ తిప్పలు.. ప్రియాను హగ్ చేసుకున్న లోబో.. 

నామినేషన్ లో ప్రియాతో గొడవ పడ్డ లోబో ఈరోజు ఎపిసోడ్ లో ఆమెని హగ్ చేసుకున్నాడు. ఇక కెప్టెన్సీ టాస్క్ కోసం నటరాజ్ మాస్టర్ పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. 

FOLLOW US: 
Share:

బిగ్ బాస్ సీజన్ 5 నాల్గో వారంలోకి ఎంటర్ అయింది. సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియ జరగ్గా.. మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. ఇక ఎప్పటిలానే మంగళవారం ఎపిసోడ్ లో నామినేట్ చేసిన వాళ్లతో తిరిగి స్నేహం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు కంటెస్టెంట్స్. ముందుగా రవి.. నటరాజ్ మాస్టర్ దగ్గరకు వెళ్లి 'గుంటనక్క అంటే నేనే కదా, ప్రతి వారం నాగార్జున సార్ గుంటనక్క అంటుంటే అందరూ నా వైపే చూస్తున్నారు,సిగ్గయితుందన్నా' అని అన్నాడు. దానికి మాస్టర్ 'ఒక ఊసరవెల్లి నాతో రవికి పర్ ఫెక్ట్ పేరు పెట్టావ్' అని అంది అని సమాధానమిచ్చాడు. దానికి రవి 'విశ్వనా' అని అడిగితే, 'చెప్తా చెప్తా' అంటూ మాట దాటేశాడు. రవి, విశ్వతో ఇదే విషయాన్ని ప్రశ్నించాడు. దానికి విశ్వ షాకైపోయాడు. అసలు తను అలా అనలేదని చెప్పాడు. 

కాజల్, మానస్ కూర్చొని మాట్లాడుతుండగా.. రవి వాళ్లిద్దరి దగ్గరకొచ్చి కూర్చోగానే కాజల్ కోపంతో లేచి వెళ్లిపోయింది. ఆమెని కూర్చోమని రవి, మానస్ అడగ్గా.. ఫిజికల్ ఏంటి రవి అసలు అంటూ నామినేషన్ లో తనకు చెప్పిన రీజన్ ను  క్వశ్చన్ చేసింది. దానికి రవి.. కొట్టడం ఫిజికల్ కాదా..? అని తిరిగి క్వశ్చన్ చేశాడు. దానికి కాజల్ 'ఆ పదం వాడతావా, నాతో మాట్లాడకు' అంటూ కోపంగా గార్డెన్ ఏరియా నుంచి వెళ్లిపోయింది. లోపల సిరిని పట్టుకుని వెక్కివెక్కి ఏడ్చింది. బయట రవికి ఏమీ అర్థం కాక మానస్ ని చూస్తూ ఉండిపోయాడు.

Also Read: ''ఈ చెత్త మన చుట్టూ జరుగుతుందా..? ఛీ'' నాగార్జున కామెంట్స్

ఆ తరువాత తప్పు మన సైడ్ ఉన్నప్పుడు వెళ్లి చెప్తే మనమే పెరుగుతాం అంటూ లోబోకి సలహా ఇచ్చాడు రవి. దీంతో లోబో వెంటనే వెళ్లి ప్రియాను హగ్ చేసుకున్నాడు. శ్రీరామచంద్ర సెల్ఫ్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడని షణ్ముఖ్.. జెస్సీతో అన్నాడు.

శ్వేతా-జెస్సీ మాట్లాడుకుంటూ ఉండగా.. 'నేను రిక్వెస్ట్‌ చేస్తున్నా బిగ్‌బాస్‌.. మా ఇద్దరిని కలిపి బాయ్‌ఫ్రెండ్‌, గర్ల్‌ఫ్రెండ్‌గా ఓ రోల్‌ పెట్టండి. మనోహర.. మనోహర అనే రొమాంటిక్‌  సాంగ్‌ కి శ్వేతాతో కలిసి డాన్స్ చేయాలనుందంటూ'' బిగ్‌బాస్‌కు రిక్వెస్ట్ చేశాడు జెస్సీ. ఇక జెస్సీ మాటలకు శ్వేత పడిపడి నవ్వింది. 'విజయ్ దేవరకొండ అంత హైట్, గట్స్ ఉన్నవాడిని పక్కన పెట్టుకొని.. ఇంతకంటే మంచి ఆప్షన్ దొరుకుతుందా నీకు..?' అంటూ శ్వేతాని ప్రశ్నించాడు జెస్సీ. దానికి ఆమె 'బెంగళూర్ లో గర్ల్ ఫ్రెండ్ ఉంది.. పెళ్లి చేసుకుంటా అన్నావ్ కదా.. ఇప్పుడేంటి ఫ్లిప్ అవుతున్నావ్ అని' ప్రశ్నించింది. దానికి జెస్సీ.. 'ఒక డాన్స్ చేయమన్నాను.. అందులో తప్పేముందని' అన్నాడు.

గెలవాలంటే తగ్గాల్సిందే.. 
ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా.. హౌస్ మేట్స్ ను జంటలుగా విడిపోమని చెప్పారు. ఏ జంటైతే ఎక్కువ బరువుని కోల్పోతారో వాళ్లే ఈ వారం ఈ కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారని చెప్పారు బిగ్ బాస్. మధ్య మధ్యలో కొన్ని టాస్క్ లు ఇస్తుంటారు.. అందులో గెలిచిన జంట హాఫ్ కేజీ తగ్గుతుంది. ఓడిపోతే హాఫ్ కేజీ పెరుగుతుంది. ఇది కాకుండా తగ్గడానికి హౌస్ మేట్స్ వేరే ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చని చెప్పారు. దీంతో హౌస్ మేట్స్ అంతా వర్కవుట్ మొదలుపెట్టేశారు. లోబో వర్కవుట్ చేస్తుంటే సన్నీ, హమీద ఫన్ చేసుకున్నారు. 
ముందుగా నటరాజ్-లోబో జంటకి పవర్ రూమ్ యాక్సెస్ దక్కింది. పవర్ రూమ్ లోకి వెళ్లిన వీరు తమతో పోటీ పడడానికి శ్రీరామచంద్ర-హమీదలను ఎన్నుకున్నారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో ఈ రెండు జంటలు పోటీ పడగా..శ్రీరామచంద్ర-హమీదలు టాస్క్ లో విజేతలుగా నిలిచారు. 
ఆ తరువాత గార్డెన్ ఏరియాలో ఉన్న రవి దగ్గరకు వెళ్లిన ప్రియా.. 'ఇంక నార్మల్ అయిపో.. అయిపోయిందేదో అయిపోయింది' అని చెప్పగా.. 'బయటకి రావడానికి ప్రయత్నిస్తున్నా.. నాతో నాకే ఫైట్..' అంటూ రవి అన్నాడు. అనంతరం లోబో-సన్నీ మాట్లాడుకుంటూ.. శ్రీరామచంద్ర-హమీదలను సెలెక్ట్ చేసుకోవడమే రాంగ్ ఛాయిస్ అని అనుకున్నారు.  

Also Read:ట్రెండింగ్ లో #JusticeforPunjabiGirl

Also Read: బన్నీ- లెక్కల మాస్టారు తగ్గేదే లే అన్నారు...ఇప్పుడు తగ్గక తప్పడం లేదా...మరోవైపు 80 మిలియన్ వ్యూస్ కి చేరిన 'పుష్ప' సింగిల్ సాంగ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 28 Sep 2021 11:16 PM (IST) Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 Hamida Lobo Nataraj master Priya Captaincy task sreeramachandra

సంబంధిత కథనాలు

Mehaboob On Sri Satya: శ్రీసత్య విషయంలో చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకోబోయిన అర్జున్, మెహబూబ్

Mehaboob On Sri Satya: శ్రీసత్య విషయంలో చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకోబోయిన అర్జున్, మెహబూబ్

Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!

Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!

వీజే సన్నీ దొంగతనం చేశాడా? బ్యాగ్ నిండా డబ్బులతో సీసీటీవీ కెమేరాకు చిక్కిన వైనం

వీజే సన్నీ దొంగతనం చేశాడా? బ్యాగ్ నిండా డబ్బులతో సీసీటీవీ కెమేరాకు చిక్కిన వైనం

Bigg Boss Telugu TRP: క్రేజ్ తగ్గిందా? పాతాళానికి పడిపోయిన ‘బిగ్ బాస్’ రేటింగ్? సీజన్-6 ఫెయిల్యూర్‌కు కారణాలివే!

Bigg Boss Telugu TRP: క్రేజ్ తగ్గిందా? పాతాళానికి పడిపోయిన ‘బిగ్ బాస్’ రేటింగ్? సీజన్-6 ఫెయిల్యూర్‌కు కారణాలివే!

Inaya Proposes Sohel : సోహైల్ అంటే పిచ్చి, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా - ప్రపోజ్ చేసిన 'బిగ్ బాస్' ఇనయా

Inaya Proposes Sohel : సోహైల్ అంటే పిచ్చి, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా - ప్రపోజ్ చేసిన 'బిగ్ బాస్' ఇనయా

టాప్ స్టోరీస్

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో  'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!