RRR Naatu Naatu song: ఆ స్టెప్పులు అంత ఈజీ ఏం కాదు! ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎన్ని టేక్స్ తీసుకున్నారంటే?
'నాటు నాటు...' సాంగ్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టెప్స్ సూపర్ అంటున్నారంతా! పర్ఫెక్ట్ సింక్‌లో చేశారని ప్రశంసిస్తున్నారు. ఆ పర్ఫెక్షన్ కోసం ఇద్దరూ ఎన్ని టేక్స్ తీసుకున్నారో తెలుసా?
'నా పాట సూడు... నా పాట సూడు... వీర నాటు... ఊర నాటు' అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టెప్పులు వేస్తుంటే... ఆడియన్స్ అలా చూస్తూ ఉన్నారు. అందుకనే, ఆ పాటకు ఆల్రెడీ దగ్గర దగ్గర 40 మిలియన్ వ్యూస్ వచ్చాయి. పాటకు ఎం.ఎం. కీరవాణి అందించిన బాణీ, చంద్రబోస్ సాహిత్యం ఓ ఎత్తు అయితే... ఎన్టీఆర్, రామ్ చరణ్ వేసిన స్టెప్పులు మరో ఎత్తు. హీరోలు ఇద్దరూ పర్ఫెక్ట్ సింక్‌లో స్టెప్స్ వేశారని ప్రేక్షకులు, అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇద్దరి మధ్య సింక్ ఎక్కువ హైలైట్ అవుతోంది. అయితే... ఆ స్టెప్పులు వేయడానికి ఇద్దరూ బాగానే కష్టపడ్డారు. ఎన్ని టేక్స్ తీసుకున్నారో తెలుసా?
"ఓ టేక్ తర్వాత మరో టేక్... చేస్తూనే ఉన్నాం. కాలు ముందుకు, వెనక్కి, పక్కకి కదుపుతూ వేసే స్టెప్ అయితే... 15 నుంచి 18 టేక్స్ తీసుకుంది. సింక్‌లో స్టెప్ వేసే వరకూ చేయిస్తూ ఉన్నాడు. స్టెప్ రికార్డ్ చేసిన తర్వాత వెనక్కి వెళ్లి ఫ్రేమ్ ఫ్రీజ్ చేసి... మా ఇద్దరి కాళ్లు, చేతులు ఎలా కదిలాయో చెక్ చేసేవాడు. సింక్‌లో ఉన్నయా? లేదా? అని. సాంగ్ రిలీజైన తర్వాత ఆడియన్స్ కామెంట్స్ చదివా. అందరూ మా స్టెప్స్ మధ్య సింక్ గురించి మాట్లాడారు" అని ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'నాటు నాటు...' పాట, అందులో స్టెప్స్ గురించి ఎన్టీఆర్ వివరించారు.
ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ జోడీగా ఆలియా భట్... కీలక పాత్రల్లో అజయ్ దేవగణ్, శ్రియ, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని, అలీసన్ డూడీ, రే స్టీవెన్ సన్ తదితరులు నటించిన ఈ సినిమా జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. డి.వి.వి. దానయ్య సినిమాను నిర్మించారు.
Also Read: 'భీమ్లా నాయక్' గురించి త్రివిక్రమ్ ఇచ్చిన లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Also Read: ప్రియాంక చోప్రా విడాకులు తీసుకోబోతుందా..? ప్రూఫ్ చూపిస్తోన్న నెటిజన్లు..
Also Read: బాలకృష్ణతో కామెడీ సినిమా చేయనంటున్నారు! ఆయన మాస్ ఇమేజ్‌కు తగ్గట్టు...
Also Read: జనని... 'ఆర్ఆర్ఆర్'లో మూడో పాట విడుదలయ్యేది ఎప్పుడంటే?
Also Read: హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన బిగ్‌బాస్ బ్యూటీ... తెలుగులో ఓ సినిమా, మాతృభాషలో మరో రెండు!
Also Read: సందీప్ కిషన్ - విజయ్ సేతుపతి పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా ఫేమస్ తమిళ దర్శకుడు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి