Shahid About Nani:మన న్యాచురల్ స్టార్ కి బాలీవుడ్ హీరో నుంచి ప్రశంసలు
పక్కింటి కుర్రాడిలా ఉండే న్యాచురల్ స్టార్ నానికి బీటౌన్ హీరో నుంచి మంచి ప్రశంసలు దక్కాయి.
నాని- గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో తెరకెక్కిన జెర్సీ సినిమా సూపర్ హిట్టైంది. నటనలో న్యాచురల్ స్టార్ అనిపించికున్న నాని ఈ సినిమాలో అంతకు మించి ప్రశంసలు అందుకున్నాడు. ఇక 'జెర్సీ' సినిమా జాతీయ అవార్డు కూడా దక్కించుకుంది. తెలుగులో సూపర్ హిట్టైన ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నాడు షాహిద్ కపూర్. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 31న విడుదల కానుంది. క్రీడల బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న మూవీ కావడంతో బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా ఇప్పటి వరకూ క్రీడల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి ఆకట్టుకోని సినిమాలు లేవనే చెప్పొచ్చు. పైగా టాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్న సినిమా కావడంతో బాలీవుడ్ లోనూ మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా నానిపై పొగడ్తలతో ముంచెత్తాడు షాహిద్.
I think @NameisNani did an amazing job in jersey. He made me cry. So I would say he inspired me to do this film. https://t.co/OrAwHkROpd
— Shahid Kapoor (@shahidkapoor) September 27, 2021
సినిమా ప్రోమోషన్లో భాగంగా క్వశ్చన్ అడిగిన వారు..నాని గురించి ఒక్క పదంలో చెప్పండి అని అడిగాడు. వెంటనే స్పందించిన షాహిద్ కపూర్ తనకు నానిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. 'జెర్సీ'లో నాని అద్బుతం అని తన నటనతో ఏడ్చేలా చేశాడని అన్నాడు. నాని నటన చూశాకే సినిమా రీమేక్ చేయాలనే ఆలోచన వచ్చిందన్నాడు షాహిద్. సేమ్ తనలాంటి నటన కనబర్చేందుకు చాలా ప్రయత్నించా అన్నాడు షాహిద్. నిన్నటికి నిన్న సమంతతో కలసి నటించాలనుందన్న షాహిద్..ఈ రోజు నాని నటనను ఆకాశానికెత్తేశాడు. గతంలో టాలీవుడ్ సినిమాలన్నా, హీరో హీరోయిన్లను కాస్త చిన్నచూపు చూసిన బాలీవుడ్ ఇప్పుడు అభిప్రాయం మార్చుకుంది. అప్పట్లో మనోళ్లు అక్కడకు బాలీవుడ్ మూవీస్ లో నటించడం గొప్పనుకుంటే ఇప్పుడు లెక్కలు మారాయ్. అడిగి మరీ తెలుగు సినిమాల్లో నటిస్తున్నవారు కొందరైతే..టాలీవుడ్ లో హిట్టైన సినిమాలు రీమేక్ లు చేసుకుంటున్నవారు మరికొందరు. ఇదంతా చూసి టాలీవుడ్ లెక్క మారిందప్పా అంటున్నారంతా.
ఇక నాని సినిమాల విషయానికి వస్తే కరోనా తర్వాత 'వి' , 'టక్ జగదీష్' సినిమాలను ఓటీటీ లో రిలీజ్ చేసిన నాని త్వరలో 'శ్యామ్ సింగరాయ్' మరియు 'అంటే సుందరానికి' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ రెండు సినిమాల నానికి మంచి సక్సెస్ తెచ్చి పెడతాయనే నమ్మకంతో ఉన్నాడు. గత రెండు సినిమాలు ఓటీటీలో విడుదలవ్వగా ఇకపై అన్నీ థియేటర్ రిలీజ్ కాబోతున్నట్లుగా నాని ఇప్పటికే ప్రకటించాడు.
Also Read: హ్యాపీ బర్త్ డే ఇస్మార్ట్ పూరీ , మందు గ్లాసుతో దర్శకుడికి బర్త్ డే విషెష్ చెప్పిన బ్యూటీ
Also Read:చిరుత @ 14.. రామ్ చరణ్‌కు అభిమానులు అద్భుతమైన కానుక, రెండు కళ్లు సరిపోవు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి