RRR Janani Song: టాలీవుడ్ మీడియాకు 'జనని...' సాంగ్ చూపించిన రాజమౌళి... ఎలా ఉందంటే?
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'లో 'జనని...' సాంగ్ శుక్రవారం విడుదల కానుంది. అయితే, ఒక్క రోజు ముందు ఆ పాటను టాలీవుడ్ మీడియాకు రాజమౌళి చూపించారు. అది ఎలా ఉందంటే?
దర్శక ధీరుడు రాజమౌళి విజన్‌ను ఫర్‌ఫెక్ట్‌గా అర్థం చేసుకునే వ్యక్తుల్లో... ఆయన పెద్దన్న, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఒకరు. 'ఆర్ఆర్ఆర్ రౌద్రం రణం రుధిరం' సినిమానూ బాగా అర్థం చేసుకున్నారు. అంతే కాదు... సన్నివేశాలు చూసి ఓ నేపథ్య గీతాన్ని రూపొందించారు. అదే 'జనని...' సాంగ్. తొలుత ఈ పాటను అనుకోలేదని, నేపథ్య సంగీతంలో భాగంగా వచ్చిందని రాజమౌళి తెలిపారు. ఈ పాటను కీరవాణి రాశారు. ఆయనే పాడారు. శుక్రవారం ఈ పాటను విడుదల చేస్తున్నారు. అయితే, టాలీవుడ్ మీడియాకు గురువారం హైదరాబాద్‌లో స్పెషల్‌గా సాంగ్‌ను చూపించారు రాజమౌళి. ఈ పాట ఎలా ఉందంటే...
స్వరాజ్యం కోసం పోరాటం చేస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, అజయ్ దేవగణ్... అజయ్ భార్యగా శ్రియ ఈ పాటలో కనిపిస్తారు. పాట నిడివి తక్కువే... కానీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకూ ఎమోషనల్‌గా సాగుతుంది. సాంగ్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ కనిపిస్తారు. వెంటనే నెక్స్ట్ ఫ్రేమ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్. టీజర్‌లో రామ్ చరణ్‌ను రెడ్ కలర్ డ్రస్‌లో చూపించారు కదా! ఎక్కువ ఆ గెటప్‌లో కనిపిస్తారు. ముస్లిం యువకుడి ఆహార్యంలోనూ, సాధారణ డ్రస్‌లోనూ ఎన్టీఆర్ కనిపించారు. నటన పరంగా ఇద్దరూ ఇరగదీశారు.
'జనని...' సాంగ్ అంతా ఎమోషనల్‌గా సాగింది. కీరవాణి సాహిత్యం కూడా! ఆయన రాసిన సాహిత్యాన్ని చదవడం కంటే పాటలో వింటే బావుంటుంది. అందుకని, ఇక్కడ ఇవ్వడం లేదు. అయితే... రామ్ చరణ్ నుదుట ఆలియా భట్ తిలకం దిద్దే దృశ్యం, నెత్తిన ఎన్టీఆర్ ముస్లిం టోపీ తీయడంతో పాటు ఆయన భావోద్వేగానికి గురయ్యే సన్నివేశం ప్రేక్షకుల హృదయాలను తాకడం ఖాయం. శ్రియతో అజయ్ దేవగణ్ సంభాషణ సైతం ఆకట్టుకుంటుంది. 'నేను నా పోరాటం... అందులో నువ్వు సగం' అని అజయ్ దేవగణ్ ఓ డైలాగ్ చెబుతారు. ఇక, కీరవాణి 'జనని...' అని పాడుతున్న సమయంలో అజయ్ దేవగణ్ రొమ్ము విరిచి నిలబడే దృశ్యం అయితే పీక్స్ అని చెప్పాలి. ఒక్క పాటతో సినిమా ఆత్మ ఏమిటన్నది రాజమౌళి చూపించారు.
డి.వి.వి. దానయ్య నిర్మించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
Also Read: కాష్మోరా ప్రయోగిస్తున్న రామ్ గోపాల్ వర్మ.. 'తులసీ దళం' కి మించి 'తులసి తీర్థం'.
Also Read: శివ శంకర్ మాస్టర్‌కు సోనూసూద్ భరోసా.. నేను సాయం చేస్తా!
Also Read: 'నగలు తిరిగిచ్చేయ్'.. ఆ లెటర్ నిజంగానే ఉదయ్ కిరణ్ రాశాడా..?
Also Read: పబ్ లో టేబుల్ పైకెక్కి డాన్స్ లు.. 'ఆర్మీ ఆఫీసర్ అనే విషయం మర్చిపోయిందా..?'
Also Read: డిసెంబర్ బరిలో మరో యంగ్ హీరో.. డేట్ లాక్ చేసేసుకున్నాడు..
Also Read: 'సిద్ధ' వచ్చేది అప్పుడే.. మెగాపవర్ మాస్.. రెడీగా ఉండండి..
Also Read: సముద్రం అడుగున హోటల్ గదిలో పూజా హెగ్డే.. ఆ అందాలను చూస్తే మతి పోతుంది!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి