News
News
X

Pushpa Release Update: బన్నీ- లెక్కల మాస్టారు తగ్గేదే లే అన్నారు...ఇప్పుడు తగ్గక తప్పడం లేదా...మరోవైపు 80 మిలియన్ వ్యూస్ కి చేరిన 'పుష్ప' సింగిల్ సాంగ్

పుష్ప సినిమా విడుదలపై వాయిదాల పర్వం కొనసాగుతోందా...ఇప్పుడింతకీ క్రి స్మస్ బరిలో ఉన్నాట్టా-లేనట్టా. సంక్రాంతికి వస్తుందన్న ప్రచారంలో నిజమెంత...

FOLLOW US: 

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ రిలీజెస్ జాబితాలో  ఒకటి పుష్ప సినిమా. పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ చేసేందుకు బన్ని-సుకుమార్ టీమ్ సన్నాహకాల్లో ఉంది. అయితే  ఈ సినిమా  ప్రతిరోజూ రికార్డ్స్ సృష్టిస్తూనే ఉంది. పుష్ప: ది రైజ్’ లోని మొదటి పాటను ఆగస్టు 13 ఉదయం 11:07 నిమిషాలకు 5 భాషల్లో ఒకేసారి విడుదల చేసారు. దీనికి అద్భుతమైన స్పందన వస్తోంది.తెలుగులో శివం, హిందీలో విశాల్ దడ్లాని, కన్నడంలో విజయ్ ప్రకాష్, మలయాళంలో రాహుల్ నంబియార్,  తమిళంలో బెన్నీ దయాల్,  దాక్కో దాక్కో మేక పాటను ఆలపించారు. ఈ పాట ఇప్పుడు 80 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.

వాస్తవానికి ఇప్పటికే సినిమా విడుదలకావాల్సినా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడింది. అయిన లేట్ ఎలాగూ అయింది 2021 సమ్మర్లో వచ్చేద్దాం అనుకుంటే అదీ కుదర్లేదు. పోనీ దసరాకి వస్తారేమో అని కథనాలొచ్చినా అవీ తుస్సుమన్నాయి. చివరికి క్రిస్మస్ 2021 రిలీజ్ పక్కా అన్నారు. ఇది నిజమే అంటూ ట్వీట్స్ కూడా పెట్టారు. 

అయితే పుష్ప క్రిస్మన్ నాటికి విడుదల కావడం కష్టమే అని టాక్. ఎందుకంటే ఇప్పటికీ దాదాపు నెలరోజుల షూటింగ్ పెండింగ్ లో ఉందట. ముందుగా అనుకున్న లెక్క ప్రకారం సెప్టెంబర్ నెలాఖరులోగా సినిమా షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్ లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ప్రణాళిక ప్రకారం సినిమా విడుదల అసాధ్యమనే టాక్.  కొన్ని యాక్షన్ ఎపిసోడ్ లతో పాటు రెండు పెండింగ్ పాటలు చిత్రీకరించాల్సి ఉంది. దీనిని బట్టి పుష్ప చిత్రీకరణ నవంబర్ మొదటి, రెండు వారాల్లో ముగియొచ్చని అంచనా. మరి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎప్పుడు చేస్తారు, ప్రమోషన్ ఎప్పుడు చేస్తారు ఇవన్నీ కేవలం నెల రోజుల్లో సాధ్యమేనా అంటే కష్టమే మరి. ఈ లెక్కన సినిమా డిసెంబర్లో ఎలా వస్తుందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.  

పుష్ప సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచీ అన్నీ ఇన్నీ అడ్డంకులు కావు. శేషాచలం అడవుల్లో లొకేషన్లు అనుకుంటే దానికి అధికారులు అనుమతులివ్వలేదు. బ్యాంకాక్ థాయ్ లాండ్ లోని దట్టమైన అడవుల్లోకి వెళ్లాలనుకుంటే అదీ వీలుపడకుండా కరోనా బ్రేక్ వేసింది. కేరళ అడవులు అనుకున్నా అదీ కుదర్లేదు. ఎట్టకేలకు మారేడుమిల్లి అడవుల్లో ప్లాన్ చేస్తే భారీ వర్షం ఇబ్బంది పెట్టింది.కాకినాడలో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేసి మళ్లీ  మారేడుమిల్లికి యూనిట్ ని షిప్ట్ చేశారు. అరకు చింతపల్లి పరిసరాల్లోనూ షెడ్యూల్స్ చేశారు. ఇప్పటికీ వర్షాల కారణంగా బ్రేక్ తప్పడం లేదు. ఎంత త్వరగా చిత్రీకరణ పూర్తిచేయాలనుకున్నా సాధ్యపడడం లేదు. దీంతో అనుకున్న ప్రకారం క్రిస్మస్ కి సినిమా విడుదల కష్టమే అని టాక్.  ఫ‌హ‌ద్ ఫ‌ాజిల్ విల‌న్ రోల్ లో క‌నిపించ‌నుండ‌గా, ర‌ష్మీక మంద‌న్న హీరోయిన్  . దేవీశ్రీ ప్ర‌సాద్ స్వరాలు అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మస్తోంది. తాజా సమాచారం ప్రకారం  ఈ సినిమా సంక్రాంతి బ‌రిలో ఉండ‌నుందని తెలుస్తోంది. 

Also Read: దర్శకుడు పూరీ జగన్నాథ్ కి మైండ్ బ్లోయింగ్ విషెష్ చెప్పిన అభిమాని

Also Read: హ్యాపీ బర్త్ డే ఇస్మార్ట్ పూరీ , మందు గ్లాసుతో దర్శకుడికి బర్త్ డే విషెష్ చెప్పిన బ్యూటీ

Also read:మన న్యాచురల్ స్టార్ కి బాలీవుడ్ హీరో నుంచి ప్రశంసలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 28 Sep 2021 01:33 PM (IST) Tags: Allu Arjun Rashmika Sukumar Latest News Pushpa Release Update Pushpa Movie Release

సంబంధిత కథనాలు

Pawan Kalyan: ప్లాప్ డైరెక్ట‌ర్‌తో పవన్ కళ్యాణ్ సినిమా - లాంఛింగ్ కి రెడీ!

Pawan Kalyan: ప్లాప్ డైరెక్ట‌ర్‌తో పవన్ కళ్యాణ్ సినిమా - లాంఛింగ్ కి రెడీ!

Balakrishna's Unstoppable 2 Trailer : విజయవాడలో బాలకృష్ణ 'అన్‌స్టాప‌బుల్‌ 2' ట్రైలర్

Balakrishna's Unstoppable 2 Trailer : విజయవాడలో బాలకృష్ణ 'అన్‌స్టాప‌బుల్‌ 2' ట్రైలర్

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Bandla Ganesh: వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా: పవన్‌పై బండ్ల గణేష్ ట్వీట్

Bandla Ganesh: వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా: పవన్‌పై బండ్ల గణేష్ ట్వీట్

Varun Tej New Movie Update : యాక్షన్ విత్ మెసేజ్ - వరుణ్ తేజ్ సినిమా డీటెయిల్స్ చెప్పిన ప్రవీణ్ సత్తారు

Varun Tej New Movie Update : యాక్షన్ విత్ మెసేజ్ - వరుణ్ తేజ్ సినిమా డీటెయిల్స్ చెప్పిన ప్రవీణ్ సత్తారు

టాప్ స్టోరీస్

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

INDW Vs SLW, Asia Cup 2022: శ్రీలంకపై చెలరేగిన జెమీమా - ఎంత కొట్టారంటే?

INDW Vs SLW, Asia Cup 2022: శ్రీలంకపై చెలరేగిన జెమీమా - ఎంత కొట్టారంటే?

5G In India: మీ చేతిలో ఉన్న ఫోనే మీకున్న సూపర్ పవర్ - ఇది నిజం

5G In India: మీ చేతిలో ఉన్న ఫోనే మీకున్న సూపర్ పవర్ - ఇది నిజం