War 2 First Song: 'వార్ 2' కోసం 'బ్రహ్మాస్త్ర' టీం... 'ఆవన్ జావన్'కు, 'బ్రహ్మాస్త్ర' సినిమాలోని 'కేసరియా'కు కనెక్షన్... ఏమిటో తెలుసా?
Hrithik Roshan Kiara Advani Song: దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన 'వార్ 2'లోని హృతిక్ రోషన్, కియారా అద్వానీ డ్యూయెట్ సాంగ్ కోసం 'బ్రహ్మాస్త్ర' సినిమాలోని 'కేసరియా' టీం రంగంలోకి దిగింది.

'వార్ 2' సినిమా ఫీవర్ మొదలైంది. ఆగస్టు 14న థియేటర్లలోకి మూవీ రానుంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై బజ్ మరింత పెరిగింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఓ హీరోగా నటించడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ నెలకొంది. ఇందులో పాటల కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే, ఫస్ట్ సాంగ్‌లో ఎన్టీఆర్ ఉండరు. ఆ పాటను హృతిక్ రోషన్, కియారా అద్వానీ మీద తీశారు. ఆ సాంగ్ అప్డేట్ ఏమిటంటే...
'వార్ 2'లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఈ వారమే!
హృతిక్ రోషన్, కియారా అద్వానీ మీద 'వార్ 2' కోసం 'ఆవన్ జావన్' అని ఓ సాంగ్ తెరకెక్కించారు. ఈ వారం ఆ పాటను విడుదల చేయనున్నట్లు యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ తెలిపింది. దాంతో పాటు మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏమిటంటే...
వార్ 2 కోసం రంగంలోకి 'బ్రహ్మాస్త్ర' సాంగ్ టీం!
'వార్ 2' సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంటే ముందు ఆయన తీసిన సినిమా 'బ్రహ్మాస్త్ర'. అందులోని 'కేసరియా' సాంగ్ దేశం అంతటినీ ఊపేసింది. ఇప్పుడు మరోసారి ఆ సాంగ్ టీంను అయాన్ 'వార్ 2' కోసం రంగంలోకి దించారు.
'వార్ 2' సినిమాలో ఓ డ్యూయెట్ సాంగ్ ఉంది. అదే హృతిక్ రోషన్, కియారా అద్వానీ మీద చిత్రీకరించిన పాట 'ఆవన్ జావన్'. ఆ పాట కోసం తన బ్లాక్ బస్టర్ 'కేసరియా' సంగీత బృందాన్ని రంగంలోకి దించారు అయాన్ ముఖర్జీ. ప్రీతమ్, అరిజిత్ సింగ్, అమితాబ్ భట్టాచార్య కలిసి 'వార్ 2'లో సాంగ్ కోసం పని చేశారు. త్వరలో (అంటే ఈ వారం) ఆ పాటను విడుదల చేసి మరింత హైప్ పెంచాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. 'వార్ 2' నుంచి వచ్చే మొదటి పాట ఇదే. ఇందులో హృతిక్, కియారా మధ్య ప్రేమను చూపించబోతున్నారట.
Also Read: నాగ్ మామ కాదు... నాగ్ సామ - అదీ జపాన్‌లో మన కింగ్ క్రేజ్!
'వార్ 2'లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఈ వారమే!
— ABP Desam (@ABPDesam) July 29, 2025
#AavanJaavan #War2 #HrithikRoshan #KiaraAdvani pic.twitter.com/ryetLgRfeG
War 2 Release Date: సినిమా విషయానికి వస్తే... ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషలలో 'వార్ 2' థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లో దర్శకుడు అయాన్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ ఎత్తున నిర్మించింది.





















