Harini Rao: ఆ హరిణి వేరు... ఈ హరిణి వేరు! హరిణి పేరుతో ముగ్గురు ఉండటంతో కన్‌ఫ్యూజన్!
సింగర్స్‌లో హరిణి పేరుతో ముగ్గురు ఉన్నారు. దాంతో ఓ హరిణి తండ్రి మరణిస్తే... మరో హరిణి ఫొటోను ఉపయోగించడంతో అసలు ఏం జరిగిందో తెలియక చాలా మందిలో కన్‌ఫ్యూజన్ ఏర్పడింది.
గాయని హరిణీ రావు తండ్రి ఎ.కె. రావు మృతదేహం బెంగళూరులోని రైలు పట్టాలపై లభించింది. ఆమె కుటుంబం అదృశ్యమై వారం రోజులు అయ్యిందని, ఎ.కె. రావు మరణించి రెండు రోజులు అయ్యిందని సమాచారం. దాంతో హరిణీ రావు ఫ్యామిలీకి ఏమైంది? వారం రోజులుగా ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారు? వాళ్ల ఫ్యామిలీకి వచ్చిన సమస్యలు ఏంటి? వంటివి ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నలుగా మిగిలాయి.
View this post on Instagram
హరిణి టిప్పు
హరిణి పేరుతో ముగ్గురు సింగర్స్ ఉన్నారు. హరిణీ రావు తండ్రి మరణించారు. ఆమె కుటుంబం అదృశ్యంలో ఉంది. అయితే... హరిణీ రావుకు బదులు మరో గాయని, గాయకుడు టిప్పు సతీమణి హరిణి ఫొటోను కొందరు ఉపయోగించారు. సోషల్ మీడియాలో సైతం ఆమె కుటుంబం అదృశ్యంలో ఉండనే పోస్టులు కనిపించాయి. హరిణీ టిప్పు, హరిణీ రావు ఒక్కటి కాదని తెలిసిన తర్వాత... ఇటీవల 'రాధే శ్యామ్'లో 'ఈ రాతలే...' పాట పాడిన హరిణీ ఇవటూరి తండ్రి మరణించారని, ఆమె కుటుంబం అదృశ్యమైందని కొందరు భావించారు. అయితే... ఎ.కె. రావు కుమార్తె హరిణి వేరు, ఈ హరిణి వేరు. ఈ విషయంలో హరిణీ ఇవటూరి కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చారు.
View this post on Instagram
హరిణి ఇవటూరి
అసలు, హరిణీ రావు కుటుంబానికి ఏమైందనే వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఆమె కుటుంబం నివసిస్తోంది. వారం రోజులుగా కనిపించడం లేదట. బెంగళూరులో రైలు పట్టాలపై ఎ.కె. రావు మృతదేహం లభించడం, పోలీస్ అధికారులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడంతో... ఆయన్ను ఎవరు చంపారు? ఏమైంది? అనేది మిస్టరీగా మారింది. హరిణీ రావు కుటుంబం ఎక్కడ ఉందో తెలియాల్సి ఉంది.
Also Read: దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !
Also Read: టాలీవుడ్ మీడియాకు 'జనని...' సాంగ్ చూపించిన రాజమౌళి... ఎలా ఉందంటే?
Also Read: కాష్మోరా ప్రయోగిస్తున్న రామ్ గోపాల్ వర్మ.. 'తులసీ దళం' కి మించి 'తులసి తీర్థం'.
Also Read: శివ శంకర్ మాస్టర్‌కు సోనూసూద్ భరోసా.. నేను సాయం చేస్తా!
Also Read: సముద్రం అడుగున హోటల్ గదిలో పూజా హెగ్డే.. ఆ అందాలను చూస్తే మతి పోతుంది!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి