అన్వేషించండి
Advertisement
Posani Krishnamurali: ట్రెండింగ్ లో #JusticeforPunjabiGirl
ట్విట్టర్ లో #JusticeforPunjabiGirl అనే ట్యాగ్ టాప్ ట్రెండింగ్ లో ఉంది.
ట్విట్టర్ లో #JusticeforPunjabiGirl అనే ట్యాగ్ టాప్ ట్రెండింగ్ లో ఉంది. పంజాబ్ యువతికి న్యాయం చేయాలని నెటిజన్లు ట్విట్టర్ వేదికగా కోరుతున్నారు. పంజాబ్ అమ్మాయిని మోసం చేసిన వాడిని జైల్లో పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది. 'రిపబ్లిక్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో జనసేన పార్టీ నాయకుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి స్పందించారు.
ఎన్నో కలలతో ఓ పంజాబీ అమ్మాయి ఇండస్ట్రీకి వచ్చిందని.. తెలుగువాళ్లు మంచివాళ్లు, పరిశ్రమ మంచిదని నమ్మి వచ్చిందని అన్నారు. అలా సినిమా కోసం ప్రయత్నిస్తే.. ఓ ప్రముఖులు వేషం ఇప్పిస్తా బాగున్నావ్ అంటే నమ్మిందని.. చేరదీసి, మోసం చేసి కడుపు చేశాడని.. ఆ తరువాత అబార్షన్ చేయించి విషయం బయటపెడితే అంతుచూస్తా అంటూ బెదిరించిన విషయాలను నేను విన్నానని పోసాని అన్నారు. ఈ విషయంలో పవర్ స్టార్ న్యాయం చేయాలంటూ పోసాని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేస్తే పవన్ కళ్యాణ్ కి గుడికడతానని కూడా పోసాని చెప్పారు.
ఈ కామెంట్స్ తరువాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. పంజాబ్ యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు పెట్టాలని.. బాధితురాలికి న్యాయం చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో #JusticeforPunjabiGirl అనే ట్యాగ్ ను ట్రెండ్ చేస్తూ.. ట్వీట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు 48వేలకు పైగా ట్వీట్లు వచ్చాయి.
అత్తారింటికి దారేది సీన్ వైరల్..
మరోపక్క పోసాని చేసిన వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ క్రమంలో 'అత్తారింటికి దారేది' సినిమాలో పవన్ కళ్యాణ్.. పోసానిని చాచిపెట్టి కొట్టే సీన్ ను వైరల్ చేస్తున్నారు.
8 yrs for Industry Hit of #Powerstar @PawanKalyan - Guruji #Trivikram - @Samanthaprabhu2 @pranitasubhash @SVCCofficial @ThisIsDSP
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) September 27, 2021
(27/09/2013)#8YearsForIHAttarintikiDaredi pic.twitter.com/6LLG7zo93X
Also Read: దర్శకుడు పూరీ జగన్నాథ్ కి మైండ్ బ్లోయింగ్ విషెష్ చెప్పిన అభిమాని
Also Read: హ్యాపీ బర్త్ డే ఇస్మార్ట్ పూరీ , మందు గ్లాసుతో దర్శకుడికి బర్త్ డే విషెష్ చెప్పిన బ్యూటీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement