Happy Birthday Puri Jagannadh: దర్శకుడు పూరీ జగన్నాథ్ కి మైండ్ బ్లోయింగ్ విషెష్ చెప్పిన అభిమాని
దర్శకుడు పూరీ జగన్నాథ్ పుట్టిన రోజు సందర్భంగా ఇస్మార్ట్ గా విషెష్ చెప్పాడు ఓ అభిమాని. ఆ వీడియో ట్వీట్ చేసిన చార్మి మైండ్ బ్లోయింగ్ మ్యాన్ అని ట్వీట్ చేసింది.
ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన అభిమానం. ఎక్స్ ప్రెస్ విధానంలో కూడా ఎవరి స్టైల్ వాళ్లదే. ఈ రోజు దర్శకుడు పూరీ జగన్నాథ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ అభిమాని వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసి చార్మి...ఇది మైండ్ బ్లోయింగ్, చాలా కష్టం, ఇదెలా చేశారో తెలియజేయాలంటూ ట్వీట్ చేసింది చార్మి.
This is mind blowing and extremely tough.. pls tel me how the hell did u do this man 🙉🙆♀️🤩🙏🏻😍🤩#HbdPuriJagannadh pic.twitter.com/i3Xfb2Kq6i
— Charmme Kaur (@Charmmeofficial) September 28, 2021
ప్రస్తుతం విజయ్ దేవరకొండతో 'లైగర్' సినిమా తెరకెక్కిస్తున్నాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమాకు పూరీతో పాటూ ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తోంది. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ మరో నిర్మాత. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. అయితే పూరీ బర్త్ డే సందర్భంగా డిఫరెంట్ గా శుభాకాంక్షలు చెప్పింది చార్మీ. ‘‘నాకెంతో ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. మీరు గర్వపడేలా ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడూ నిలబెట్టుకుంటూనే ఉన్నాను’’ అంటూ చేతిలో మందుగ్లాసు పట్టుకుని తన ముందుకు కుర్చిలో కూర్చున్న పూరికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ' బద్రి' తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. అప్పటి నుంచి వరుస సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకత సొంతం చేసుకున్నాడు. స్టార్ హీరోలందరితోనూ మూవీస్ తెరకెక్కించాడు పూరీ. ముఖ్యంగా రవితేజ-పూరీ కాంబినేషన్ అదుర్స్ అని చెప్పాలి. ఇట్లు శ్రావణి సుబ్రణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి తిరుగులేని విజయాలను అందుకోవడమే కాదు రవితేజను కెరీర్ స్పీడ్ పెంచాయి కూడా. సూపర్ స్టార్ మహేష్ తో తెరకెక్కించిన 'పోకిరి' తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఆ తర్వాత 'చిరుత,' 'దేశముదురు' తో పూరీ మంచి సక్సెస్ అందుకున్నాడు. మధ్య మధ్యలో కొన్ని పరాజయాలు ఎదురై పూరీ కెరీర్ కాస్త నెమ్మదించినా పడిలేచిన కెరటంలా దూసుకొచ్చాడు. 'బుజ్జిగాడు', 'ఏక్ నిరంజన్', 'బిజినెస్ మేన్', 'ఇద్దరమ్మాయిలతో' ,' టెంపర్', 'ఇజం'.. ఇలా యంగ్ హీరోలందరితోనూ వరుస మూవీస్ తెరకెక్కించాడు పూరీ. మధ్యలో కొన్ని పరాజయాలతో పూరి కెరీర్ కాస్త నెమ్మదించనా మళ్లీ 'ఇస్మార్ట్ శంకర్' తో దూసుకొచ్చాడు.
Also Read: హ్యాపీ బర్త్ డే ఇస్మార్ట్ పూరీ , మందు గ్లాసుతో దర్శకుడికి బర్త్ డే విషెష్ చెప్పిన బ్యూటీ
Also read:మన న్యాచురల్ స్టార్ కి బాలీవుడ్ హీరో నుంచి ప్రశంసలు
Also Read:చిరుత @ 14.. రామ్ చరణ్‌కు అభిమానులు అద్భుతమైన కానుక, రెండు కళ్లు సరిపోవు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి