Pawan Kalyan Vs Posani: పవన్, పోసాని వివాదంపై స్పందించిన నాగబాబు.. ఫన్నీ మీమ్స్‌తో సమాధానం
పవన్ కళ్యాన్, పోసాని వివాదంపై.. నాగబాబు ఫన్నీగా స్పందించారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు మీమ్స్ ద్వారా సమాధానం ఇచ్చారు.
సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అందరికన్నా గట్టిగా రియాక్టయ్యారు పోసాని కృష్ణమురళి. పవన్ ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే.. పోసాని ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోసాని వ్యాఖ్యలపై పవన్ అభిమానులతో పాటూ ఇండస్ట్రీకి చెందిన కొందరు తీవ్రంగా స్పందిస్తున్నారు. దారుణమైన బూతులతో పవన్‌ను కించపరిచిన పోసానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే నాగబాబు కూడా రియాక్టైనప్పటికీ ఫన్నీ మీమ్స్‌తో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
ఇన్స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మీ’ అంటూ చిట్ చాట్ పెట్టిన నాగబాబు.. పవన్ మీద పోసాని అసభ్యకరమైన పదజాలంతో విరుచుకుపడిన విషయంపై వచ్చిన ప్రశ్నలకు ఫన్నీ మీమ్స్‌తో సమాధానమిచ్చారు. ‘‘మళ్లీ పాలిటిక్స్ లోకి వస్తారా అంకుల్’’ అనే ప్రశ్నకు.. ‘‘నాకు ఇంట్రెస్ట్ పోయింది’’ అనే మీమ్‌తో జవాబు ఇచ్చారు. ‘‘పోసాని గురించి ఒక్క మాట’’ అని అడగగా.. ‘సమరసింహారెడ్డి’ లో ‘‘కుక్క మొరిగిందనుకో’’ అని బాలయ్య చెప్పే సన్నివేశం ఫొటో పోస్ట్ చేశారు. ‘‘పవన్ స్పీచ్‌పై మీ స్పందన ఏమిటి?’’ అని ప్రశ్నించగా.. ‘కింగ్’ చిత్రంలో బ్రహ్మానందాన్ని శ్రీహరి కొట్టిన తీరును శ్రీనివాసరెడ్డి వివరించే వీడియోని పోస్ట్ చేశారు.
‘‘పవన్ కల్యాణ్ మేటర్ మాట్లాడు అన్నా’’ అని ఓ నెటిజన్ అడిగితే.. గతంలో పవన్ గురించి పోసాని కృష్ణమురళి మాట్లాడిన ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘‘పవన్ కల్యాణ్ ఈ రోజు మళ్లీ సినిమా హీరోగా యాక్ట్ చేస్తానంటే.. నేను అతనికి బ్లాంక్ చెక్ ఇస్తా. ఎన్ని సున్నాలైనా పెట్టుకోవచ్చు. అంత డిమాండ్ ఉన్న హీరో. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు ఇండియాలోని టాప్ హీరోల్లో అతనొకరు. అతను ఐదు కోట్లు పది కోట్ల కోసం లంగా పనులు చేయడు. నాకు తెలుసు'' అని పోసాని ఈ వీడియోలో మాట్లాడారు.
‘‘మీరు ఏ బ్రాండ్ తాగుతారు?’’ అంటే.. ఆంధ్రప్రదేశ్ లో దొరికే ‘‘ప్రెసిడెంట్ మెడల్ - ఆంధ్రా గోల్డ్ - గెలాక్సీ - బూమ్ బూమ్’’ వంటి బ్రాండ్స్ ఫొటోలను పోస్ట్ చేశారు. ‘‘ఏపీ మూవీ టికెట్స్ గురించి మీ అభిప్రాయం ఏమిటి?’’ అని అడగగా.. ‘విక్రమార్కుడు’ చిత్రంలో రవితేజ - బ్రహ్మానందం మోసాలు చేసి డబ్బులు పంచుకునే సీన్ ని పోస్ట్ చేశారు. ‘‘ఫేడ్ అవుట్ అయిన వాళ్ళు మీడియాలో కనిపించడానికి పీకే ని విమర్శిస్తున్నారంట?’’ అని అడిగితే.. '‘బయట టాక్’’ అని అతడు సినిమాలోని బ్రహ్మానందం ఫోటో పెట్టారు. లైఫ్‌లో సక్సెస్ అవ్వాలంటే.. ‘‘న్యూస్ ఛానల్స్ చూడటం మానేసేయ్ బ్రో’’ అని నాగబాబు అన్నారు.
తాజాగా పోసానిపై జనసేన మహిళానేతల వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పోసాని కృష్ణమురళిని మానసిక రోగిగా అభివర్ణించిన జనసేన నేత నిహారిక ఆయనను మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలంది. పవన్ కళ్యాణ్ సినిమా వేదికపై ఆడవాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని... పోసానిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ని పవన్ విమర్శించారనే పోసాని అలా విరుచుకుపడుతున్నారని మండిపడ్డారు. మంగళవారం ప్రెస్ మీట్ పెట్టిన పోసాని..పవన్ కల్యాణ్ పై పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవిని టీడీపీ నేతలు తిడితే పవన్ కల్యాణ్ ఎటు పోయారని ప్రశ్నించారు. చిరంజీవి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వారు తిడితే.. తానే కౌంటర్ ఇచ్చానని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ పెంచుకుంటున్న స్పెషల్ ఫ్యాన్స్ కొంతమంది సైకోలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డాడు. వేల మెసేజీలు పెడుతున్నారని, బూతులు తిడుతున్నారని చెప్పాడు. పవన్ ప్రెస్ మీట్ పెట్టి తన అభిమానులకు స్పష్టమైన సందేశం ఇవ్వకపోతే తానూ కుటుంబ సభ్యుల జోలికి వెళ్తానని హెచ్చరించార పోసాని. మరోవైపు పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపైనా మాట్లాడటంతో ప్రెస్ మీట్ వద్దకు భారీగా చేరుకున్న పవన్ అభిమానులు నిరసన తెలిపారు. మొత్తానికి ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి...
Also Read: పట్టుచీర, మల్లెపూలు...పుష్పలో రష్మిక ఫస్ట్ లుక్ అదిరిపోలా..!
Also Read: నా శ్వాస ఉన్నంత వరకూ మీరే నా దైవం..బండ్ల గణేష్ ట్వీట్ వైరల్
Also Read: సామాజిక సేవలో సోనూ మరో అడుగు..శబ్దం, వాసన, రుచిని ఇకపై చక్కగా ఆస్వాదిద్దాం అన్న రియల్ హీరో