News
News
X

Tollywood Producers: మంత్రితో నిర్మాతల భేటీ.. డ్యామేజ్ కంట్రోల్ కోసం పాట్లు..

మచిలీపట్నంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఉన్న మంత్రి పేర్ని నానిని కలవడానికి టాలీవుడ్ నిర్మాతలంతా కలిసి వెళ్లారు.

FOLLOW US: 
 
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లు వచ్చేస్తాయనే సమయంలో పవన్ కళ్యాణ్ ఓ స్పీచ్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని చిన్నచూపు చూస్తుందని.. కావాలనే టార్గెట్ చేస్తుందని మాటల తూటాలు విసిరారు. ఈ విషయం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ తరువాత పోసాని కృష్ణమురళి రియాక్ట్ అవుతూ ప్రెస్ మీట్ మీద ప్రెస్ మీట్ పెట్టి పవన్ ని టార్గెట్ చేశారు. ఇదంతా జరుగుతుండడంతో ఇప్పట్లో టాలీవుడ్ కష్టాలు తీరవనే అనుమానాలు మొదలయ్యాయి. 
 
ఇంతలో పవన్ ఫ్యాన్స్ రంగంలోకి దిగడంతో టికెట్ రేట్ల వ్యవహారం పక్కకు వెళ్లిపోతుందేమోనని భయపడ్డారు. అందుకే ఇప్పుడు డ్యామేజ్ కంట్రోన్ కోసం టాలీవుడ్ నిర్మాతలు కొందరు ఆంధ్రాకు బయలుదేరారు. మంత్రి పేర్ని నాని అపాయింట్ మెంట్ కోరి మరీ తీసుకున్నారు. ఇప్పటికే కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని సినీ ప్రముఖులతో సమావేశమయ్యారు. ఆన్‌లైన్‌ పద్ధతిలో సినిమా టికెట్ల విక్రయాలపై టాలీవుడ్‌ నిర్మాతల బృందంతో చర్చించారు. 
 
ఇప్పుడు మరోసారి మంత్రితో మీటింగ్ కు భేటీ అయ్యారు టాలీవుడ్ నిర్మాతలు. మచిలీపట్నంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జరిగిన సమావేశానికి నిర్మాత దిల్‌ రాజు, డీవీవీ దానయ్య, బన్నీ వాసు, సునీల్‌ నారంగ్‌, వంశీరెడ్డి, మైత్రీ మూవీ మేకర్స్‌ నవీన్‌ తదితరులు పాల్గొన్నారు. ఏదోక విధంగా మంత్రిని కన్విన్స్ చేసుకొని టికెట్ రేట్లు పెంచుకోవాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇస్తున్న సమయంలో దిల్ రాజు పడిపడి నవ్వారు. ఈ విషయం వైకాపా అధిష్టానం వరకు వెళ్లిందని టాక్. మరి ఇప్పుడు పేర్ని నాని.. దిల్ రాజు, ఇతర నిర్మాతల రిక్వెస్ట్ లను కన్సిడర్ చేస్తారో లేదో చూడాలి!
 
Published at : 29 Sep 2021 03:48 PM (IST) Tags: AP government minister perni nani Tollywood Producers Ticket rate issue

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నది ఆదిరెడ్డి కాదు శ్రీహాన్?

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నది ఆదిరెడ్డి కాదు శ్రీహాన్?

Gruhalakshmi December 3rd: లాస్యని ఫుట్ బాల్ ఆడుకున్న తోడికోడళ్ళు- బస్సెక్కడానికి సామ్రాట్ తిప్పలు

Gruhalakshmi December 3rd: లాస్యని ఫుట్ బాల్ ఆడుకున్న తోడికోడళ్ళు- బస్సెక్కడానికి సామ్రాట్ తిప్పలు

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Cirkus trailer: రణ్ వీర్ కామెడీ, పూజా సీరియస్, దీపిక స్పెషల్ సాంగ్,నవ్వుల పువ్వులు పూయిస్తున్న ‘సర్కస్’ ట్రైలర్

Cirkus trailer: రణ్ వీర్ కామెడీ, పూజా సీరియస్, దీపిక స్పెషల్ సాంగ్,నవ్వుల పువ్వులు పూయిస్తున్న ‘సర్కస్’ ట్రైలర్

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

టాప్ స్టోరీస్

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు  గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Viral News: గురివింద మొక్క నాగుపాము కంటే డేంజర్ అంటే నమ్ముతారా!

Viral News: గురివింద మొక్క నాగుపాము కంటే డేంజర్ అంటే నమ్ముతారా!

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

TS News Developments Today: తెలంగాణలో ఇవాళ ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటంటే?

TS News Developments Today: తెలంగాణలో ఇవాళ ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటంటే?