Radhe Shyam: 'ఆర్ఆర్ఆర్'తో పోటీ.. తగ్గేదే లేదంటున్న ప్రభాస్..
ఉన్నట్టుండి 'ఆర్ఆర్ఆర్' సినిమా సంక్రాంతి బరిలోకి దింపుతున్నామని ఫీలర్లు వదులుతున్నారు. దాంతో సంక్రాంతి బరిలో ఇప్పటికే దిగాలనుకుంటున్న సినిమాలు కిందా మీదా అవుతున్నాయి.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' సినిమా ఈపాటికే ప్రేక్షకుల ముందు రావాలి. కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడడం, ఇతర కారణాల వలన సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. కొన్నిరోజుల క్రితం దసరా కానుకగా విడుదల చేస్తామని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో మిగిలిన సినిమాలన్నీ దసరాను వదిలేసి సంక్రాంతికి వెళ్లాయి. కానీ ఇప్పుడు మళ్లీ 'ఆర్ఆర్ఆర్' పోస్ట్ పోన్ అయింది. సడెన్ గా సంక్రాంతి బరిలోకి దిగుతున్నామని ఫీలర్లు వదులుతున్నారు. దాంతో సంక్రాంతి బరిలో ఇప్పటికే సినిమాను విడుదల చేయాలనుకున్న సినిమాలు లబోదిబోమంటున్నాయి.
Also Read: పేద కళాకారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు.. బండ్ల గణేష్ ‘మా’ హామీ!
మహేష్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారు పాట' సంక్రాంతి బరిలో ఉండకపోవచ్చని టాక్ నడుస్తోంది. నాగార్జున నటిస్తోన్న 'బంగార్రాజు' సినిమా సంక్రాంతికి విడుదల చేయాలి. జీ సంస్థతో అగ్రిమెంట్ లో ఆ పాయింట్ మెన్షన్ చేశారు. పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్', ప్రభాస్ 'రాధేశ్యామ్' రెండు సినిమాలు కూడా 'ఆర్ఆర్ఆర్'ను ఢీ కొడతాయో..? తప్పుకుంటాయో..? అనే విషయంలో సందేహాలు కలుగుతున్నాయి. 'భీమ్లా నాయక్' సంగతేమో కానీ 'రాధేశ్యామ్' సినిమా మాత్రం వెనక్కి తగ్గకూడదని ఫిక్స్ అయిందట.
ఎట్టిపరిస్థితుల్లో సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించుకుంది. అంటే సంక్రాంతికి 'ఆర్ఆర్ఆర్' సోలోగా దిగడం లేదని స్పష్టమవుతోంది. మరి 'రాధేశ్యామ్' రిలీజ్ విషయంలో ఇంత పక్కాగా ఉన్న తరువాత 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఏం చేస్తుందో చూడాలి మరి!
#RadheShyam release date remains unaffected, film to release on 14th January 2022 #Prabhas @hegdepooja @director_radhaa @UV_Creations @UVKrishnamRaju #Vamshi #Pramod @justin_tunes @RadheShyamFilm #RadheShyamOnJan14th pic.twitter.com/41l4GaBSu1
— BA Raju's Team (@baraju_SuperHit) September 29, 2021
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి