అన్వేషించండి

Sonu Sood : శివ శంకర్ మాస్టర్‌కు సోనూసూద్ భరోసా.. నేను సాయం చేస్తా!

అప్పటి వరకూ తెరపై విలన్ గా మాత్రమే తెలిసిన సోనూ కరోనా కష్టకాలంలో ఎందరికో అండగా నిలిచారు. కష్టం అనే మాట వినగానే తానున్నా అని భరోసా ఇచ్చారు..ఇప్పటికీ ఇస్తున్నారు…

కరోనా.. కొందరిలో మానవత్వాన్ని చంపేస్తే మరికొందరిలో మానవత్వాన్ని తట్టిలేపింది. ఇలాంటి వారిలో ఒకరు సోనూసూద్. సోనూ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు, ఎంత రాసినా తక్కువే అయినప్పటికీ మళ్లీ తన గురించి చెప్పాల్సిన సందర్భం ఎందుకొచ్చిందంటే లెటెస్ట్ గా సోనూ చేసిన ట్వీటే కారణం.

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కరోనా సోకడంతో గత ఐదు రోజులుగా ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు 75 శాతం ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకినట్లు చెప్పారు. శివ శంకర్ మాస్టర్ పెద్ద కొడుక్కి కూడా కరోనా సోకి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు.  శివ శంకర్ మాస్టర్ భార్య హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. ఆయన చిన్న కొడుకు అజయ్ కృష్ణ ఒక్కడే ప్రస్తుతం తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తండ్రి వైద్యానికి చాలా ఖర్చవుతోందని అంత మొత్తాన్ని వెచ్చించే పరిస్థితుల్లో లేమని అజయ్ ఆవేదన చెందాడు. దీంతో సోషల్ మీడియాలో  కొందరు ఆ కుటుంబానికి సాయం చేయాలంటూ కోరుతూ ట్వీట్స్ చేశారు. దీనిపై స్పందించిన రియల్ హీరో సోనూ సూద్ తానున్నానంటూ అభయహస్తం ఇచ్చారు.  ” తాను ఇప్పటికే శివ శంకర్ మాస్టర్ ఫ్యామిలీ తో టచ్ లో ఉన్నాను. వారిని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. ఆందోళన అవసరం లేదు” అంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు.

కొరియోగ్రఫర్ గా శివశంకర్ స్థానం ప్రత్యేకం. 80వ దశకం నుంచి వివిధ భాషలకి చెందిన సినిమాలకి ఆయన డాన్స్ మాస్టర్ గా పనిచేశారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లోని ఎన్నో సినిమాలకి ఆయన డాన్స్ మాస్టర్ గా పనిచేశారు. ఎంతో మంది స్టార్ హీరోలకు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి ఆయన నృత్య దర్శకత్వాన్ని వహించారు. హీరోల బాడీ లాంగ్వేజ్  వాళ్ల ఏజ్ ను దృష్టిలో పెట్టుకుని డాన్స్ కంపోజ్ చేయడం ఆయన ప్రత్యేకత. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలు విని అభిమానులు ఆందోళనచెందుతున్నారు.  ఆ కుటుంబం త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.
Also Read: 'నగలు తిరిగిచ్చేయ్'.. ఆ లెటర్ నిజంగానే ఉదయ్ కిరణ్ రాశాడా..?

Also Read:డిసెంబర్ బరిలో మరో యంగ్ హీరో.. డేట్ లాక్ చేసేసుకున్నాడు..
Also Read: 'సిద్ధ' వచ్చేది అప్పుడే.. మెగాపవర్ మాస్.. రెడీగా ఉండండి..

Also Read: పబ్ లో టేబుల్ పైకెక్కి డాన్స్ లు.. 'ఆర్మీ ఆఫీసర్‌ అనే విషయం మర్చిపోయిందా..?'

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Suriya 44 Update: క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
Sivaji Raja: పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
Embed widget