By: ABP Desam | Updated at : 23 Nov 2021 08:27 AM (IST)
త్రివిక్రమ్, పవన్ కల్యాణ్
'అల... వైకుంఠపురములో' వంటి విజయవంతమైన సినిమా తర్వాత త్రివిక్రమ్ పని చేస్తున్న సినిమా 'భీమ్లా నాయక్'. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయన స్క్రీన్ ప్లే, సంభాషణలు అందిస్తున్న సంగతి తెలిసిందే. 'లా... లా... భీమ్లా...' సాంగ్ కూడా రాశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో ఉన్న అనుబంధం కారణంగా... దర్శకుడిగా తన తదుపరి సినిమా ప్రారంభించడానికి ముందు 'భీమ్లా నాయక్'కు వర్క్ చేస్తున్నారు. లేటెస్టుగా ఈ సినిమా గురించి ఆయన ఓ అప్ డేట్ ఇచ్చారు.
త్రివిక్రమ్ ఓ ఈవెంట్‌కు అటెంట్ అయ్యారు. అక్కడ భీమ్లా నాయక్ గురించి చెప్పమని ఓ అభిమాని కోరగా... "సినిమా ఆల్మోస్ట్ అయిపొయింది. లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇప్పుడు నేను అక్కడి నుంచే వచ్చాను. బాగా చదువుకోండి. ఖాళీ సమయాల్లో సినిమా చూడండి. ఎంజాయ్ చేయండి. బీ సేఫ్. స్టే సేఫ్. కరోనా ఫ్రీ వరల్డ్ రావాలని ఆశిద్దాం" అని త్రివిక్రమ్ తెలిపారు.
సంక్రాంతి సందర్భంగా జనవరి 12న 'భీమ్లా నాయక్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వస్తున్న వార్తలను యూనిట్ కొట్టిపారేస్తోంది. 'ఈసారి కూడా మిస్ అవ్వదు' అని ఇటీవల నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు. అందులోనూ జనవరి 12న విడుదల అని మరోసారి స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా దగ్గుబాటికి జంటగా సంయుక్తా మీనన్ నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. త్రివిక్రమ్ రాసిన 'లా... లా... భీమ్లా' సాంగ్ వ్యూస్ 20 మిలియన్స్ దాటాయి.
The super massy track #LalaBheemla hits 20 M+ views & Trending on @youtubemusic🎶
— Sithara Entertainments (@SitharaEnts) November 18, 2021
► https://t.co/nLPbCgb3Zw
Music by @MusicThaman ⚡🥁#BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @iamsamyuktha_ @arun_kaundinya @vamsi84 @adityamusic pic.twitter.com/4m7sF8Dqmm
Also Read: ప్రియాంక చోప్రా విడాకులు తీసుకోబోతుందా..? ప్రూఫ్ చూపిస్తోన్న నెటిజన్లు..
Also Read: బాలకృష్ణతో కామెడీ సినిమా చేయనంటున్నారు! ఆయన మాస్ ఇమేజ్‌కు తగ్గట్టు...
Also Read: జనని... 'ఆర్ఆర్ఆర్'లో మూడో పాట విడుదలయ్యేది ఎప్పుడంటే?
Also Read: హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన బిగ్‌బాస్ బ్యూటీ... తెలుగులో ఓ సినిమా, మాతృభాషలో మరో రెండు!
Also Read: సందీప్ కిషన్ - విజయ్ సేతుపతి పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా ఫేమస్ తమిళ దర్శకుడు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
Bigg Boss Season 7 Latest Promo: డైరెక్ట్ ఇంటికి పంపించేయడం బెటర్ - నాగార్జున ముందే తేజపై సందీప్ వ్యాఖ్యలు
Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో
‘కేజీయఫ్ 3’ అప్‌డేట్, ‘స్కంద’ కలెక్షన్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Siddharth: ఎట్టకేలకు నోరు విప్పిన సిద్ధార్థ్, బెంగళూరు అవమానంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
Bhadrachalam: మంత్రి కేటీఆర్ పర్యటనలో విషాదం- నాలాలో పడి మహిళా హెడ్ కానిస్టేబుల్ మృతి
Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే
TDP Protest: ఎక్కడికక్కడ మోత మోగించిన టీడీపీ క్యాడర్ - చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా వినూత్న నిరసన !
/body>