Pushpa Update: పట్టుచీర, మల్లెపూలు...పుష్పలో రష్మిక ఫస్ట్ లుక్ అదిరిపోలా..!
ఇప్పటి వరకూ గొడ్డలి, కొడవలితో ఊరమాస్ గా కనిపించిన పుష్పరాజ్ కి అమ్మాయిని, పూలు చూపించాడు దర్శకుడు. ఈ మూవీకి సంబంధించి తాజాగా విడుదల చేసిన రష్మిక పోస్టర్ భలే ఉంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న సినిమా 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. బన్నీకి జోడీగా రష్మిక నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను #SoulmateOfPushpa పేరుతో చిత్రబృందం విడుదల చేసింది. రష్మిక శ్రీవల్లి అనే పాత్రలో కనిపించనుంది. అమ్మడు డీ గ్లామర్ రోల్ పోషిస్తోందని తెలిసినప్పటికీ పోస్టర్ తో మరింత క్లారిటీ ఇచ్చింది మూవీ యూనిట్. అప్పుడే పట్టు చీర కట్టుకుని చెవులకు దిద్దులు పెట్టుకుంటున్న లుక్.. పల్లె పడుచు భంగిమలా ఉంది.
#Srivalli song release works in progress! More details soon ❤️🎶😍#SoulmateOfPushpa#PushpaTheRise#ThaggedheLe#Pushpa @alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @resulp @adityamusic @PushpaMovie pic.twitter.com/sigDgenvxY
— Mythri Movie Makers (@MythriOfficial) September 29, 2021
అయితే సినిమా వాయిదా పడుతుందనే వార్తలకు క్లారిటీ ఇస్తూ క్రిస్మస్ కానుకగా 'పుష్ప' అంటూ పోస్టర్లో వేయడం ఇంట్రెస్టింగ్. వాస్తవానికి ఇప్పటికే సినిమా విడుదలకావాల్సినా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడింది. అయిన లేట్ ఎలాగూ అయింది 2021 సమ్మర్లో వచ్చేద్దాం అనుకుంటే అదీ కుదర్లేదు. దసరా విడుదల కూడా కుదర్లేదు. క్రిస్మస్ 2021 రిలీజ్ పక్కా అని చెప్పినప్పటికీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడంతో కుదిరేలా లేదనే వార్తలొచ్చాయి. కానీ తాజాగా విడుదల చేసిన రష్మిక పోస్టర్లో క్రిస్మస్ 2021 అని ఉండడంతో బన్నీ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. పాన్ ఇండియా కేటగిరీలో తెలుగు,తమిళం,మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది పుష్ప. బన్నీ ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో కనిపించనుండగా గిరిజన యువతి పాత్రలో రష్మిక నటిస్తోందని యూనిట్ రివీల్ చేసింది. ఇప్పటికే ఈ రెండు పాత్రల ఫస్ట్ లుక్ లు ఆకట్టుకున్నాయి.
Srivalli 🔥❤️#PushpaTheRise #ThaggedheLe 🤙@alluarjun @aryasukku @ThisIsDSP @adityamusic @PushpaMovie @MythriOfficial pic.twitter.com/kz8iGxavaQ
— Rashmika Mandanna (@iamRashmika) September 29, 2021
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా..దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, ఇంట్రడ్యూసింగ్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన దాక్కో దాక్కో మేక సాంగ్ యూట్యూబ్‌లో రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే.ఇందులో మళయాలం నటుడు ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నాడు.
Also Read: సామాజిక సేవలో సోనూ మరో అడుగు..శబ్దం, వాసన, రుచిని ఇకపై చక్కగా ఆస్వాదిద్దాం అన్న రియల్ హీరో
Also Read: నా శ్వాస ఉన్నంత వరకూ మీరే నా దైవం..బండ్ల గణేష్ ట్వీట్ వైరల్
Also TRead: ''ఈ చెత్త మన చుట్టూ జరుగుతుందా..? ఛీ'' నాగార్జున కామెంట్స్