X

Perni Nani : ఏపీలో ఇక ఓన్లీ ఆన్ లైన్ మూవీ టిక్కెట్స్.. చట్టం ఆమోదం !

ఏపీలో ఇక సినిమా టిక్కెట్లను ప్రభుత్వమే విక్రయించనుంది. ఈ మేరకు బిల్లును ఆమోదించారు.

FOLLOW US: 

ఏపీ సినిమా (నియంత్రణ), సవరణ బిల్లు -2021 ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. సినిమా షోలను కొందరు ఇష్టానుసారంగా వేస్తున్నారని అందుకే నియంత్రణ తేవడానికే చట్టం మారుస్తున్నామని ప్రకటించారు.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరపున బిల్లును ప్రవేశపెడుతూ రాష్ట్ర సమాచార ప్రజాసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని బిల్లు లక్ష్యాలను ప్రకటనను చదివి వినిపించారు. భారతీయ రైల్వే ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ తరహాలో అతుకులు లేని ఆన్ లైన్ మూవీ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. 

Also Read : చంద్రబాబును ఏడిపించిన "ఆ నలుగురి"కి సెక్యూరిటీ పెంపు.. !

ప్రతిపాదిత ఆన్ లైన్ మూవీ బుకింగ్ సిస్టమ్ విధానం సౌకర్యంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఫోన్ ,  ఇంటర్నెట్ , ఎస్సెమ్మెస్‌లను పంపడం ద్వారా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సినిమా టిక్కెట్ ను పొందడానికి క్యూలలో నిలబడే సమయాన్ని ఆదా చేయడానికి ఉపకరిస్తుందని ప్రభుత్వం తెలిపింది.  ప్రతిపాదిత ఆన్ లైన్ మూవీ బుకింగ్ సిస్టమ్ ట్రాఫిక్ సమస్యలను కాలుష్యాన్ని తగ్గిస్తుంది. బ్లాక్ మార్కెటింగ్ కి చెక్ పెడుతుంది. ప్రతిపాదిత ఆన్ లైన్ బుకింగ్ సిస్టమ్ పన్ను ఎగవేతను అరికడుతుందని గడువులోగా జీఎస్టీని,  సేవా పన్నులు మొదలైన వాటిని వసూలు చేయడానికి రెవెన్యూ డిపార్ట్ మెంట్ కు వీలు కల్పిస్తుందని ఈ బిల్లు పేర్కొంది.

Also Read : ఏపీలో రోడ్లు బాగు చేసుకుంటున్న జనం ! జనం కష్టాలు చూడలేక ఆ యువకుడు రూ. 2 లక్షలు పెట్టి..

ఆ చట్టం ప్రకారం ఇక ఏపీలో ఎలాంటి సినిమాలు నాలుగు షోలు మాత్రమే వేస్తారు. బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఉండదు. ప్రస్తుతం ఆరేడు షోలు వేస్తూ ప్రజల్ని దోపిడి చేస్తున్నారని మంత్రి పేర్ని అసెంబ్లీలో సినిమా పరిశ్రమపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏం చేసినా ఎవరూ ఏమీ అనరు అనే ఉద్దేశంలో సినిమా వాళ్లున్నారని పేర్ని నాని విమర్శించారు. పేద, మధ్య తరగతి ప్రజలకు వినోదం సినిమా కాబట్టి.. వారి బలహీనతులు సొమ్ము చేసుకోకుండా ప్రభుత్వం కాపాడుతుందన్నారు. ఆన్ లైన్ టిక్కెట్ విధానం వల్ల మాత్రమే ఇది సాధ్యమని..స్పష్టం చేశారు. ప్రస్తుతం సినిమాల వసూళ్లు, జీఎస్టీని పోల్చి చూసుకుంటే పొందనే లేదన్నారు. అయితే తమ బిల్లుపై కొన్ని మీడియా సంస్థలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.

Also Read : టూరిస్టులను నట్టేట ముంచిన ట్రావెల్స్ కంపెనీ.. మధ్యలో వదిలేసి పరార్

ఆన్‌లైన్‌ విధానంలో టికెట్‌ ఇచ్చే పద్ధతి తేవాలని నిర్ణయించుకుని బిల్లును అసెంబ్లీ ముందు పెట్టామన్నారు. బిల్లు ఆమోదం పొందడంతో ఏపీ వ్యాప్తంగా ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం తప్పనిసరిగా అమలు కానుంది. పూర్తి స్థాయిలో అమలు ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం రూపొందించే ఆన్ లైన్ బుకింగ్ ప్లాట్ ఫారమ్ ద్వారానే ప్రేక్షకులు టికెట్లు కొనాల్సి ఉంటుంది. థియేటర్లలో టికెటింగ్‌కి అనుమతి ఉండదు. ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంపై ఇప్పటికే  సినీ పెద్దలతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. అందరూ అంగీకరించారు. తమకు సమ్మతమేనని టాలీవుడ్ పెద్దలు కూడా తెలిపారు. దీంతో  బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. 

Also Read: TG Venkatesh : రాజధాని ఫార్ములా రెడీ.. జగన్ సై అంటే బీజేపీని ఒప్పిస్తానన్న ఎంపీ టీజీ వెంకటేష్ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: ANDHRA PRADESH cm jagan perni nani Cinema Act AP Online Tickets AP Theaters

సంబంధిత కథనాలు

Trivikram Srinivas: త్రివిక్ర‌మ్‌కు, ఏపీ మంత్రి పేర్ని ప్రస్తావించిన ట్వీట్‌కు సంబంధం లేదు

Trivikram Srinivas: త్రివిక్ర‌మ్‌కు, ఏపీ మంత్రి పేర్ని ప్రస్తావించిన ట్వీట్‌కు సంబంధం లేదు

Tirumala: శ్రీవారి సర్వ దర్శనం టిక్కెట్లు విడుదల.. రోజుకు పది వేల చొప్పున కేటాయించిన టీటీడీ 

Tirumala: శ్రీవారి సర్వ దర్శనం టిక్కెట్లు విడుదల.. రోజుకు పది వేల చొప్పున కేటాయించిన టీటీడీ 

Poor States : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !

Poor States :  పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !

Breaking News: నారాయణపూర్‌లో నక్సలైట్లు మళ్లీ బీభత్సం.. పోస్టర్ల కలకలం

Breaking News: నారాయణపూర్‌లో నక్సలైట్లు మళ్లీ బీభత్సం.. పోస్టర్ల కలకలం

Crop Damage: నెల్లూరు పంట నష్టం అంచనా 8.5కోట్ల రూపాయలు..

Crop Damage: నెల్లూరు పంట నష్టం అంచనా 8.5కోట్ల రూపాయలు..
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Public Holidays 2022: తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవు దినాలు ఇవే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

Public Holidays 2022: తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవు దినాలు ఇవే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

Silent Killers: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త

Silent Killers: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త

Monal Gajjar Photos: అందం ఉన్నా... అదృష్టం కలిసిరాని మోనాల్

Monal Gajjar Photos:  అందం ఉన్నా... అదృష్టం కలిసిరాని మోనాల్

Bigg Boss 5 Telugu: 'ఎవరో అలిగారని డైవర్ట్ అవ్వకు'.. షణ్ముఖ్ కి తల్లి సలహా.. తండ్రిని వదల్లేక ఏడ్చేసిన వియా.. 

Bigg Boss 5 Telugu: 'ఎవరో అలిగారని డైవర్ట్ అవ్వకు'.. షణ్ముఖ్ కి తల్లి సలహా.. తండ్రిని వదల్లేక ఏడ్చేసిన వియా..