Sonu Sood: సామాజిక సేవలో సోనూ మరో అడుగు..శబ్దం, వాసన, రుచిని ఇకపై చక్కగా ఆస్వాదిద్దాం అన్న రియల్ హీరో
సర్వీస్ కి ఫుల్ స్టాప్ ఉండదన్న రియల్ హీరో సోనూసూద్ మరో అడుగు ముందుకేశాడు. ఈ సారి శబ్దం, వాసన, రుచి చక్కగా ఆస్వాదించేలా చేద్దాం అంటున్నాడు..
కరోనా సమయంలో వలస కూలీలు దిక్కుతోచని ఉన్న పరిస్థితుల్లో తానున్నానంటూ ముందుకొచ్చారు సోనూసూద్. అడిగినవారికి, అవసరమైనవారికి, నేరుగా అడిగినా, ఫోన్లో అడిగినా, సోషల్ మీడియా వేదికగా అడిగినా లేదన్న మాటలేకుండా తనవంతు సేవ చేశాడు. ఉచితంగా అంబులెన్స్‌ల నుంచి ఐఏఎస్, సీఏ, లా కోచింగ్‌లను అందిస్తున్న రీల్ విలన్..రియల్ హీరో సోనూ సేవా కార్యక్రమాల్లో మరో అడుగు ముందుకేశాడు. ఈసారి ఏకంగా ఉచితంగా ఈఎన్‌టీ సర్జరీలను చేయించేందుకు సిద్ధమయ్యాడు ‘సోనూ ఛారిటీ ఫౌండేషన్’ ద్వారా ఈ సేవలు అందించనున్నట్లు సోనూసూద్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపాడు.
View this post on Instagram
ఇకపై చెవి, ముక్కు, గొంతులకు సంబంధించిన ఈఎన్‌టీ ఆపరేషన్స్‌ను ఉచితంగా తన సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా అందించనున్నట్లు పేర్కొన్నాడు. ఈ సందర్భంగా సోనూ ‘ఈఎన్‌టీ సర్జరీలను ఉచితంగా ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఇకపై.. వాసన, రుచి, శబ్దం చక్కగా ఆస్వాదిద్దాం’ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఆ సేవలు ఎలా ఉపయోగించుకోవాలో దానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచాడు. ముందుగా www.soodcharityfoundation.org వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే ..ఉచితంగా అందించే ఈఎన్‌టీ సర్జరీలకు సంబంధించి వివరాలు ఉంటాయి. రిజిస్టర్ ఆప్షన్ లేదా బార్‌కోడ్ స్కాన్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అన్ని వివరాలు ఎంటర్ చేసిన సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది.
రీసెంట్‌గా సోనూ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. దాదాపు రూ.20 కోట్లు పన్ను కట్టకుండా తప్పించుకున్నారని ఐటీ అధికారులు చెప్పారు. మొత్తం 19 కోట్లు సేకరించి అందులో రెండు కోట్ల రూపాయలనే ఉపయోగించారని, మిగతా మొత్తాన్ని తన ఖాతాలోనే ఉంచుకున్నారని కూడా అధికారులు వెల్లడించారు. అయితే దీనిపై సోనూసూద్ అభిమానులు, ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవ చేస్తున్న సోనుపై ఐటీ దాడులను ఖండించారు.
Also Read: నా శ్వాస ఉన్నంత వరకూ మీరే నా దైవం..బండ్ల గణేష్ ట్వీట్ వైరల్
Also TRead: ''ఈ చెత్త మన చుట్టూ జరుగుతుందా..? ఛీ'' నాగార్జున కామెంట్స్