(Source: ECI/ABP News/ABP Majha)
Ram Charan: చిరుత @ 14.. రామ్ చరణ్‌కు అభిమానులు అద్భుతమైన కానుక, రెండు కళ్లు సరిపోవు..
మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 14 ఏళ్లు కావొస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 14 ఏళ్లు కావొస్తుంది. ఆయన నటించిన మొదటి సినిమా 'చిరుత' 2007, సెప్టెంబర్ 28న విడుదలైంది. మంగళవారంతో చరణ్ సినిమాల్లోకి వచ్చి 14 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆయన ఫ్యాన్స్ అంతా కలిసి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ ఏరియాలో వివిధ రంగులతో రామ్ చరణ్ ఆర్ట్‌ను గీశారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. #14YrsOfRAMCHARANEra అనే ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే దీనికి సంబంధించిన అఫీషియల్ సీడీపీను విడుదల చేశారు. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ తమ క్రియేటివిటీతో చరణ్‌కు తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.
'చిరుత' సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన రామ్ చరణ్ ఈ పద్నాలుగేళ్లలో ఎన్నో సినిమాల్లో నటించారు. రెండో సినిమాకే 'మగధీర' లాంటి సబ్జెక్ట్ ఎన్నుకొని ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు. 'రచ్చ', 'ఎవడు' లాంటి కథలతో మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఓ నటుడిగా 'ధృవ' సినిమా చరణ్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఆ తరువాత 'రంగస్థలం'తో మరో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. దీని తరువాత దర్శకుడు శంకర్‌తో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టారు.
Watch Video:
Hearty congratulations to our ROYAL @AlwaysRamCharan 🔥on completing such impeccable and glorious 14 Years of Journey in TFI
— Rastra RAM CHARAN YuvaShakthi (@RcYuvaShakthi) September 27, 2021
Thank you very much Dear #RamCharan anna for all the Entertainment, inspiration, love, everything over the years#RamCharan ❤️#14YrsOfRAMCHARANEra pic.twitter.com/tcAbWLKBZY
CDP To Celebrate 14 Yrs Of Successful Career of Mega Power Star @AlwaysRamCharan
— BA Raju's Team (@baraju_SuperHit) September 27, 2021
👉#14YrsOfRAMCHARANEra pic.twitter.com/sCVkmUUGXh
Also Read: సింహంతో వేట.. నాతో ఆట రెండూ ప్రమాదమే.. నటరాజ్ మాస్టర్ ఫైర్!
Also Read: ఓటీటీలో 'భీమ్లా నాయక్'.. క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్..
Also Read: పవన్ ‘మా’ సభ్యుడే.. ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దు: ప్రకాష్ రాజ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి