Chiru : దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !
ఏపీ తీసుకొచ్చిన కొత్త సినిమా చట్టంపై చిరంజీవి స్పందించారు. దేశమంతా ఒకే జీఎస్టీ ఉందని సినిమా టిక్కెట్ రేట్లను ఇతర రాష్ట్రాల్లోలా నిర్ణయించాలని కోరారు.
![Chiru : దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి ! Movie ticket rates should be the same as in other states .. Chiranjeevi appeals to Jagan government! Chiru : దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/10/53083a25c818453ba260340e3f13ecee_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిన కొత్త సినిమా చట్టంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆన్‌లైన్ టిక్కెటింగ్ బిల్ ఆమోదించడం హర్షించదగ్గ విషయమన్న చిరంజీవి టిక్కెట్ రేట్ల విషయంలో మాత్రం ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. చిరంజీవి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు ప్రభుత్వమే అమ్మడాన్ని సమర్థించారు. పరిశ్రమే అడిగినందున ఆ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. అయితే చిరంజీవి తన ట్వీట్‌లో ప్రధానంగా టిక్కెట్ రేట్ల గురించే ఎక్కువగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు.
Appeal to Hon’ble @AndhraPradeshCM
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 25, 2021
Sri.@ysjagan pic.twitter.com/zqLzFX8hCh
Also Read : జూ. ఎన్టీఆర్ ప్రకటనపై టీడీపీలో అసంతృప్తి .. ఘాటుగా స్పందించలేదని విమర్శలు !
తగ్గించిన సినిమా టిక్కెట్లను కాలానుగుణంగా పెంచాలని కోరారు. దేశమంతా ఒకటే జీఎస్టీ ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు.. టిక్కెట్ ధరలు కూడా అదే విధంగా ఉండటం సమంజసమన్నారు. వివిధ రాష్ట్రాల్లో టిక్కెట్ రేట్లు ఎలా ఉన్నాయో.. ఏపీలో కూడా అంతే నిర్ణయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదే సమంజసమన్నారు. ఈ విషయం దయచేసి పునరాలోచించాలని .. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు సినీ పరిశ్రమ నిలదొక్కుకుంటందని చిరంజీవి విజ్ఞాపనా పూర్వకంగా తన ట్వీట్‌లో వివరించారు.
Also Read : పెద్ద హీరోల సినిమాలకు కోలుకోలేని దెబ్బ ! టాలీవుడ్ కింకర్తవ్యం ?
ఏప్రిల్‌లో ఏపీ ప్రభుత్వం సినిమా ధియేటర్లలో టిక్కెట్ రేట్లు ఎంతెంత ఉండాలో డిసైడ్ చేస్తూ జీవో జారీ చేసేసింది. ఈ జీవో ప్రకారం.. కార్పొరేషన్ ప్రాంతాల్లో మల్టిప్లెక్స్ లలో ప్రీమియం సీట్ల టిక్కెట్ రేట్లు రూ. 250 మాత్రమే ఉండాలి. మిగతా టిక్కెట్లు రూ. 150, 100 ఉండాలి. సింగిల్ ధియేటర్లు ఏసీ సౌకర్యం ఉంటే అత్యధిక రేటు రూ. 100 మాత్రమే. ఏసీ లేకపోతే.. అత్యధిక టిక్కెట్ ధర రూ. 60 . ఈ టిక్కెట్ రేట్లు జనాభా స్థాయిని బట్టి పట్టణాల్లో మారుతూ ఉంటాయి. పంచాయతీల్లో ఉన్న ధియేటర్లలో మరింత తక్కువ. ఈ రేట్లన్నీ పదేళ్ల కిందటివి.
Also Read : 'సిద్ధ' వచ్చేది అప్పుడే.. ఊరించి ఉసూరుమనిపించిన ‘ఆచార్య’ టీమ్
ప్రభుత జీవో ప్రకారం టిక్కెట్ రేట్లు అమ్మితే ధియేటర్ నిర్వహణ చార్జీలు కూడా రావని భావిస్తున్నారు. ప్రభుత్వంతో ఎన్ని సార్లు చర్చలుజరిపినా ప్రయోజనం లేకపోయింది. చివరికి నాగార్జున కూడా ఓ సారి వెళ్లి కలిసి వచ్చారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు చిరంజీవి విజ్ఞప్తిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నదానిపై ఆసక్తి ఏర్పడింది.
Also Read : ఏపీలో ఇక ఓన్లీ ఆన్ లైన్ మూవీ టిక్కెట్స్.. చట్టం ఆమోదం !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)