Acharya Update: 'సిద్ధ' వచ్చేది అప్పుడే.. ఊరించి ఉసూరుమనిపించిన ‘ఆచార్య’ టీమ్
ఆచార్య సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. చిరంజీవితో కలిసి నటిస్తున్న రామ్ చరణ్ ఇందులో సిద్ధగా ఆకట్టుకోనున్నాడు.
![Acharya Update: 'సిద్ధ' వచ్చేది అప్పుడే.. ఊరించి ఉసూరుమనిపించిన ‘ఆచార్య’ టీమ్ Update about Ram Charans' Character in Acharya Movie Acharya Update: 'సిద్ధ' వచ్చేది అప్పుడే.. ఊరించి ఉసూరుమనిపించిన ‘ఆచార్య’ టీమ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/24/96b936cd093183689099e8f25a8f5c5e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా 'ఆచార్య'. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. దసరా కానుకగా విడుదల కావాలనుకున్న ఈ సినిమా ఇప్పుడు 2022 ఫిబ్రవరికి వెళ్లింది. ఫిబ్రవరి 4న సినిమాను విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో ఇప్పటినుంచే ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, రెండు పాటలను విడుదల చేశారు. ఇందులో 'లాహే లాహే' అనే పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. తాజాగా చిత్రబృందం మరో అప్డేట్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ 'సిద్ధ' అనే పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పోస్టర్స్ కూడా వదిలారు. అయితే తాజాగా సినిమాలో ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఓ టీజర్ ను విడుదల చేయనున్నారు.
దీన్ని నవంబర్ 28న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మెగాస్టార్ మాస్ ను చూశారని.. ఇప్పుడు మెగా పవర్ స్టార్ మాస్ ని చూడడానికి రెడీ అవ్వమంటూ.. డేట్ ను లాక్ చేశారు. ఈ సినిమాలో చరణ్ క్యారెక్టర్ ఓ రేంజ్ లో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలు నటిస్తున్నారు. సోనూసూద్, జిషు షేన్ గుప్తా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.
You have witnessed the Megastar's Mass 😎
— Konidela Pro Company (@KonidelaPro) November 24, 2021
Now the clock is set for Mega Powerstar 💥#SiddhasSaga on Nov 28th.#Acharya #AcharyaOnFeb4th
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma #NiranjanReddy @MatineeEnt @KonidelaPro pic.twitter.com/6sCCZ9eZ3Q
Also Read: పబ్ లో టేబుల్ పైకెక్కి డాన్స్ లు.. 'ఆర్మీ ఆఫీసర్ అనే విషయం మర్చిపోయిందా..?'
Also Read: స్కైలాబ్ పోస్టర్తో ఫోటో దిగి పంపిస్తే... బిగ్ సర్ప్రైజ్ ఇస్తానంటున్న నిత్యా మీనన్
Also Read: సాయి పల్లవి చెల్లెలి సినిమా విడుదలకు సిద్ధం... త్వరలో తెలుగులో కూడా నటించే అవకాశం
Also Read: ఆ నవమన్మథుడే ఈ చిన్న బంగార్రాజు.. టీజర్తో వచ్చేసిన బర్త్డే బాయ్ నాగ చైతన్య
Also Read: 'కె.జి.యఫ్' రేంజ్లో NTR31... ఆ సినిమా గురించి ఎన్టీఆర్ ఏమన్నారంటే?
Also Read: నాటు నాటు... ఆ స్టెప్పులు అంత ఈజీ ఏం కాదు! ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎన్ని టేక్స్ తీసుకున్నారంటే?
Also Read: 'రిపబ్లిక్' సినిమాను థియేటర్లో చూడని సాయితేజ్.. తొలిసారి ఓటీటీలోనే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)